హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లకు టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత మద్దతు ప్రకటించారు.
ఉద్యమకారుల సంఘాల సమావేశానికి హాజరై సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలకు జూన్ 2 వరకు గడువు ఇస్తున్నామని అప్పటికీ హామీలు అమలు చేయకుంటే ఉద్యమకారులతో కలిసి ప్రక్యక్ష ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

జార్ఖండ్ ప్రభుత్వం ఉద్యమకారులకు అందిస్తున్న సంక్షేమ పథకాల తరహాలో తెలంగాణలో ఉద్యమకారులకు సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు భువనగిరి జిల్లా కేంద్రంలో సభ నిర్వహించాలని, భూపోరాటాలు ఉధృతం చేయాలని, జిల్లాల వారీగా ఉద్యమకారులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.
Also Read-

సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు రూప్ సింగ్, సయ్యద్ ఇస్మాయిల్, మలి దశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సామ అంజిరెడ్డి, ఉపాధ్యక్షుడు మూల ప్రభాకర్ గౌడ్, కార్యదర్శులు వెలమల రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ అధ్యక్షులు బోగి పద్మ, నాయకులు గుస్సా రవీందర్, అరుణ, తెలంగాణ ఉద్యమకారుల సంఘం అధ్యక్షుడు పూస శ్రీనివాస్, కొడిమల కృష్ణ, డీఎస్ మాణిక్యమ్మ, తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు రామగిరి ప్రకాశ్, ఉపాధ్యక్షులు బీరకాయల మధుసూదన్, భరత్ రెడ్డి, తొలి దశ ఉద్యమకారుల సంఘం ఉపాధ్యక్షులు సాజిద సికిందర్, శ్రీవల్లి, తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర కో ఆర్డినేటర్ కె. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సమావేశం అనంతరం ఉద్యమకారులతో కలిసి కల్వకుంట్ల కవిత సహపంక్తి భోజనం చేశారు.
