హైదరాబాద్ : తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవం కోసం రెండు దశాబ్దాలుగా పాటు పడుతున్న తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షులుగా మారిపెల్లి మాధవిని నియమించారు. తెలంగాణ జాగృతి ఫౌండర్ చైర్ పర్సన్ కల్వకుంట్ల కవిత సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో ఈ ప్రాంత సాంస్కృతిక వైభవాన్ని, చారిత్రక నేపథ్యాన్ని పరిరక్షించి ప్రపంచానికి పరిచయం చేసేందుకు కల్వకుంట్ల కవిత 2006లో తెలంగాణ జాగృతి స్థాపించారు. తెలంగాణ పల్లెకు పరిమితమైన బతుకమ్మను విశ్వవ్యాప్తం చేశారు. బతుకమ్మలతో మహిళలు పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమంలోకి వచ్చేలా తోడ్పాటునందించారు.
Also Read-
రెండు దశాబ్దాల పాటు కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. తాను ఫౌండర్ చైర్ పర్సన్ గా కొనసాగుతూ జాగృతి నూతన అధ్యక్షులుగా మాధవిని నియమించారు. మాధవి నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని ప్రకటించారు.
