Gaddar Film Awards: क्या तस्कर की भूमिका को क्रांतिकारी कवि गद्दर पुरस्कार देते हैं? : भूपति वेंकटेश्वरलू

तेलंगाना प्रजा संस्कृति केंद्र के अध्यक्ष भूपति वेंकटेश्वर्लू

हैदराबाद: क्या इतिहास को तोड़-मरोड़ कर पेश करने और तस्कर की भूमिका वाली फिल्म को क्रांतिकारी कवि गद्दर पुरस्कार दिया जाएगा? यह सवाल तेलंगाना प्रजा संस्कृति केंद्र के प्रदेश अध्यक्ष भूपति वेंकटेश्वर्लू ने उठाया। उन्होंने कहा कि पुरस्कार की घोषणा गद्दर के आदर्शों के बिल्कुल खिलाफ है। उन्होंने मुख्यमंत्री रेवंत रेड्डी की आलोचना की कि उन्होंने ‘रजाकार’ को सर्वश्रेष्ठ ऐतिहासिक फिल्म के रूप में चुना और आरएसएस समर्थक की भूमिका निभाई। उन्होंने कहा कि यह नीति कांग्रेस पार्टी और धर्मनिरपेक्ष लोकतंत्र के लिए अच्छी नहीं है।

भूपति वेंकटेश्वर्लू ने गुरुवार शाम सुंदरय्या ज्ञान केंद्र में आयोजित बैठक में यह बात कही। उन्होंने चिंता व्यक्त की कि राज्य सरकार द्वारा गद्दर पुरस्कारों की घोषणा ने सभी कलाकारों के दिलों को झकझोर दिया है। उन्होंने कहा कि इतिहास को विकृत करने वाली और धार्मिक उन्माद को भड़काने वाली फिल्मों को गद्दर के नाम पर पुरस्कार देना उचित नहीं है।

भूपति ने मांग की कि पुरस्कार चयन समिति को समाप्त किया जाए और लोगों को बताया जाए कि किस मानक का पालन किया गया। इस दौरान तेलंगाना सिनेमा लोकगीत संयुक्त कार्रवाई समिति के अध्यक्ष मुरलीधर देशपांडे, प्रजा संस्कृति केंद्र के उपाध्यक्ष पोन्नम राजय्या गौड़, आदिवासी कलाकार पायम विजया, मंडेपुडी शमंतकमणी, पद्मा और अन्य ने भाग लिया।

यह भी पढ़ें-

స్మగ్లర్​ పాత్రకు గద్దర్​ అవార్డు ఇస్తారా? : భూపతి వెంకటేశ్వర్లు

తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు

హైదరాబాద్ : చరిత్రను వక్రీకరించిన సినిమాకు, స్మగ్లర్ పాత్రకు గద్దర్ అవార్డులు ఇస్తారా? అని తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ఇది గద్దర్ ఆశయాలకు అత్యంత విరుద్ధమన్నారు. ఉత్తమ చారిత్రక చిత్రంగా ‘రజాకార్’ను ఎంపిక చేసి సీఎం రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ వాదిగా వ్యవహరించారని విమర్శించారు. ఈ విధానం కాంగ్రెస్ పార్టీకి, లౌకిక ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.

గురువారం సాయంత్రం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ గద్దర్ అవార్డుల ప్రకటన యావత్ కళా హృదయాలను కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. చరిత్రను వక్రీకరించిన, మత ఉన్మాదాన్ని ప్రేరేపించిన సినిమాలకు గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడం కరెక్ట్​కాదన్నారు. అవార్డు సెలక్షన్ కమిటీని రద్దు చేసి, ఏ ప్రామాణికతను పాటించారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ సినిమా జానపద జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మురళీధర్ దేశ్​పాండే, ప్రజా సాంస్కృతిక కేంద్రం ఉపాధ్యక్షుడు పొన్నం రాజయ్య గౌడ్, ఆదివాసీ కళాకారులు పాయం విజయ, మండేపూడి శమంతకమణి, పద్మ తదితరులు పాల్గొన్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X