లిథియం, నికెల్ ప్రాసెసింగ్ కోసం రూ.2,814 కోట్లతో తీసుకురానున్న క్యాపెక్స్ సపోర్ట్ స్కీమ్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం, హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో 2047 నాటికి వికసిత భారత్‌గా రూపుదిద్దుకోనుంది. ఈ ప్రయాణంలో బొగ్గు, గనుల రంగం కీలక పాత్రపోషించనుంది. ముఖ్యంగా క్రిటికల్ మినరల్స్ అత్యంత కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో క్రిటికల్ మినరల్స్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, క్రిటికల్ మినరల్స్ రంగంలో ఆత్మ నిర్భరత సాధించేందుకు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ నేపథ్యంలో దేశంలో లిథియం, నికెల్ వంటి క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు రూ.2,814 కోట్లతో కేంద్ర గనుల శాఖ తీసుకురానున్న క్యాపెక్స్ సపోర్ట్ స్కీమ్‌కు బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోదం తెలపడం సంతోషంగా ఉంది. మంత్రి జి. కిషన్ రెడ్డి విడుదల చేసిన పత్రికా ప్రకటనలో అన్నారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కొత్త ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా.. దాదాపు రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. అలాగే, ఈ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే ప్రాసెస్డ్ మినరల్స్ విలువ ఏటా రూ.25,000 కోట్లు ఉంటుందని భావిస్తున్నాం. అంతేకాకుండా భారీగా ఉపాధి పెరగడంతో పాటు.. స్థానికంగా అనుబంధ రంగాలు అభివృద్ధి చెందేందుకు పుష్కలమైన అవకాశం ఉంది.

అంతేకాకుండా, అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ ప్రోగ్రామ్, క్లీన్ ఎనర్జీ అండ్ బ్యాటరీ స్టోరేజ్ టార్గెట్స్, రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ స్కీమ్, ఇండియా సెమీ కండక్టర్ మిషన్ వంటి కార్యక్రమాలకు అవసరమైన క్రూడ్ మినరల్స్‌ను అందించడంలో కూడా ఈ స్కీమ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం క్రిటికల్ మినరల్స్ దిగుమతులపై ఇంపోర్ట్ డ్యూటీ ఎత్తేయడంతో పాటు క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్‌కు వినియోగించే యంత్రాలపై కూడా ఇంపోర్ట్ డ్యూటీ తొలగించింది. ఈ చర్యలు తాజా ఇన్సెంటివ్ పథకానికి మరింత తోడ్పాటు అందిస్తుంది.

ఇది కూడ చదవండి-

ప్రపంచవ్యాప్తంగా లిథియం, నికెల్, కోబాల్ట్ వంటి క్రిటికల్ మినరల్స్ కు భారీగా డిమాండ్ ఉంది. లిథియం, నికెల్ మినరల్స్‌ అవసరాల కోసం ప్రస్తుతం దిగుమతులపై ఆధారపడుతున్నాం. దిగుమతుల భారాన్ని తగ్గించడంతో పాటు క్రిటికల్ మినరల్స్ వ్యాల్యూ చైన్‌ను బలోపేతం చేసేందుకు కేంద్రప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకోసం నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ అమలు చేస్తున్నాం. ఈ మిషన్ ద్వారా క్రిటికల్ మినరల్స్ ఎక్స్‌ప్లొరేషన్, తవ్వకాలు, రీసైక్లింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, ప్రాసెసింగ్ వంటి అన్ని అంశాలపై మిషన్ మోడ్‌లో కృషి చేస్తున్నాం. తద్వారా క్రిటికల్ మినరల్స్ దిగుమతుల భారం తగ్గనుంది. క్రిటికల్ మినరల్స్ సప్లయ్ చైన్ లో కీలకమైన ప్రాసెసింగ్ కోసం దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా రాష్ట్రాల్లో 4 క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్ పార్కులను ఏర్పాటు చేస్తున్నాం.

ఎలక్ట్రిక్ వెహికిల్స్, ఫోన్లు, ల్యాప్‌టాప్స్, బ్యాటరీలు, స్టెయిన్‌లెస్ స్టీల్ తయారీలో లిథియం, నికెల్ మినరల్స్ అత్యంత కీలకమైనవి. దేశంలో లిథియం, నికెల్‌కు సంబంధించి సరైన నిల్వలు లేవు. అంతేకాకుండా తగిన రిఫైనింగ్ సామర్థ్యం కూడా అందుబాటులో లేవు. 2017-18లో లిథియం దిగుమతుల కోసం రూ.6,500 కోట్లు ఖర్చు కాగా, ప్రస్తుతం ఈ ఖర్చు రూ.50,000 కోట్లకు పెరిగింది. దిగుమతులను తగ్గించుకోవడంతో పాటు మినరల్స్ రంగంలో ఆత్మనిర్భరత సాధించేందుకు విదేశాల్లో ప్రభుత్వ రంగ సంస్థ KABIL ద్వారా అర్జెంటీనాలో 5 లిథియం మైనింగ్ బ్లాకులను కొనుగోలు చేశాం. అక్కడ ప్రస్తుతం ఎక్స్ ప్లొరేషన్, అనుమతుల ప్రక్రియ కొనసాగుతోంది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా దేశంలో క్రిటికల్ మినరల్స్ కోసం 901 ప్రాజెక్టులను చేపట్టాం. 56 క్రిటికల్ మినరల్స్ బ్లాకులను విజయవంతంగా వేలం వేశాం.

క్రిటికల్ మినరల్స్ రంగంలో రీసెర్చ్, డెవలప్‌మెంట్ ప్రోత్సహించేందుకు దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీల సంస్థల్లో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటివరకు 9 కేంద్రాలను ఏర్పాటు చేశాం. వీటిద్వారా క్రిటికల్ మినరల్స్ రంగంలో రీసెర్చ్, సాంకేతిక పరిజ్ఞానం, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా ముందుకు ముందుకు సాగుతున్నాయి. ఇటీవల రాయ్‌పూర్‌లోని NIT కాన్వకేషన్‌లో పాల్గొన్న సందర్భంగా ఈ రంగంలో జరుగుతున్న పురోగతిని పరిశీలించాను.

దేశంలో మినరల్స్ రీసైక్లింగ్‌‌ను ప్రోత్సహించేందుకు రూ.1,500 కోట్ల ఇన్సెంటివ్ స్కీం ప్రారంభించాం. ఈ పథకంమ కింద ఇప్పటివరకు 58 కంపెనీల దరఖాస్తులకు ఆమోదం లభించింది. అంతేకాకుండా గనుల నుంచి వెలువడే ఓవర్‌బర్డెన్, డంప్స్, టైలింగ్స్‌లో ఉన్న క్రిటికల్ మినరల్స్‌ను వెలికితీసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. 2025 మేలో రూపొందించిన ఈ కార్యాచరణ ద్వారా ఇప్పటివరకు 311 గనుల నుంచి 2,383 మినరల్స్ నమూనాలను సేకరించి, పరీక్షించాం. ఫలితంగా కొన్ని గనుల్లో కాడ్మియం, వెనెడియం ఉత్పత్తి ప్రారంభమైంది. 1,486 టన్నుల కాడ్మియం, 1,261 టన్నుల వెనెడియం ఉత్పత్తి జరుగుతోంది. టైలింగ్స్, డంప్స్ నుంచి గాలియం, జెర్మేనియం, యాంటిమనీ, మాలిబ్డినం వంటి మినరల్స్‌ను వెలికితీసేందుకు మరో 13 పైలట్ ప్రాజెక్టులపై శరవేగంగా పనులు జరుగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar