Hyderabad : Prof. Ghanta Chakrapani, Vice-Chancellor, Dr. B. R. Ambedkar Open University today hoisted the National Flag on the occasion of 77 th Republic Day at the Campus and extended Republic Day greetings to Staff Members.

Prof. Chakrapani said that this academic year the University will soon be launching new agriculture-based vocational skill courses in the upcoming academic year, and these courses are being designed to benefit students and farmers in rural Telangana. We are providing high quality skill based education to learners. He mentioned that the university will offer vocational and agriculture-based courses. He revealed the course offered at University is specifically designed to prepare students from the very first semester to meet the requirements of corporate companies, enabling them to seize opportunities in corporate organizations worldwide.

Dr. L. Vijaya Krishna Reddy, Registrar, BRAOU also addressed the Staff after unfurling the National Flag at BRAOU Non-Teaching Employees’ Association premises at the campus. Prof. Pushpa Chakrapani, Prof. Anand Pawar, Prof. Rabindranath Solomon, Prof. Pallavi Kabade, Dr. Venkateshwarlu, Prof. Sridevi, Prof. Vaddanam Srinivas, Kantham Prem Kumar, N. C. Venugopal, Dr. Yakesh Daida, Vishwanath, Miyajani and Pandu, All Directors, Deans, Heads of Branches, Teaching and Non-Teaching Staff members and representatives of various Service Associations also participated in the Republic Day Celebrations.

Also Read-
అంబేద్కర్ వర్షిటీలో త్వరలో వ్యవసాయ ఆధారిత వృత్తి నైపుణ్య కోర్సులు : వీసీ ప్రొ ఘంటా చక్రపాణి
అంబేద్కర్ వర్షిటీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
హైదరాబాద్ : రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్. అంబేద్కర్ కలలు కన్న సమాజాన్ని నిర్మించడానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించి ఉద్యోగులకు, విద్యార్థులకు గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో కొత్తగా వ్యవసాయ ఆధారిత వృత్తి నైపుణ్య కోర్సులను త్వరలోనే ప్రారంభిస్తామని విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో విశ్వవిద్యాలయం వృత్తి నైపుణ్య, వ్యవసాయ ఆధారిత కోర్సులు అందించనున్నట్లు, గ్రామీణ తెలంగాణ విద్యార్థులకు, రైతులకు మేలు జరిగేలా ఈ కోర్సులను రూపొందిస్తున్నామని ప్రొ. చక్రపాణి పేర్కొన్నారు. యూనివర్సిటీ లో చదివే విద్యార్థులను మొదటి సెమిస్టర్ నుంచే కార్పొరేట్ కంపెనీలకు అవసరమయ్యే విధంగా టెక్నాలజీ పరంగా, ఇతర అంశాల్లో తీర్చిదిద్దుతూ, ప్రపంచ వ్యాప్తంగా అన్ని కార్పొరేట్ సంస్థలలో అవకాశాలను అందిపుచ్చుకునేలా పలు కోర్సులను ప్రత్యేకంగా రూపొందించినట్లు వెల్లడించారు.

Also Read-
అనంతరం విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్, డా. యల్. విజయ కృష్ణ రెడ్డి నాన్-టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ ఉద్యోగులు విద్యార్థులకు మెరుగైన సేవలు అందించడానికి కార్యాలయ సమయానికి అదనంగా కొంత సమయం పనిచేస్తూ నాణ్యమైన సేవలను అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రొ. పుష్పా చక్రపాణి, ప్రొ. ఆనంద్ పవార్, ప్రొ. రబింద్రనాథ్ సోలమన్, ప్రొ. పల్లవి కాబడే, డా. వెంకటేశ్వర్లు, ప్రొ. శ్రీదేవి, ప్రొ. వడ్డాణం శ్రీనివాస్ అన్ని విభాగాల డైరెక్టర్స్, డీన్స్, బోధన మరియు భోదనేతర సిబ్బంది, ఉద్యోగ సంఘాల నాయకులు కాంతం ప్రేమ్ కుమార్, ఎన్సీ వేణుగోపాల్, డా. యాకేష్ దైద, విశ్వనాథ్, జానీ మియా, పాండు తదితరులు పాల్గొన్నారు.
