“కాంగ్రెస్ ఓడిపోతుందనే భయంతో ముఖ్యమంత్రి సోయి తప్పి మాట్లాడుతున్నాడు”

హైదరాబాద్ : “కాంగ్రెస్ ఓడిపోతుందనే భయంతో ముఖ్యమంత్రి సోయి తప్పి మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి ప్రజల్లోకి వెళ్లేటప్పుడు, తాను ఏమి చేశాడో వివరించి, ఆ తర్వాత ప్రత్యర్థిని విమర్శిస్తూ ఓట్లు అడగాలి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన హామీలు ఏమాత్రం ఉన్నాయో ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. కేవలం రెండు నెలల్లో ఒక్క హామీని కూడా అమలు చేయకుండా, ప్రత్యర్థిపై విమర్శలు మాత్రమే చేస్తున్నాడు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను మళ్లించే వ్యూహంలో భాగంగానే మాపై, మా ప్రధానమంత్రిపై, మా పార్టీపై తప్పుడు విమర్శలు చేస్తున్నాడు.” నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు మీడియాతో అన్నారు.

ఆయాన మాట్లాడుతూ… బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసిపోయాయని దిగజారుడు రాజకీయాలు రేవంత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇలాంటి ప్రచారమే చేశారు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తూ నాపై వ్యక్తిగత విమర్శలు చేశాడు. నన్ను వ్యక్తిగతంగా విమర్శించినా, తప్పుడు ఆరోపణలు చేసినా, నా వ్యక్తిత్వాన్ని విమర్శించినా, ప్రజలు దానిని విశ్వసించలేదు.

బీజేపీ అంటే ఏమిటో, కిషన్ రెడ్డి అంటే ఏమిటో దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు తెలుసు. మీలాగా మాది కుటుంబ పార్టీ కాదు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే పార్టీ బీజేపీ. మోదీ గారి నాయకత్వంలో ఒక్క చిన్న అవినీతి ఆరోపణ కూడా లేకుండా పనిచేస్తున్న పార్టీ బీజేపీ. గత ఎన్నికల్లో ఫేక్ వీడియోలు తయారు చేసి ప్రచారం చేసిన పార్టీ కాంగ్రెస్-బీఆర్‌ఎస్. జూబ్లీహిల్స్‌లో కూడా అదే పరిస్థితి. లక్ష కోట్ల అవినీతి డబ్బులు కక్కిస్తానన్న రాహుల్ గాంధీ లక్ష రూపాయలను కూడా బయటకు తీశాడా?

Also Read-

ఢిల్లీ స్థాయిలో బీఆర్‌ఎస్-కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదిరింది. ఇది వాస్తవం కాదా? కేటీఆర్ నిన్న కాక మొన్న మాట్లాడుతూ, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని తప్పించాలనుకున్నాడు అని ప్రచారం చేసింది నిజం కాదా? ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు… కేటీఆర్ సోషల్ మీడియాలో బీజేపీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ, కేజ్రీవాల్‌ను కలుపుకొని పోరాటం చేయాలన్నది నిజం కాదా? మరి ఏ విధంగా బీజేపీకి, బీఆర్‌ఎస్‌కు సంబంధం అంటగడుతున్నారు?

చీము నెత్తురు ఉంటే, దమ్ము దైర్యం ఉంటే, ఏ విషయంలో బీజేపీ-బీఆర్‌ఎస్ ఒక్కటయ్యాయో చూపించాల్సిందిగా సవాల్ చేస్తున్నాను. నోటికి ఏదో వస్తే అది మాట్లాడడం కాదు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? విద్యుత్ కొనుగోళ్ల కేసు ఏమైంది? ధాన్యం కొనుగోళ్ల కేసు ఏమైంది? భూముల కొనుగోళ్ల కేసు ఏమైంది? ఒక్క బీఆర్‌ఎస్ నేతలపై చర్యలు తీసుకున్నావా, రేవంత్ రెడ్డీ? ప్రచారంలో బీఆర్‌ఎస్‌పై ఎన్ని ఆరోపణలు చేశావో మర్చిపోయావా, రేవంత్ రెడ్డీ?

అసలు నీ మీద తెలంగాణ ప్రజలకు నమ్మకం ఉందా? మీ పార్టీలో నీ మీద నీకు నమ్మకం ఉందా? మీ మంత్రులు నిన్ను నమ్ముతున్నారా? మీ మంత్రులు ఏ మాట్లాడుకుంటున్నారో వింటున్నావా? వాళ్లు కార్యకర్తలతో ఏం చెబుతున్నారో నీకు తెలుసా?
ఆరు గ్యారంటీల విషయంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. ఆరు గ్యారంటీలు, 420 సబ్-గ్యారంటీలతో మోసం చేసిన పార్టీ కాంగ్రెస్. మీకు, బీఆర్‌ఎస్ పార్టీకి ఎలాంటి తేడా లేదు.

కాంట్రాక్టుల దగ్గర, రియల్ ఎస్టేట్ పరిశ్రమల దగ్గర వేలాది రూపాయలు వసూలు చేసింది నిజం కాదా? బీహార్ ఎన్నికలకు ఆ డబ్బు పంపింది నిజం కాదా? విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయడానికి నీకు మనసు రాదు. ఆరోగ్య శ్రీ బకాయిలు పెండింగ్‌లో పడ్డాయి. వీధి లైట్లు కొనడానికి డబ్బులు లేవు.

అసలు కేంద్రం ట్రిపుల్ ఆర్ (RRR) కు ఆమోదం తెలిపినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? తెలంగాణ అభివృద్ధికి కేంద్రం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోంది. గత మీట్ ది ప్రెస్‌లో హైదరాబాద్‌కు కేంద్రం ఇచ్చిన ప్రాజెక్టులు, నిధుల గురించి వివరించడం జరిగింది. దీనిపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నారా? రేవంత్ రెడ్డీ, కేసీఆర్‌కు సమయం ఉంటే, తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో వివరించడానికి సిద్ధంగా ఉన్నాను. వచ్చే, వినే దైర్యం మీకు ఉందా?

కేటీఆర్, కిషన్ రెడ్డిని ‘బ్యాడ్ బ్రదర్స్’ అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. “ఉల్టా చోర్ కోత్వాల్ కో డాంటే” (దొంగే పోలీసును బెదిరించినట్లు) ముఖ్యమంత్రి రేవంత్ వ్యవహరిస్తున్నాడు. ఎవరు ఎవరికి బ్రదర్స్? ఎవరు ఎవరిని కాపాడుతున్నారు? కేసీఆర్‌ను కాపాడుతోంది కాంగ్రెస్ కాదా? రాహుల్ గాంధీకి భయపడి ఎందుకు చర్యలు వెనకాడుతున్నావు, రేవంత్?

తెలంగాణలో ‘బ్యాడ్ బ్రదర్స్’ ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి, కేసీఆరే!
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫేక్ (Fake), ఫ్రాడ్ (Fraud), ఫాల్స్ (False), ఫెయిల్యూర్ (Failure) ప్రభుత్వం.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా ఫేక్, ఫ్రాడ్, ఫాల్స్, ఫెయిల్యూర్ ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రభుత్వం.
గతంలో కేసీఆర్ ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రభుత్వం, ఇప్పుడు సోనియా ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రభుత్వం.
తెరచాటు రాజకీయాలు చేయడంలో కేసీఆర్-రేవంత్ దిట్టలు!
తెలంగాణను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిన బ్యాడ్ బ్రదర్స్ రేవంత్, కేసీఆర్.
అనేక ప్రాజెక్టులలో అవినీతికి పాల్పడ్డ బ్యాడ్ బ్రదర్స్ రేవంత్, కేసీఆర్.
నిరుద్యోగులను, మహిళలను మోసం చేసిన బ్యాడ్ బ్రదర్స్ రేవంత్, కేసీఆర్.
ఓటు బ్యాంక్ పాలిటిక్స్ చేసే బ్యాడ్ బ్రదర్స్ రేవంత్, కేసీఆర్.
మజ్లీస్ పార్టీని పెంచి పోషించి, వారి కనుసైగల్లో, వారి ఆలోచనలను పాటించే బ్యాడ్ బ్రదర్స్ రేవంత్, కేసీఆర్.
10 ఏళ్లు కేసీఆర్ పాలించినట్టే, రాష్ట్రాన్ని మద్యంతో నడిపిస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి.
గ్రామాల్లో బెల్ట్ షాపులను పెంచి పోషిస్తున్న బ్యాడ్ బ్రదర్స్ రేవంత్, కేసీఆర్.
దళితులను ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్, దళితులకు 12 లక్షలు ఇస్తానని మోసం చేసిన బ్యాడ్ బ్రదర్స్ రేవంత్, కేసీఆర్.
మహిళలకు తులం బంగారం, స్కూటర్, పొదుపు సంఘాలకు వడ్డీ అని చెప్పి ఇవ్వకుండా మోసం చేసిన బ్యాడ్ బ్రదర్స్ రేవంత్, కేసీఆర్.
హామీలతో రైతులను మోసం చేసిన బ్యాడ్ బ్రదర్స్ రేవంత్, కేసీఆర్.
రియల్ ఎస్టేట్ వారిని బెదిరిస్తున్న బ్యాడ్ బ్రదర్స్ రేవంత్, కేసీఆర్.
తమ వైఫల్యాలను, అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రం మీద, బీజేపీ మీద నెట్టేసి ఎదురు దాడి చేస్తున్న బ్యాడ్ బ్రదర్స్ రేవంత్, కేసీఆర్.
అన్ని రంగాలలో రాష్ట్రం సంక్షోభంలో ఉండడానికి కారణమైన బ్యాడ్ బ్రదర్స్ రేవంత్, కేసీఆర్.

ఎవరితో ఎవరికి సంబంధాలు ఉన్నాయో గతంలో డాక్యుమెంట్‌తో సహా బయటకు వచ్చాయి. బట్టకాల్చి ముఖం మీద వేస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరు. రాజకీయాలలో పరిమితులు ఉంటాయి. మజ్లీస్ పార్టీ మద్దతు కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వంగి వంగి సలాం కొడుతున్నారు. ఈ ఇద్దరు బ్యాడ్ బ్రదర్స్‌ (రేవంత్, కేసీఆర్) తో పాటు మూడో బ్యాడ్ బ్రదర్ అసదుద్దీన్ ఓవైసీ! కేసీఆర్, అసదుద్దీన్, సోనియా కుటుంబం తెలంగాణ పాలిట ‘బ్యాడ్ బ్రదర్స్’ గా తయారయ్యారు.

రేవంత్ రెడ్డి మజ్లీస్ పార్టీతో తప్ప అన్ని పార్టీలలో పనిచేశాడు. ఆ అనుభవంతోనే ఇలా మాట్లాడుతున్నాడు. అలా పార్టీలు మార్చే బుద్ధి మాకు లేదు. మంత్రులు తమ శాఖలు మర్చి, పాలనను వదిలేసి, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తిరుగుతూ డబ్బులు పంచుతున్నారు. అంగట్లో సరుకు కొన్నట్లుగా ఓట్లు కొనుగోలు చేస్తున్నారు.”

ఈ రెండు పార్టీలు బీజేపీని ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి? మరోకసారి మనవి చేస్తున్నాను… ముఖ్యమంత్రి అయిన నాలుగు నెలల్లో ఎనిమిది సీట్లలో కాంగ్రెస్‌ను ఓడించాము. కాంగ్రెస్‌కు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచాము. 50 శాతం తెలంగాణ ఓటర్లు బీజేపీ పోటీ చేసిన చోట గెలిచింది. ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్స్ మాకు ఓటు వేశారు.

అసలు ఆట ఇంకా మొదలు కాలేదు. తెలంగాణలో బీజేపీ సత్తా ఏంటో చూపిస్తాం. మీరు చేసిన పనులు ఏంటో తెలంగాణ ప్రజలు తెలుసుకుంటున్నారు. ఆట మొదలుపెట్టినప్పుడు తెలుస్తుంది మా సత్తా. రానున్న రోజుల్లో మా ఆట మొదలు పెడతాం. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతల కింద ఉన్న భూమి కదులుతుంది.

1200 మంది తెలంగాణ బిడ్డలు ప్రాణాలు పోవడానికి మీరు కారణం కాదా? సకల జనుల సమ్మె మీకు వ్యతిరేకంగా జరగలేదా? తెలంగాణ తెచ్చుకుంది కేసీఆర్ కుటుంబం కోసం కాదు, తెలంగాణ బాగు కోసం. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్‌పై పెత్తనం చేసింది మజ్లీస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలోనూ అదే జరుగుతుంది. తెలంగాణ ప్రజలు రెండు పార్టీలను పాతర వేసే సమయం త్వరలోనే ఉంది.

మూసీ ప్రక్షాళనలో అధికార, మజ్లీస్ పార్టీ నేతల భవనాల జోలికి వెళ్లారు. కానీ పేద ప్రజల ఇళ్లను మాత్రం కూలగొడతారు. పేదవాడి గూడు కూల్చడానికి బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. మూసీ రివర్ ఫ్రంట్‌తో వ్యాపారం చేస్తామంటే కుదరదు. సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో రేవంత్ రెడ్డిపై విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఢిల్లీలో ‘బిగ్ బ్రదర్’ కేసీఆర్, రాష్ట్రంలో హరీష్ రావు మంత్రులుగా చేశారు. ఈ రెండు పాలనా వ్యవహారం ఒక్కటే.

“చైనా సరిహద్దులో చైనా సైనికులను భారత సైనికులు కొట్టారని, సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయా?” అంటూ, పాక్ సైనికులను పొగుడుతూ భారత సైనికులను అవమానించాడు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే భాషేనా? ఏ మతాన్ని బీజేపీ అవమానించదు. ఓట్ల కోసం ఎంతకైనా దిగజారే పార్టీ కాంగ్రెస్. మోసాలు, కుంభకోణాలు చేశారు. దేశాన్ని వెనుకబాటుకు గురిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X