ఢిల్లీలో విద్యార్థులపై దమనకాండను నిరసిస్తూ తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం నేతల నిరవధిక నిరాహార దీక్ష, ఉస్మానియాలో విద్యార్థుల దీక్ష భగ్నం

హైదరాబాద్ / కరీంనగర్ : నీట్ పరీక్ష పేపర్ లీకేజీని నిరసిస్తూ ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల దమనకాండను నిరసిస్తూ తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం నాయకులు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. గురువారం ఉస్మానియా యూనివర్సిటీతో పాటు కరీంనగర్ లోని శాతవాహన యూనివర్సిటీలో ఏకకాలంలో నిరాహార దీక్ష ప్రారంభించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఎదుట తెలంగాణ రక్షణ సేన విద్యార్థి నాయకులు చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసి వర్సిటీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ లో విద్యార్థి నాయకులు దీక్ష కొనసాగించారు. శాతవాహన యూనివర్సిటీలో విద్యార్థి నాయకులు దీక్ష కొనసాగిస్తున్నారు.

ఆర్ట్స్ కాలేజీ ఎదుట విద్యార్థుల నిరాహార దీక్ష

ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదుట తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం నాయకులు రాము యాదవ్, నవీన్ గౌడ్, రవి రాథోడ్, అజయ్, రాజ్ కుమార్, దీపక్, శేఖర్ గురువారం ఉదయం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. క్యాంపస్ లో నిరాహార దీక్ష చేయడానికి అనుమతి లేదంటూ వర్సిటీ పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది.

ప్రజాస్వామ్య పద్ధతిలో తాము నిరాహార దీక్ష చేస్తుంటే అడ్డుకోవడం ఏమిటని విద్యార్థులు ప్రశ్నించారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రిజైన్ చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న 21 మంది విద్యార్థులకు న్యాయం చేయాలని, ఢిల్లీలో విద్యార్థులపై దమనకాండకు పాల్పడిన పోలీసుల పై చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి వర్సిటీ ఠాణాకు తరలించగా పోలీస్ స్టేషన్ లో దీక్ష కొనసాగించి, సాయంత్రం దీక్ష విరమించారు.

Also Read-

శాతవాహన యూనివర్సిటీలో కొనసాగుతున్న దీక్ష

శాతవాహన యూనివర్సిటీ క్యాంపస్ లో తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం నాయకులు చెన్నమల్ల చైతన్య, బండ అశోక్, ఉట్కూరి అనూప్ రెడ్డి, సడిగే రాజశేఖర్, షేక్ తాజ్ బాబా గురువారం ఉదయం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే స్పందించి కేంద్ర మంత్రివర్గం నుంచి ధర్మేంద్ర ప్రదాన్ ను తప్పించాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం అత్యంత బాధ్యతా రాహిత్యమన్నారు.

తెలంగాణలో పరీక్షలు సరిగా నిర్వహించలేని వాళ్లు ఢిల్లీకి వెళ్లి విద్యార్థుల ఆందోళనలకు సంఘీభావం తెలపడం విడ్డూరంగా ఉందన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి యూపీఎస్సీ తరహా స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాలు కోరుతున్నట్టుగా రాష్ట్ర స్థాయిలోనే మెడికల్ ప్రవేశ పరీక్షలు నిర్వహించే అంశంపై కేంద్రం ఆలోచన చేయాలని కోరారు. కేంద్రం స్పందించే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తామని శాతవాహన యూనివర్సిటీ తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం నాయకులు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X