ఎన్. రాంచందర్ రావు శ్రీ వేదవ్యాస పాఠశాల ట్రస్ట్ సందర్శన, విద్యార్థులు, అధ్యాపకులతో ముచ్చట

హైదరాబాద్ : ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు నాగోల్ సమీపంలోని కుంట్లూరు గ్రామంలో ఉన్న శ్రీ వేదవ్యాస పాఠశాల ట్రస్ట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో, అధ్యాపకులతో ముచ్చటించారు.

వేద విద్య పిల్లలలో కేవలం జ్ఞానం మాత్రమే కాకుండా ధర్మబద్ధత, దేశభక్తి, సాంస్కృతిక విలువలను కూడా పెంపొందిస్తుంది. సమాజ వృద్ధి, భవిష్యత్ భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని రాంచందర్ రావు అభినందించారు. వేద విద్య సమాజానికి నైతిక బలం, దేశానికి సాంస్కృతిక గర్వం, విద్యార్థులకు దేశభక్తి దారిదీపం అవుతుందని పేర్కొన్నారు.

Also Read-

సాధారణంగా మేము తెల్లవారుజాము లేవగానే ప్రజల సమస్యలు, కార్యకర్తల ఇబ్బందులు వింటూ రాజకీయ జీవితంలో ఉంటాము. కానీ ఇక్కడకు రాగానే మన వేద సంపద, సంస్కృతి, ధర్మంలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది ప్రత్యేకమైన అనుభవం, చాలా తక్కువ మందికి మాత్రమే లభించే అదృష్టం. పూర్వజన్మ సుకృతంగా భావించాల్సిన అదృష్టంగా చెప్పారు.

భారతదేశం గొప్ప దేశంగా ఎదగడంలో ప్రధాన కారణం ఇక్కడి వేద సంపద. నలందా, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాల కాలంలోనూ వేద సంపద దేశాభివృద్ధికి కేంద్రంగా నిలిచింది.

ప్రస్తుత తరం వాటిని మరచిపోతున్న తరుణంలో మేము వేద పాఠశాలల్లో విద్యార్థులను దేశానికి, సంస్కృతికి ప్రతిబింబంగా, భవిష్యత్తులో భారతదేశ పరిరక్షణలో కీలక పాత్ర పోషించేలా మారుస్తున్నామని గర్వంగా చెప్పవచ్చని రాంచందర్ రావు గారు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X