రైల్వే ఉద్యోగుల బోనస్ లెక్కింపు పరిమితిని రూ. 28,440కి పెంచాలి : SCREU

హైదరాబాద్ : ఈ రోజు జరిగిన దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ (SCREU) కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో రైల్వే ఉద్యోగుల బోనస్ విధానంపై ఏకగ్రీవంగా ఒక కీలక తీర్మానం చేయడం జరిగింది. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఆగస్టు 25న జారీ చేసి, భారతదేశ గెజిట్ నెం. 4525 ద్వారా ప్రచురించిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా రైల్వే ఉద్యోగుల బోనస్ ఫార్ములాను సవరించాలని ఈ సమావేశం గట్టిగా డిమాండ్ చేసింది.

ఈ నోటిఫికేషన్ ప్రకారం, బోనస్‌ను వేతనంగా రూ. 7,000 లేదా ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనం ప్రాతిపదికన లెక్కించాలి. ప్రస్తుతం రైల్వే ఉద్యోగుల కనీస వేతనం రూ. 28,440గా ఉన్నందున, బోనస్‌ను ఇదే మొత్తంపై లెక్కించి చెల్లించాలి. రైల్వే ఉద్యోగులకు మంజూరు చేస్తున్న ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (PLB) 2010-11 నుంచి ఇప్పటివరకు కేవలం 78 రోజుల వేతనానికే పరిమితమైంది. అలాగే, లెక్కింపు గరిష్ట పరిమితి (సీలింగ్) కూడా గత అనేక సంవత్సరాలుగా రూ. 7,000 వద్దే నిలిచిపోయింది.

మరోవైపు, రైల్వేలో సిబ్బంది సంఖ్య లక్ష వరకు తగ్గినా, ఉద్యోగుల కష్టంతో ఉత్పాదకత మాత్రం గణనీయంగా పెరిగింది. భారతీయ రైల్వేలో సరుకు రవాణా (Freight traffic) 2010-11లో 921.73 మిలియన్ టన్నులు ఉండగా, 2024-25 నాటికి అది 1610 మిలియన్ టన్నులకు పెరిగింది (సుమారు 75 శాతం వృద్ధి). ఇక ఆదాయం పరంగా చూస్తే, సరుకు రవాణా ద్వారా వచ్చే ఆదాయం 2010-11లో రూ. 62,844 కోట్లు ఉండగా, 2024-25 నాటికి రూ. 1.75 లక్షల కోట్లకు (సుమారు 178 శాతం వృద్ధి) చేరుకుంది.

Also Read-

ఉద్యోగులలో తీవ్ర ఆందోళన మరియు అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలో, రైల్వే మంత్రిత్వ శాఖ తక్షణమే స్పందించి బోనస్ లెక్కింపు సీలింగ్‌ను రూ. 28,440కి సవరించాలని మరియు 2025-26 సంవత్సరానికి పీఎల్‌బీ (PLB) రోజుల సంఖ్యను పెంచాలని ఎస్.సి.ఆర్.ఇ.యూ డిమాండ్ చేస్తోంది. బోనస్ సాధన కోసం కలిసికట్టుగా పోరాడాలని అన్ని రైల్వే యూనియన్లకు, అసోసియేషన్లకు ఎస్.సి.ఆర్.ఇ.యూ పిలుపునిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar