టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ చేతుల మీదుగా ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు పురస్కారాలు

హైదరాబాద్ : ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా “విద్య విజయోత్సవం” వేడుకలను ఆదివారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యా, క్రీడా రంగాల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో విశిష్ట ప్రతిభ కనబరిచిన 11 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10 వేల నగదు చెక్కు, ప్రశంసా పత్రం, జ్ఞాపికలను అతిథులు అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా అత్యుత్తమ ఫలితాలు సాధించడం గర్వకారణమని అభినందించారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించి సంగారెడ్డి జిల్లాకు, తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. సమాజ అభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు.

నగదు పురస్కారాలు అందుకున్న విద్యార్థులు :

కుమ్మరి మౌనిక – జడ్‌పిహెచ్‌ఎస్ మల్కాపూర్, కొండాపూర్ – పదో తరగతిలో ద్వితీయ ర్యాంక్ (592/600)

నంపల్లి ధనలక్ష్మి – జడ్‌పిహెచ్‌ఎస్ మల్కాపూర్, కొండాపూర్ – పదో తరగతిలో తృతీయ ర్యాంక్ (588/600)

పెద్దపట్నం ధరణి – జడ్‌పిహెచ్‌ఎస్ యెద్దుమైలారం, కంది – పదో తరగతిలో తృతీయ ర్యాంక్ (588/600)

ఎ. గాయత్రి – గురుకుల బాలికల కళాశాల, జహీరాబాద్ – ఇంటర్మీడియట్‌లో ప్రథమ ర్యాంక్ (992/1000)

ఎం. అరవింద – గురుకుల బాలికల కళాశాల, జహీరాబాద్ – ఇంటర్మీడియట్‌లో ప్రథమ ర్యాంక్ (992/1000)

బి. నిఖిత – గురుకుల బాలికల కళాశాల, జహీరాబాద్ – ఇంటర్మీడియట్‌లో ద్వితీయ ర్యాంక్ (991/1000)

కె. రుత్విక రెడ్డి – జడ్‌పిహెచ్‌ఎస్ బీరంగూడ, అమీన్‌పూర్ – జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి

ఎం. స్మితక – జడ్‌పిహెచ్‌ఎస్ కానుకుంట, ఆర్‌సీ పురం – వుషు క్రీడలో ముఖ్యమంత్రి కప్-2025 విజేత

వి. ప్రియాంక – కస్తూర్బా బాలికల విద్యాలయం, పుల్కల్ – జాతీయ స్థాయి ఆత్యా పాత్యా క్రీడాకారిణి

కమ్మరి పూజ – కస్తూర్బా బాలికల విద్యాలయం, కొండాపూర్ – ఇంటర్మీడియట్(ఎం పి హెచ్ డబ్ల్య్ లో ఫస్ట్ ర్యాంక్ (965/1000)

లక్ష్మి పద్మావతి – తెలంగాణ మోడల్ పాఠశాల, వెలిమల – ఇంటర్మీడియట్ ఎం ఈ సి విభాగంలో ప్రథమ స్థానం (912/1000)

అలాగే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించి వారిని ఉత్తీర్ణులుగా తీర్చిదిద్దిన ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బందిని ప్రత్యేకంగా అతిధుల చేతుల మీదుగా సత్కరించి ప్రశంసా పత్రాలు అందజేశారు.

Also Read-

ఈ కార్యక్రమంలోజిల్లా విద్యాశాఖ అధికారి ఎస్. వెంకటేశ్వర్లు, అదనపు సంచాలకులు శంకర్, సమగ్ర శిక్ష సమన్వయ కర్తలు, మండల విద్యాశాఖ అధికారులు జిల్లా విద్యా సమన్వయ మండలి కార్యదర్శి లింబాజీ, బాలయ్య, తాజుద్దీన్, భీమగొండ, వెంకటస్వామి, సిద్ధారెడ్డి, వివిధ మండలాల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X