సీనియర్ జర్నలిస్టు మారబోయిన మధుసూదన్ మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సంతాపం
హైదరాబాద్: ఉపముఖ్యమంత్రి ముఖ్య ప్రజాసంబంధాల అధికారి గా బాధ్యతలు నిర్వర్తిసున్న సీనియర్ జర్నలిస్టు మారబోయిన మధుసూదన్ తీవ్రమైన గుండెపోటుతో అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో కన్నుమూయడం అత్యంత బాధాకరమని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ప్రముఖ మీడియా సంస్థల్లో సీనియర్ జర్నలిస్టుగా ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ, నికార్సైన పాత్రికేయుడిగా విశిష్ట సేవలు అందించారని మహేష్ కుమార్ గౌడ్ గారు పేర్కొన్నారు. వృత్తి పట్ల నిబద్ధత, నిజాయితీ, విలువలతో పనిచేసిన జర్నలిస్టుగా మధుసూదన్ గారు అందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు.
సోమవారం మధ్యాహ్నం ఛాతి నొప్పితో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయనకు కార్డియాక్ అరెస్ట్ సంభవించడంతో సమీపంలోని అపోలో ఆసుపత్రికి తరలించారని, అక్కడ చికిత్స కొనసాగుతున్న సమయంలో మరోసారి కార్డియాక్ అరెస్ట్ రావడంతో ఆయన మృతి చెందినట్లు తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని తెలిపారు.
మధుసూదన్ భార్య, ఒక కుమారుడు ఉన్నారని పేర్కొంటూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో ఆ కుటుంబానికి మనోధైర్యం కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపం

హైదరాబాద్: డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సీపీఆర్వో మారబోయిన మధుసూదన్ ఆకస్మిక మృతి తీవ్ర దిగ్ర్భాంతి కి గురి చేసింది. మధుసూదన్ విద్యార్థి దశ నుండి నాకు మంచి మిత్రుడు ఆయన జర్నలిస్ట్ గా ,ప్రజా సంబంధాల అధికారిగా ఉనప్పుడు పలు అంశాల పై నిత్యం మాట్లాడుకునే వాళ్ళం. వారి మృతి నన్ను తీవ్రంగా కలచివేస్తుంది. మధుసూదన్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా వారికి నా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్న. వారి కుటుంబ సభ్యులకు ఈ సమయంలో ఆ దేవుడి ధైర్యాన్ని ప్రసాదించాలి. వారికి నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్న. అపోలో స్పెక్ట్ర ఆసుపత్రిలో సీనియర్ జర్నలిస్ట్,డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి సీపీఆర్వో మారబోయిన మధుసూదన్ గారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్.
సీపీఆర్ఓ మధు మృతి పట్ల నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతాపం
హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి సీపీఆర్ఓ మధు సూధన్ గుండెపోటు తో అకాల మరణం చెందడం పట్ల నీటి పారుదల శాఖ.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. వృత్తి పట్ల నిజాయితీ గా ఉంటూ నిబద్ధతతో పనులు చేసే మధు మరణం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు.
మధు తో నాకు చాలా కాలంగా స్నేహం ఉందని ఒక మంచి మిత్రుణ్ణి కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు..
హైదరాబాద్: నాకు ఎంతో ఆత్మీయుడు, సీనియర్ జర్నలిస్ట్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి సీపీఆర్ఓ మారబోయిన మధుసూదన్ గారి అకాల మరణం నన్ను షాక్ కు గురిచేసింది. ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చేరి ఈరోజు మరణించారన్న వార్త నన్ను కలిచి వేసింది.
నిజామాబాద్ జిల్లా ఈనాడు బ్యూరో చీఫ్ గా పనిచేస్తున్న కాలం నుంచి మధుసూదన్ గారు నాకు ఆత్మీయుడు. ఆ తరువాత ఖమ్మం, నల్గొండలలోనూ ఆంధ్రజ్యోతి లో పనిచేసి జర్నలిజంలో తనదైన ముద్ర వేశారు. ముక్కుసూటి తనం, నిబద్ధత తో వార్తలను రాసే అతను నికార్సైన జర్నలిస్టుగా పేరు తెచ్చుకున్నారు.
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వద్ద సీపీఆర్వోగా సమర్థవంతంగా పనిచేస్తూ, అందరితోనూ కలగొలుపుగా ఉండే మధుసూదన్ గారు మరణించారన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నాను. మధుసూదన్ మృతి పట్ల నా సంతాపాన్ని తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
Also Read-
మధుయాష్కి గౌడ్
చైర్మన్, క్యాంపెయిన్ కమిటీ, టీపీసీసీ
మాజీ పార్లమెంట్ సభ్యులు
సీనియర్ జర్నలిస్ట్, డిప్యూటీ సీఎం సీపీఆర్వో మధుసూదన్ గారి మృతి పట్ల ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంతాపం – భౌతికకాయానికి నివాళులు
హైదరాబాద్: ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (CPRO), సీనియర్ జర్నలిస్ట్ మారబోయిన మధుసూదన్ గారి హఠాన్మరణం పట్ల భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి అపోలో స్పెక్ట్రా ఆసుపత్రికి చేరుకున్న ఎంపీ, మధుసూదన్ గారి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, మధుసూదన్ గారి మరణం పాత్రికేయ రంగానికి మరియు వ్యక్తిగతంగా తమకు తీరని లోటని పేర్కొన్నారు. వృత్తి పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత, నిజాయితీ ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ క్లిష్ట సమయంలో మధుసూదన్ గారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.
డిప్యూటీ సీఎం సీపీఆర్ఓ మధు మృతి పట్ల ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ సంతాపం
హైదరాబాద్: డిప్యూటీ సీఎం ముఖ్య ప్రజాసంబంధాల అధికారి (సీపీఆర్ఓ)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీనియర్ జర్నలిస్టు మారబోయిన మధుసూదన్ (మధు) ఆకస్మిక మృతి పట్ల ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ గారు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
మధు గారి మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన పేర్కొన్నారు. జర్నలిజం రంగంలో విశేష అనుభవం కలిగిన మధుసూదన్ గారు ప్రజాసంబంధాల విభాగంలోనూ అత్యంత నిబద్ధతతో సేవలందించారని కొనియాడారు. తన సౌమ్య స్వభావం, వృత్తిపరమైన నైపుణ్యం, అందరితో కలిసిమెలిసి పనిచేసే గుణం వల్ల ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించిందని తెలిపారు.
ప్రజాసేవకు అంకితభావంతో పనిచేసిన మధు గారి మరణం జర్నలిజం రంగానికే కాకుండా ప్రజాసంబంధాల విభాగానికి కూడా తీరని లోటని యెన్నం శ్రీనివాస్ గారు అన్నారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు.
