सुविचार-
“मनुष्य नश्वर है। विचार भी नश्वर हैं। एक विचार को प्रचार-प्रसार की उतनी ही ज़रूरत होती है जितनी एक पौधे को पानी की। वरना, दोनों ही मुरझाकर मर जाएँगे।”
– भारतरत्न डॉ भीमराव अंबेडकर
रामायण की तरह संविधान को भी टीवी पर दिखाना चाहिए। ताकि लोग अपने हक़, अधिकारों और जिम्मेदारों को जान सकें।
– ओशो रजनीश
BRAOU LAUNCHES Hi BRAOU WEB RADIO & iCONNECT WEBSITE
Hyderabad : Dr. B. R. Ambedkar Open University has emerged as a national leader in AI-driven and digital education, taking a major leap today under the global digital vision of the Hon’ble Chief Minister of Telangana, A Revanth Reddy. In a historic development, Dr. B.R. Ambedkar Open University signed a landmark Memorandum of Understanding (MoU) with the Commonwealth of Learning (COL) a first-of-its-kind collaboration in Asia and the first such comprehensive partnership by COL anywhere in the world. CM congratulated the Vice Chancellor of BRAOU for bringing a global facility to Hyderabad and his idea to transform teaching and learning. The MoU was formally signed by Prof. Ghanta Chakrapani, Vice Chancellor of BRAOU, and Prof. Peter Scott, President and CEO of COL Vancouver, Canada.
Later, The University organized a Round table meet on “Capacity Building for digital Education through ODDL- The Way Forward” at it campus. Prof. Peter Scott, President and CEO of COL attended at as the chief guest. Prof. Peter Scott is a globally respected leader in open and distance learning, with decades of expertise in advancing technology-enabled education. The University launched HiBRAOU Web Radio; iCONNECT website and Employability framework inaugurated by Prof. Peter Scott. He said the Commonwealth of Learning, established by the Commonwealth Heads of Government in 1987, is an intergovernmental organization committed to widening access to quality education through open learning and technology. Its mission aligns closely with global Sustainable Development Goals, particularly inclusive and equitable lifelong learning.

Prof. Ghanta Chakrapani, Vice-Chancellor, BRAOU presided over the function. Prof. Chakrapani said this historic partnership marks a major step in BRAOU’s journey toward becoming a leading Digital University. As a part of the collaborative agreement with COL, an integrated Digital Education Academy acronym for iDEA was established which will function as a state-of-the-art digital hub to enhance teaching, learning, and research. Its core initiatives include faculty development through micro-credentials in technology-enabled learning and AI, creation of an integrated Learning Management System blueprint, support for virtual labs, and the formation of a regional digital-learning consortium. Together these efforts will expand access to quality education, empower educators and learners, and drive educational innovation in Telangana and beyond.
Also Read-
This collaboration aligns with Sustainable Development Goal 4, promoting inclusive and equitable lifelong learning for all. This pioneering partnership reinforces BRAOU’s commitment to digital transformation, educational innovation, and social justice—advancing the vision of Dr. B. R. Ambedkar. With COL’s global expertise and support. This MoU reinforces BRAOU’s commitment to digital transformation and social justice in education, reflecting the vision of Dr. B.R. Ambedkar with COL’s global expertise and support, BRAOU is poised to lead India’s digital education movement.
Prof. V. S. Prasad, Former Vice Chancellor, BRAOU; Prof. V. Sudhakar, Professor (Retd) EFLU. Prof. Seetharama Rao, Former Vice Chancellor, BRAOU shared their thoughts at the Round table meet. several academic and administrative officers of BRAOU were present on the occasion, Prof. Pushpa Chakrapani, Director Academic & COEL; Dr. L. V. K. Reddy, Registrar; Prof. Rabindranath Solomon, Director EMR&RC; Prof. Pallavi Kabde, Director UGC-DEB Affairs; Prof. Anand Pawar Ms. Sushumna Rao, Consultant COEL, BRAOU along with other faculty members and officials were present on the occasion.
ఉద్యోగ సామర్ధ్య వృద్ధి దిశగా దూర విద్య రూపాంతరం
కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ (COL) అధ్యక్షుడు, సి ఈ ఓ ప్రొ. పీటర్ స్కాట్ వెల్లడి
ఓపెన్ వర్సిటీలో కృతిమ మేథస్సు ఆధారిత డిజిటల్ ల్యాబ్: వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి
హైదరాబాద్: విద్యార్ధుల్లో ఉద్యోగ సామర్థ్యం పెంచి ఆయా కోర్సుల్లో కొత్త వారిని చేరేలా ఆకట్టుకునేలా దూర విద్యా వ్యవస్థ రూపాంతరం చెందాలని కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ (COL) అధ్యక్షుడు, సి.ఈ.ఓ. ప్రొఫెసర్ పీటర్ స్కాట్ పేర్కొన్నారు. “సార్వత్రిక విద్య, డిజిటల్ విద్య – సామర్థ్య నిర్మాణం – ముందడుగు” అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మంగళ వారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ (COL) అధ్యక్షుడు, సి ఈ ఓ ప్రొఫెసర్ పీటర్ స్కాట్ హాజరై ప్రసంగించారు.
దూర విద్యలో చేరి యెక్కువగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినప్పుడే చాలా మంది విధ్యార్డులు ఆయా విధ్యా సంస్థల్లో చేరుతారన్నారు. ఉత్పాదక ఉత్పత్తి, ఉమ్మడి ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చేలా విద్యా విధానం ఉండాలన్నారు. మారుమూల ప్రాంతాలకు కొత్త సాంకేతిక పరిజ్ఞానాలకు తీసుకెళ్లాలని సూచించారు. డిజిటల్ అంతరాన్ని దూరం చేసి విషయాలను అధ్యాయనంలో చేర్చాలని సూచించారు. డిజిటల్ పుస్తకాల రూపకల్పన, అధ్యయనం కొనసాగించాలని పేర్కొన్నారు. ఉత్తమమైన నైపుణ్యాలతో పాఠ్యాంశాలను రూపొందించాలని, కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ అండగా నిలుస్తుందని వెల్లడించారు. విద్యావేత్తలు సమష్టి కృషితో నూతన ఆధునిక సాంకేతిక ప్రపంచాన్ని నిర్మించాలని సూచించారు. కృత్రిమ మేథస్సును టీచర్ నియంత్రణలో ఉండేలా చూసుకోవాలని సూచించారు. నైపుణ్యాలను వెలికి తీసి, ప్రపంచంలోని ప్రతికూలతలలో చదువుకుంటున్న, పని చేస్తున్న అనేక మంది మహిళలు, బాలికలకు విద్యను అందించాలని సూచించారు.

వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి మాట్లాడుతూ వర్సిటీలో కృతిమ మేథస్సు ఆధారిత డిజిటల్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. డిజిటల్ బోధన, అభ్యాసనకు సమగ్ర లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (LMS)ను అభివృద్ధి చేయనున్నామని పేర్కొన్నారు. ఆచరణాత్మకంగా, సాంకేతికత-ఆధారిత అభ్యాస అనుభవాలను బలోపేతం చేయడానికి వర్చువల్ ల్యాబ్‌లను నిర్మిస్తామన్నారు. డిజిటల్ బోధనలో సామూహిక-స్థాయి అధ్యాపక అభివృద్ధి కార్యక్రమాలను అందిస్తామని వెల్లడించారు. తెలంగాణ ఉన్నత విద్యా సంస్థలలో సమూహంగా పనిచేయగల వ్యవస్థలను సులభతరం చేయడానికి రాష్ట్ర వ్యాప్త డిజిటల్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామన్నారు.
తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాలకు ఉద్యోగ-సంబంధిత మైక్రో-క్రెడెన్షియల్స్, కోర్సులను రూపొందించి, నైపుణ్యం, శ్రామిక శక్తి డిమాండ్లకు అనుగుణంగా నాణ్యమైన విద్యను అందిస్తామని వెల్లడించారు. వర్సిటీలో ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఎడ్యుకేషన్ అకాడమీ (IDEA)ని నిర్మించి బోధన, అభ్యాసం, పరిశోధనల్లో నాణ్యత పెరిగేలా కృషి చేస్తూ యునివర్సిటిని మార్గదర్శక డిజిటల్ హబ్ గా మారుస్తామని వెల్లడించారు. ప్రొ. పీటర్ స్కాట్ విశ్వవిద్యాలయ Hi BRAOU వెబ్ రేడియో, BRAOUBOOKS, ConnectBRAOU, ప్రారంభించారు. అనంతరం యునివర్సిటి COL సహకారంతో రూపొంధించిన ఎంప్లాయబిలిటీ ఫ్రేమ్‌వర్క్ ను ఆవిష్కరించారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొ. వి ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ డిజిటల్ టెక్నాలజీని వివిధ రకాల విద్యా రూపాల్లో ఉపయోగించుకోవాలని అన్నారు. అధ్యాపకులు సార్వత్రిక విద్యను అందిస్తూనే, ఆధునిక సాంకేతతను అందిపుచ్చుకోవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మెరుగైన విద్యను విధ్యార్ధులకు అందించాలని పేర్కొన్నారు. మాజీ వి.సి ప్రొ. కె. సీతారామ రావు మాట్లాడుతూ ఎల్లప్పుడూ వ్యక్తిగత సామర్థ్య నిర్మాణంపై, సంస్థాగత పోటీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు.
విద్యారంగంలో చోటుచేసుకుంటున్న నూతన ఆవిష్కరణలకు అనుగుణంగా వ్యక్తిగత, విద్యావ్యవస్థ సామర్ధ్యాలను పెంచుకోవాలని సూచించారు. డిజిటల్ అభ్యాసనాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ఇఫ్లూ మాజీ ప్రొఫెసర్, ప్రొ. సుధాకర్ మాట్లాడుతూ సార్వత్రిక జ్ఞానం విశ్వవ్యాప్త జ్ఞానం అని అన్నారు. వివిధ సంస్కృతుల జ్ఞాన వ్యవస్థలు ప్రధాన స్రవంతిలోకి రావడానికి దోహదపడుతుందని చెప్పారు. సంప్రదాయ విశ్వవిద్యాలయల్లోని లోటుపాట్లను సార్వత్రిక విశ్వవిద్యాలయం సరి చేస్తూ విద్యను అందిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు, పరిశోధక విధ్యార్ధులు పాల్గొన్నారు.
డిజిటల్ విద్యా హబ్ దిశగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ
తెలంగాణ లో విద్యా ప్రమాణాలు పెంచుతాం : సీఎం రేవంత్ రెడ్డి
సీఎం సమక్షంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ అవగాహనా ఒప్పందం
హైదరాబాద్ : తెలంగాణలో విద్యా ప్రమాణాలను పెంపొందించడంతో పాటు విద్యా వ్యవస్థలో సమగ్ర మార్పులు తీసుకురావడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయడమే కాకుండా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దడంలో ప్రభుత్వం అంకితభావంతో పని చేస్తోందన వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ (COL) తో ఇన్‌టిగ్రేటెడ్ డిజిటల్ ఎడ్యుకేషన్ అకాడమీ (iDEA) స్థాపనకు సంబంధించిన అవగాహన ఒప్పందం (MoU) మంగళవారం సీఎం అధికారిక నివాసంలో కుదుర్చుకుంది.

COL అధ్యక్షుడు & CEO పీటర్ స్కాట్‌కు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా BRAOUను ప్రముఖ డిజిటల్ విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేయనున్నట్లు వీసీ ప్రొ. ఘంటా చక్రాపాణి వెల్లడించారు. ఈ ఒప్పందంతో బోధన, అభ్యాసం, పరిశోధనా రంగాల్లో ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టేందుకు iDEA అత్యాధునిక డిజిటల్ హబ్‌గా పనిచేయనుందని వెల్లడించారు. టెక్నాలజీ ఆధారిత నాణ్యమైన విద్యను అందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, BRAOU వైస్ చాన్స్‌లర్ ఘంటా చక్రపాణి, రిజిస్ట్రార్ డా. ఎల్వీకే రెడ్డి, డైరెక్టర్స్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి, ప్రొ. రబింద్రనాధ్ సోలమన్, ప్రొ. పల్లవీ కాబడే, ప్రొ. ఆనంద్ పవార్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
