ఇంటర్ ఫలితాల్లో బిసీ గురుకుల విద్యార్థుల ర్యాంకుల పంట
ఎంపిసిలో 4,5, 6 ర్యాంకులు సాధించిన 32 మంది విద్యార్థులు
బైపిసిలో 6,7 ర్యాంకులు సాధించిన 9మంది విద్యార్థులు
సీనియర్ ఇంటర్ లో 44మంది విద్యార్థులకు పదిలోపు ర్యాంకులు
జూనియర్ ఇంటర్ ఎంపిసిలో 1,2 ర్యాంకులతో సహా పది లోపు ర్యాంకులు సాధించిన 230 మంది విద్యార్థులు
బైపిసిలో 4,5 ర్యాంకులతో సహా 55 మంది విద్యార్థులకు పదిలోపు ర్యాంకులు
హెచ్ ఈసి లో ఫస్ట్, సెకండ్ ర్యాంక్, సిఈసిలో పదిలోపు ర్యాంకులు సాధించిన 7మంది విద్యార్థులు
ఎంఈసీలో 4,6 ర్యాంక్ తో సహా పదిలోపు ర్యాంకులు సాధించిన 5గురు విద్యార్థులు
జూనియర్ ఇంటర్ లో 301 మంది విద్యార్థులకు పదిలోపు ర్యాంకులు
వృత్తి విద్యా కోర్సుల్లో ప్రతిభ కనబరిచిన 17 మంది విద్యార్థులు
విద్యార్థులను, బోధనా సిబ్బందిని అభినందించిన మంత్రి గుంగుల కమలాకర్,
ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తు,
బీసీ గురుకుల కార్యదర్శి డాక్టర్ మల్లయ్య బట్టు
హైదరాబాద్ : ఈ ఏడాది 2022-23 ఇంటర్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిభా పూలే బిసీ గురుకుల విద్యార్థులు అత్యధిక ర్యాంకులు సాధించి తమ సత్తాను చాటారు. వందల సంఖ్యలో విద్యార్థులు పదిలోపు ర్యాంకులు సాధించి ఫలితాల్లో ప్రభంజనం కొనసాగిస్తున్నారు.
సీఎం కేసీఆర్ సకల సౌకర్యాలతో ఉన్నత స్థాయి నాణ్యతా ప్రమాణాలతో బీసీ బిడ్డలకు అందించిన విద్య ఫలితమే ఈ రిజల్ట్స్ అన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్. మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులను, బీసీ గురుకుల సిబ్బందిని అభినందించారు.
నేడు వెలువడిన పలితాలలో సీనియర్ ఇంటర్ లో 44మంది విద్యార్థులు పదిలోపు ర్యాంకులు సాధించగా ఆరు కాలేజీలు వంద శాతం ఉత్తీర్ణతతో సహా సీనియర్ ఇంటర్ లో 86.67ఉత్తీర్ణతా శాతం సాధించారు. జూనియర్ ఇంటర్ లో 301 మంది విద్యార్థులు పదిలోపు ర్యాంకులు సాధించగా మూడు కాలేజీలు వందశాతం ఉత్తీర్ణతా సాధించాయి. జూనియర్ ఇంటర్ లో 78.78 ఉత్తీర్ణత శాతం సాధించారు.
ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షకు 8527 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 8516మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వారిలో 7381 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా ఏ గ్రేడ్ సాధించిన వారు 5812, బి గ్రేడ్ సాధించిన వారు 1225, సి గ్రేడ్ సాధించిన విద్యార్థులు 301 కాగా 43మంది విద్యార్థులు డి గ్రేడ్ పొందారు. ఇక ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 8434 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా వారిలో 8425 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
వారిలో 6637మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా వారిలో ఏ గ్రేడ్ సాధించిన విద్యార్థులు 4135, బి గ్రేడ్ సాధించిన విద్యార్థులు 1695, సి గ్రేడ్ సాధించిన విద్యార్థులు 604 కాగా 203మంది విద్యార్థులు డి గ్రేడ్ పొందారు.
సీనియర్ ఇంటర్ లో ర్యాంకులు సాధించిన విద్యార్థుల వివరాలు..
ఎంపీసీ లో 4వ ర్యాంక్ శ్రీజ, ఖానాపూర్, 991 మార్కులు, 5వ ర్యాంక్ కె. మహేశ్, చిట్యాల, 990 మార్కులు సాధించగా మరో 33మంది విద్యార్థులు పది లోపు ర్యాంకులు సాధించారు. బైపీసీలో సంగారెడ్డి కాలేజీ విద్యార్థులు 6వ ర్యాంక్ పల్లవి, 989 మార్కులు, 7వ ర్యాంకు నందిని, 988 మార్కులు, సాధించారు.
మరో 9మంది విద్యార్థులు పది లోపు ర్యాంకులు సాధించారు. ఎంఈసి లో అనిత, కల్వకుర్తి, 981 మార్కులతో 8వ ర్యాంక్ సాధించింది. సిఇసి లో దీక్షిత, ఖానాపూర్, 977 మార్కులతో 8వ ర్యాంక్, అభి సాత్విక, రామగుండం, 976 మార్కులతో 9వ ర్యాంకు సాధించారు.
జూనియర్ ఇంటర్ లో ర్యాంకులు సాధించిన విద్యార్థుల వివరాలు...
ఎంపీసీలో 1 వ ర్యాంకు హరిత, మందమర్రి, 468 మార్కులు , రెండవ ర్యాంకు 467 మార్కులతో భూమిక, సికింద్రాబాద్, కీర్తి, చందుపట్ల ఇద్దరు విద్యార్థులు సాధించారు. వీరిలో పాటు 230మంది పది లోపు ర్యాంకులు సాధించారు. బైపీసీలో 4 వ ర్యాంక్ రిషిత, వరంగల్,435 మార్కులు , 5వ ర్యాంక్ 434 మార్కులతో పది మంది విద్యార్థులు, మొత్తం 55మంది విద్యార్థులు పది లోపు ర్యాంకు సాధించారు.
ఎంఈసీలో 492 మార్కులతో 4వ ర్యాంక్ స్వప్న, సంగారెడ్డి, మధులత, జగ్దేవ్ పూర్ , సాధించగా పది మంది విద్యార్థులు పది లోపు ర్యాంకులు సాధించారు. హెచ్ ఈసీలో ఫస్ట్ ర్యాంక్ నాగరాణి, ఎల్ ఎం డి కాలనీ, 489 మార్కులు, 2వ ర్యాంకు నాగ త్రిష, లంకపల్లి, 488 మార్కులు సాధించారు. సీఈసీలో 5వ ర్యాంక్ ప్రవల్లిక, జగ్దేవ్ పూర్ , 488 మార్కులు సాధించగా మరో ఏడుమంది విద్యార్థులు పదిలోపు ర్యాంకులు సాధించారు.
ఇంటర్ ఫలితాల్లో బీసీ గురుకుల విద్యార్థులు సాధించిన ప్రతిభను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అభినందించారు. పేద బీసీ విద్యార్థులకు ఉన్నత విద్య అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బిసీ గురుకుల విద్యాసంస్థలను ఇంటర్మీడియెట్ వరకు అప్ గ్రేడ్ చేశారని, గతంలో 19గా ఉన్న జూనియర్ కాలేజీల సంఖ్యను 142కు పెంచడంతో వేలాది మంది విద్యార్థులు చదువుకుని తమ జీవితాలను చక్కదిద్దుకునేందుకు మార్గం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు.
ర్యాంకులు సాధించిన విద్యార్థులను, బోధనా సిబ్బందిని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తు అభినందించారు. ఇంటర్ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటూ బీసీ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ మల్లయ్య బట్టు విద్యార్థులను అభినందించారు.