డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన AIRRF సంస్థ, వక్తలు ఏమన్నారంటే…

హైదరాబాద్ : డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను సికిందరాబాద్‌లో AIRRF సంస్థ ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి శివకుమార్ అధ్యక్షతన జరిగింది. ఎస్. శ్రీధర్, NRC రాజు, గోపాల్ నాయుడు, ముత్తయ్య, గిరిజా, భాస్కర్, విల్సన్, విజయకుమార్ తదితరులు ప్రసంగించారు. అంబేడ్కర్ భావనలను, నిజమైన ప్రజాస్వామ్యాన్ని రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో సాధించాల్సిన అవసరం మీద ప్రత్యేక దృష్టి పెట్టారు.

ఇది కూడ చదవండి-

భారతదేశంలో నిజమైన ప్రజాస్వామ్య పరిస్థితి లేకపోవడం, సమానత్వం లేనట్టు, దళితులపై జరుగుతున్న అమానుషాలు ఇంకా కొనసాగుతున్నట్టు స్పష్టం చేశారు. రాజ్యాంగం దళయుచేస్తుండగా, న్యాయస్థానాలు కూడా కొన్ని తీర్పుల ద్వారా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాయని అన్నారు. సరికొత్త సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ చైతన్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ప్రసంగించిన వక్తలు ఈ విషయాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X