హైదరాబాద్ : తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలు (Sports Meet 2026) హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడా సంబరాలకు టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ నిరంతరం విధుల్లో బిజీగా ఉండే ఉద్యోగులకు ఈ క్రీడలు ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయని చెప్పారు. క్రీడల ప్రధాన ఉద్దేశం కేవలం గెలవడం మాత్రమే కాదని, అందరూ కలిసికట్టుగా పాల్గొనడమే అసలైన విజయమని ఆమె పేర్కొన్నారు.ఉద్యోగుల మధ్య ఐక్యత పెంచడానికి, స్నేహభావం చాటడానికిఆరోగ్యకరమైన పోటీ తత్వం పెంపొందించడానికి ఈ పోటీలు తోడ్పడతాయని వివరించారు.క్రీడాకారులందరూ జట్టు స్ఫూర్తితో ఆడాలని సూచించారు.
Also Read-
ఈ క్రీడా వేడుకల్లో భాగంగా సంస్థకు చెందిన పురుష, మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో స్టేడియం లో సందడి వాతావరణం నెలకొంది. రెండు రోజుల పాటు సాగే ఈ మీట్‌లో అథ్లెటిక్స్, క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్ మరియు లెమన్ స్పూన్ , స్విమ్మింగ్ వంటి పలు రకాల పోటీలలో పాటు చెస్, క్యారమ్స్ వంటి ఇండోర్ గేమ్స్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
