Big Breaking : वरिष्ठ माओवादी गणपति सीएम रेवंत रेड्डी के सामने करेंगे आज आत्मसमर्पण, उनके साथ हैं ये नेता!

हैदराबाद : तेलंगाना में एक ऐतिहासिक परिणाम होने वाला है। दशकों से जंगलों में रहकर लड़ रहे माओवादी बड़ी संख्या में मुख्यधारा में शामिल होने का फैसला किया है। तेलंगाना पुलिस माओवादियों के आत्मसमर्पण की आधिकारिक रूप से घोषणा करेगी। मुख्यमंत्री रेवंत रेड्डी आज शाम 4 बजे एक विशेष संवाददाता सम्मेलन को संबोधित करेंगे।

इस सम्मेलन में मुख्यमंत्री रेवंत रेड्डी स्वयं माओवादियों के आत्मसमर्पण का खुलासा करेंगे। पता चला है कि माओवादी पार्टी के वरिष्ठ नेता मुप्पाला लक्ष्मण राव उर्फ ​​गणपति आज मुख्यमंत्री के सामने आत्मसमर्पण करेंगे। उनके साथ 124 दूसरे माओवादी नेता, कमांडर और अलग-अलग लेवल के मेंबर भी सरेंडर करेंगे। खास बात यह है कि माओवादी पार्टी के सीनियर लीडर देव जी की पीएलजीए यूनिट के लोग भी सरेंडर करेंगे।

गौरतलब है कि वरिष्ठ माओवादी नेता गणपति के सरेंडर करने की बात गुरुवार को ही एक तेलुगु दैनिक में बैनर हेडलाइन के साथ प्रकाशित की थी। तेलंगाना समाचार ने भी उस समाचार को प्रमुखता से प्रकाशित किया था। इसी क्रम में मुख्यमंत्री खुद माओवादियों के आत्मसमर्पण पर प्रेस मीट कर रहे हैं। तेलंगाना पुलिस पिछले कुछ समय से माओवादियों को मुख्यधारा में लाने की जो कोशिशें कर रही है। उसके पूरे नतीजे मिल रहे हैं।

इतनी बड़ी संख्या में वरिष्ठ नेताओं के आत्मसमर्पण करना तेलंगाना के इतिहास में एक अहम मोड़ साबित होगा। पता चला है कि मुख्यमंत्री रेवंत रेड्डी और डीजीपी शिवधर रेड्डी हाल ही में दिल्ली गए थे और सरेंडर करने वालों को सरकार की तरफ से दिए जाने वाले रिहैबिलिटेशन पैकेज के बारे में केंद्रीय गृह मंत्री अमित शाह के साथ एक खास बैठक की थी।

यह भी पढ़ें-

సీఎం రేవంత్ రెడ్డి ఎదుట అగ్రనేత గణపతి సరెండర్!

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో భద్రతా పరంగా చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకోబోతోంది. దశాబ్దాల కాలంగా అడవిని నమ్ముకుని పోరాడుతున్న మావోయిస్టులు భారీ సంఖ్యలో జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తెలంగాణ పోలీసులు మావోయిస్టుల లొంగుబాటును అధికారికంగా ప్రకటించనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.

ఈ సమావేశంలోనే మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియను ముఖ్యమంత్రి స్వయంగా వెల్లడించనున్నారు. ఇందులో భాగంగా మావోయిస్టు పార్టీ మాజీ దళపతి, అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ రావు అలియాస్ గణపతి ఇవాళ సీఎం ఎదుట లొంగిపోనున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు మరో 124 మంది వివిధ స్థాయిలకు చెందిన మావోయిస్టు నాయకులు, కమాండర్లు, సభ్యులు కూడా లొంగిపోనున్నారు. ఇందులో మావోయిస్టు పార్టీ అగ్రనేత దేవ్‌జీకి చెందిన పీఎల్జీఏ విభాగానికి చెందిన వారు కూడా ఉండటం గమనార్హం.

यह भी पढ़ें-

అగ్రనేత గణపతి లొంగిపోతున్నారనే విషయాన్ని పతాక శీర్షికతో అందరి కంటే ముందే ‘దిశ’ గురువారమే వెల్లడించింది. ఈ క్రమంలో మావోయిస్టుల లొంగుబాటుపై స్వయంగా ముఖ్యమంత్రి ప్రెస్‌మీట్ నిర్వహిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ పోలీసులు గత కొంతకాలంగా మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలు సంపూర్ణ ఫలితాలను ఇస్తున్నాయి.

ఇంత పెద్ద సంఖ్యలో అగ్రనేతలతో సహా లొంగిపోవడం రాష్ట్ర చరిత్రలో కీలక మలుపుగా మారనుంది. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరపున అందే పునరావాస ప్యాకేజీల గురించి ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డిలు ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశమైన విషయం తెలిసిందే. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X