Hyderabad : On the occasion of the death anniversary of the great statesman, renowned economist, and former Prime Minister, the late Dr. Manmohan Singh, TPCC President and MLC Mahesh Kumar Goud paid rich tributes to the eminent leader.
He said that the services rendered by Dr. Manmohan Singh to the nation’s development with integrity, foresight, and dedication are truly unforgettable. Mahesh Kumar Goud stated that Dr. Manmohan Singh was an exceptional leader who steered the country out of economic crisis and placed it firmly on the path of growth.
He recalled that Dr. Manmohan Singh earned the distinction of positioning India on the global economic stage through landmark economic reforms. He noted that key decisions such as economic liberalisation, industrial development, and attracting foreign investment transformed the future of the nation. Mahesh Kumar Goud remembered that as Prime Minister, Dr. Manmohan Singh always placed national interest above personal prestige.
He said that Dr. Manmohan Singh stood as a symbol of rare honesty and humility in politics, and that his commitment to democratic values and protection of the Constitution remains an inspiration for the country.
Describing him as a great humanitarian and an architect of modern India, the TPCC President said Dr. Manmohan Singh would continue to guide generations to come.
He added that the ideas of Dr. Manmohan Singh, the reforms he initiated, and the foundations he laid for national development will never be forgotten. Mahesh Kumar Goud concluded by stating that Dr. Manmohan Singh’s life was a true embodiment of public service, integrity, and knowledge.
Also Read-
మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
గొప్ప రాజనీతిజ్ఞుడు, ప్రఖ్యాత ఆర్థిక వేత్త, మాజీ ప్రధానమంత్రి, స్వర్గీయ డా. మన్మోహన్ సింగ్ గారి వర్ధంతి సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించారు. డా. మన్మోహన్ సింగ్ గారు నిజాయితీ, దూరదృష్టి, అంకితభావంతో దేశాభివృద్ధికి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
దేశ ఆర్థిక వ్యవస్థను సంక్షోభం నుంచి బయటకు తీసుకువచ్చి, అభివృద్ధి పథంలో నడిపించిన అపూర్వ నాయకుడు డా. మన్మోహన్ సింగ్ గారని తెలిపారు. ఆర్థిక సంస్కరణల ద్వారా భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక వేదికపై నిలబెట్టిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు. ఆర్థిక స్వేచ్ఛ, పరిశ్రమల అభివృద్ధి, విదేశీ పెట్టుబడుల ఆకర్షణ వంటి కీలక నిర్ణయాలు దేశ భవిష్యత్తును మార్చాయని అన్నారు.
ప్రధానమంత్రిగా వ్యక్తిగత ప్రతిష్ఠకన్నా దేశ హితానికే ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు డా. మన్మోహన్ సింగ్ గారని మహేష్ కుమార్ గౌడ్ గుర్తు చేశారు. రాజకీయాల్లో అరుదైన నిజాయితీకి, వినయానికి ఆయన ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ పరిరక్షణ పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత దేశానికి ఆదర్శమని అన్నారు.
గొప్ప మానవతావాది, నవ భారత శిల్పిగా డా. మన్మోహన్ సింగ్ గారు తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తారని టీపీసీసీ అధ్యక్షులు తెలిపారు. ఆ మహనీయుని ఆలోచనలు, చేపట్టిన సంస్కరణలు, దేశాభివృద్ధికి వేసిన పునాదులు ఎన్నటికీ మరచిపోలేనివని అన్నారు. డా. మన్మోహన్ సింగ్ గారి జీవితం ప్రజా సేవకు, నిజాయితీకి, విజ్ఞానానికి ప్రతిరూపమని కొనియాడారు.
