శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా తెలంగాణ జాగృతి కార్యాలయంలో వేడుకలు, ప్రజా బడ్జెట్ 2026 – 27 విడుదల

హైదరాబాద్ : రూ.2,15,200 కోట్లతో ప్రజాబడ్జెట్ ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రతిపాదించారు. ఉగాది సందర్భంగా తెలంగాణ జాగృతి తరఫున ప్రజా బడ్జెట్ ప్రవేశ పెడుతున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఇక నుంచి ఏటా ఉగాది రోజు జాగృతి తరఫున ప్రజా బడ్జెట్ ఉంటుందన్నారు. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో సంప్రదాయబద్ధంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచాంగ శ్రావణం చేశారు. ఉగాది వేడుకల్లో కల్వకుంట్ల కవిత, అనిల్ దంపతులు, తెలంగాణ జాగృతి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ఉగాది వేడుకల అనంతరం తెలంగాణ జాగృతి ప్రజాబడ్జెట్ ప్రతిపాదనలను కవిత ప్రకటించారు. ఈ ఏడాది రూ. 2 లక్షల 15 వేల 2 వందల కోట్లతో ప్రజాబడ్జెట్ ప్రతిపాదిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా 3 లక్షల కోట్లకు పైగా అంచనాలతో రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనుందని, తాము మాత్రం 2 లక్షల 15 వేల కోట్లతోనే బడ్జెట్ ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వానికి అదనంగా మరో లక్ష కోట్ల వరకు బడ్జెట్ కేటాయింపులు చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. ఆ మొత్తం గాంధీ కుటుంబ సభ్యులే కాదు తమకు నచ్చిన వారి పేర్లతో పథకాలు ప్రకటించుకోవచ్చన్నవారు. తాము ప్రతిపాదించిన మొత్తం ప్రజా సంక్షేమం, రాష్ట్ర పురోగతికి ఉపయోగపడేలా ఉంటుందని చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన సూచనల మేరకే తాము ఈ ప్రజా బడ్జెట్ ను కేటాయించామన్నారు. ప్రజా బడ్జెట్ లో విద్య, వైద్యం, సంక్షేమానికి పెద్ద పీట వేశారు.

విద్యారంగానికి రూ.30 వేల కోట్లు, వైద్య, ఆరోగ్య శాఖకు రూ.25 వేల కోట్లు, యూనివర్సిటీ విద్యకు రూ.2 వేల కోట్లు వృద్ధులు, వికలాంగులు సహా ఇతర పింఛన్లకు రూ.25 వేల కోట్లు, ఇందిరమ్మ ఇళ్లకు రూ.20 వేల కోట్లు, తెలంగాణ ఉద్యమకారులకు ఇండ్లు, అమరవీరుల కుటుంబాలకు పెన్షన్లకు రూ.5 వేల కోట్లు, ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం అందజేయడానికి రూ.100 కోట్లు, 18 ఏళ్లు నిండిన యువతులకు స్కూటీల పంపిణీకి రూ.5 వేల కోట్లు, రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15 వేల చొప్పున రైతు భరోసా ఇవ్వడంతో పాటు రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేల సాయం అందించడానికి రూ.35 వేల కోట్లు, 16 లక్షల మంది యువతకు రాజీవ్ యువ వికాసం సాయం చేయడానికి రూ.5 వేల కోట్లు, బీసీల సంక్షేమానికి రూ.20 వేల కోట్లు, ఎస్సీ ల సంక్షేమానికి రూ.18 వేల కోట్లు, ఎస్టీల సంక్షేమానికి రూ.10 వేల కోట్లు, మైనారిటీల సంక్షేమానికి రూ.5 వేల కోట్లు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ సాయంతో పాటు తులం బంగారం ఇవ్వడానికి రూ.10 వేల కోట్లు, ఎంఎస్ఎంఈలు, పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకాల కోసం రూ.10 వేల కోట్లు, 50 ఏళ్లు నిండిన కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 పింఛన్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం రూ.5,500 కలిపి ఇస్తుంది. దీనిని సద్వినియోగం చేసుకొని లక్ష మంది కళాకారులకు పింఛన్ ఇవ్వడానికి రూ.100 కోట్లను ప్రజా బడ్జెట్ లో కేటాయింపులు చేశారు. ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయింపులు జరిపిన తర్వాత కూడా లక్ష కోట్ల మిగులు ఉంటుందని కవిత అన్నారు. తాము ప్రతిపాదించిన బడ్జెట్ కారణంగా రాష్ట్ర పురోగతితో పాటు సంపద సృష్టి జరుగుతుందని అన్నారు.

Also Read-

ఉగాది కొత్త సంవత్సరం ఆరంభానికి నాంది అన్నారు. ఉగాది రోజు మంచి చేసేలా జాగృతి నాయకులు, కార్యకర్తలంతా కంకణబద్దలవ్వాలని పిలుపునిచ్చారు. పక్క వాళ్ల బాగుకోసం ప్రాణాలిచ్చే నేల తెలంగాణ అని అన్నారు. ఆ సంకల్పాన్ని తీసుకొని ప్రజల కోసం పనిచేయాలని జాగృతి నాయకులకు సూచించారు. శ్రీ పరాభవనామ సంవత్సరం సందర్భంగా జాగృతి కార్యాలయంలో పంచాంగ శ్రావణం జరపటం ఆనందంగా ఉందన్నారు. సనాతన ధర్మం ఎంతో గొప్పదని, ఆ సంస్కృతి గౌరవాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలని కోరారు. పరాభవనామ సంవత్సరం అంటే అవమానాలు కాదని… అమ్మవారు, శివుడు కలిసి ఉండే సంవత్సరమని చెప్పారు. ఈ ఏడాది తెలుగు ప్రజలు, తెలంగాణ ప్రజలకు మంచి జరగాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X