रियाज़ मुठभेड़ पर निज़ामाबाद के पुलिस आयुक्त का महत्वपूर्ण बयान, बोले- “नहीं था कोई और विकल्प”

हैदराबाद: गौरतलब है कि निज़ामाबाद में कांस्टेबल प्रमोद कुमार की हत्या करने वाले राउडी शीटर रियाज़ पुलिस मुठभेड़ में मारा गया। निज़ामाबाद के सरकारी अस्पताल में एक कांस्टेबल पर हमला करने और भागने की फिराक में रियाज़ की पुलिस ने आत्मरक्षा के लिए गोलीबारी की। इसी क्रम में निज़ामाबाद के पुलिस आयुक्त साई चैतन्य ने रियाज़ की मुठभेड़ पर एक महत्वपूर्ण बयान दिया।

आरोपी रियाज़ ने सरकारी अस्पताल में इलाज के दौरान कमरे की खिड़कियाँ तोड़ दीं। कांस्टेबल आसिफ जाँच के सिलसिले में रियाज़ के कमरे में गया और तेज़ आवाज़ सुनाई देने पर कमरे के अंदर गया। इसी दौरान रियाज़ ने आसिफ से बंदूक छीन ली। इसके बाद रियाज़ ने ट्रिगर दबाने की कोशिश की। पुलिस आयुक्त ने स्पष्ट किया कि पुलिस के पास गोली चलाने के अलावा कोई विकल्प नहीं था।

सीपी ने कहा कि रियाज़ एनकाउंटर की जाँच जारी है। रियाज़ द्वारा घायल किए गए कांस्टेबल आसिफ के दोनों हाथों में गंभीर चोटें आई हैं। डॉक्टरों ने कहा है कि उसके हाथों को काम करने में एक साल लगेगा। रियाज़ के पोस्टमॉर्टम पूरा करके शव उसके परिजनों को सौंप दिया जाएगा।

संबंधित खबर-

రియాజ్ ఎన్‎కౌంటర్‎పై నిజామాబాద్ సీపీ కీలక ప్రకటన

హైదరాబాద్: నిజామాబాద్‎లో కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్‎ను హత్య చేసిన రౌడీ షీటర్ రియాజ్ పోలీసుల ఎన్ కౌంటర్‎లో హతమైన విషయం తెలిసిందే. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ కానిస్టేబుల్‎పై దాడి చేసి పారిపోబోతుండగా ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో రియాజ్ మరణించాడు. ఈ క్రమంలో రియాజ్ ఎన్ కౌంటర్‎పై నిజామాబాద్ సీపీ సాయి చైతన్య కీలక ప్రకటన చేశారు.

నిందితుడు రియాజ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో గది అద్దాలు ధ్వంసం చేశాడు. కానిస్టేబుల్ ఆసిఫ్ చెకింగ్‎లో భాగంగా రియాజ్ గది వద్దకు వెళ్లగా పెద్ద శబ్దం వినిపించటంతో రూమ్‎లోకి వెళ్ళాడు. ఈ క్రమంలో ఆసిఫ్ దగ్గరున్న తుపాకీ రియాజ్ లాక్కున్నాడు. అనంతరం రియాజ్ ట్రిగ్గర్ నొక్కే ప్రయత్నం చేశాడు. దీంతో గత్యంతరం లేక పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని సీపీ క్లారిటీ ఇచ్చారు.

రియాజ్ ఎన్ కౌంటర్‎పై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. రియాజ్ చేతిలో గాయపడ్డ కానిస్టేబుల్ ఆసిఫ్ రెండు చేతులకు తీవ్ర గాయ్యాలయ్యాయని.. అతని చేతులు పని చేయాలంటే ఏడాది పడుతుందని డాక్టర్లు చెప్పారని వెల్లడించారు. ప్రొసిజర్ ప్రకారం రియాజ్ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం పూర్తి చేసి మృతదేహాన్ని అతడి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని చెప్పారు.

కాగా, 2025, అక్టోబర్ 17న నిజామాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను రియాజ్ పొడిచి చంపిన విషయం తెలిసిందే. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న రియాజ్‎ను పట్టుకుని పోలీస్ స్టేషన్‎కు తీసుకెళ్తుండగా ప్రమోద్ కుమార్‎పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ ప్రమోద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనను తెలంగాణ పోలీస్ శాఖ సీరియస్‎గా తీసుకుంది.

ఈ క్రమంలోనే ఆదివారం (అక్టోబర్ 19) పోలీసులు రియాజ్‎ను అరెస్ట్ చేశారు. నగర శివారులోని ఓ పాత లారీ క్యాబిన్‌‌లో దాక్కున్నట్లు తెలియడంతో అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే ఓ వ్యక్తితో గొడవ పడి గాయాలపాలైన రియాజ్‎ను పోలీసులు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో ఓ కానిస్టేబుల్ దగ్గర నుంచి గన్ లాక్కొని పారిపోయే ప్రయత్నం చేయడంతో పోలీసులు రియాజ్‎ను ఎన్ కౌంటర్ చేశారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X