Black Day: “డాడీ… డాడీ… దిగు డాడీ” అని కొడుకు, కూతురు ఎంత వేడుకున్నా… తువ్వాలతోనే ఉరేసుకొని ప్రాణాలు విడిచాడు రైతు

Hyderabad : తెలంగాణలోని కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మెంగారం గ్రామంలో విషాదకర ఘటన జరిగింది. మనస్తాపంతో ఓ రైతన్న కఠిన నిర్ణయం తీసుకున్నాడు. తన ఇద్దరు పిల్లలు… వద్దు డాడీ… అంటూ వేడుకున్నా… వినకుండా ప్రాణాలు తీసుకున్నాడు. అందరూ చూస్తుండగానే… సెల్ టవర్ మీద… తువ్వాలతోనే ఉరేసుకుని ప్రాణం తీసుకున్నాడు.

మెంగారం గ్రామానికి చెందిన ఆంజనేయులు (35) అనే రైతు సోమవారం సెల్‌టవర్‌ ఎక్కి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అందరి హృదయాలను కలచివేసింది. గ్రామంలో ఉన్న చెరువు సమీపంలోనే ఆంజనేయులుకు కొంత భూమి ఉంది. భూమి మీదుగా పంట కాలువ నీరు వెళ్తుండటంతో చేసేదేమీ లేక.. కనీసం పరిహారమైనా చెల్లించాలని నాలుగేళ్లుగా అధికారులకు మొరపెట్టుకున్నాడు. పంట కాలువ ద్వారా లబ్ధి పొందుతున్న గ్రామస్థులను కూడా వేడుకున్నాడు. కానీ లాభం లేకుండా పోయింది.

గడేడాది రైతులెవ్వరూ చెరువు కింద పంటలు సాగు చేయకపోవటంతో… ఎలాంటి ఇబ్బంది రాలేదు. అయితే… ఈసారి మళ్లీ పంటలు సాగుచేసేందుకు చెరువు కింది రైతులు సిద్ధమయ్యారు. దీంతో మళ్లీ తన భూమి మీదుగా పంట నీరు వెళ్తుందని ఆంజనేయులు మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం రోజు సెల్‌ఫోన్‌ టవర్‌ ఎక్కి ఎస్సై శంకర్‌, తహసీల్దార్‌ మారుతితో ఫోన్‌లో మాట్లాడాడు. తన సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదని… తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. తన పిల్లలు “డాడీ.. డాడీ.. దిగు డాడీ” అని కొడుకు, కూతురు ఎంత వేడుకున్నా… తన నిర్ణయం మార్చుకోలేదు. తన తువ్వాలతోనే ఉరేసుకొని ప్రాణాలు విడిచాడు. పోలీసులు మృతదేహాన్ని కిందకు దించి… పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. (Agencies)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X