Jai Telangana ! తెలంగాణలో నెల రోజుల పాటు టీఆర్ఎస్ జెండా పండుగ

తెలంగాణ రాష్ట్ర రాజధాని నుంచి వార్డు స్థాయి వరకు పార్టీ జెండాలు ఆవిష్కరించాలి

పార్టీ శ్రేణులకు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పిలుపు

హైదరాబాద్ : “తెలంగాణ రక్షణ సేన” పార్టీ భావజాలాన్ని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేందుకు మే 20 నుంచి నెల రోజుల పాటు జెండా పండుగ నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నాను. ఈ నెల 20 నుంచి జూన్ 20వ తేదీ వరకు నెల రోజులపాటు రాష్ట్ర రాజధాని, జిల్లా కేంద్రాలతో పాటు నియోజకవర్గ, మండల కేంద్రాలు, గ్రామ స్థాయి వరకు పెద్ద ఎత్తున జెండా పండుగ నిర్వహించాలి.. అన్ని వార్డుల్లోనూ టీఆర్ఎస్ జెండాలు ఎగురవేయాలి.

టీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ప్రకటించిన పార్టీ విధానాలను, పాంచజన్య సిద్ధాంతాలను ప్రజలకు వివరించాలి. రాష్ట్రం ఆవిర్భవించి 12 ఏళ్లు గడిచిన తర్వాత కూడా మన తెలంగాణ గడ్డ అనేక విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నది. తెలంగాణ ఉద్యమ నినాదాలైన నీళ్లు – నిధులు – నియామకాలను సాకారం చేసుకోవడంలోనూ వంచనకు గురయ్యాము. వలస పాలన నాటి దుష్పరిణామాలను మనం ఇప్పుడు మళ్లీ ఎదుర్కొంటున్నాము.

తెలంగాణ తెచ్చుకుంటే మన బతుకులు మారుతాయని అనుకున్న ప్రతివర్గం అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతోంది. స్వరాష్ట్ర సాధనకు అవిశ్రాంతంగా ఉద్యమించిన మనం తెలంగాణ పునర్నిర్మాణం, సబ్బండ వర్గాల వికాసం కోసం ఉద్యమించాల్సిన సమయం వచ్చింది.

అందుకే తెలంగాణ రక్షణ సేన జెండా ను ప్రతి వాడకు, పార్టీ సిద్ధాంతాలను ప్రతి గడపకు తీసుకెళ్లాల్సి ఉంది. పార్టీ ఆవిర్భావానికి మూడు నెలల ముందు నుంచే పెద్ద ఎత్తున మనతో చేరిన నాయకత్వంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ జాగృతి నాయకత్వం జెండా పండుగను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాను.

Also Read-

Telangana Rakshana Sena Flag Festivals from May 20

The party has directed its ranks to conduct TRS flag festivals for a month, village by village, to take the “Telangana Rakshana Sena” concept to the grassroots level. As part of this, from May 20 to June 20, TRS flag festivals are being organized on a grand scale up to the state capital, district centers, as well as constituency, mandal, and village levels.

Likewise, I am directing party leaders to explain to the workers the party policies and Panchajanya principles outlined at the party’s inaugural meeting, so that they can convey them to the people.

The party has already directed leaders and workers to raise their voices on the many problems Telangana is facing today, wherever necessary. As part of this, along with responding to state-level issues, local ranks are also responding to local problems and agitating where needed.

As part of the TRS flag festivals, workers need to reach out to every section of society. Among those who join together, there is a need to fight problems alongside active workers who have a sense of responsibility and dedication toward society. Let us build a strong, politically conscious mass base for public movements.

Jai Telangana.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X