हैदराबाद: कांग्रेस नेताओं ने केंद्रीय गृह राज्य मंत्री बंडी संजय के खिलाफ चुनाव आयोग में शिकायत दर्ज कराई है। उन्होंने कांग्रेस को टीम पाकिस्तान कहे जाने पर आपत्ति जताई और शिकायत की कि बंडी संजय के खिलाफ तुरंत कार्रवाई की जाये।
इस अवसर पर मीडिया से बात करते हुए सरकारी सचेतक आदि श्रीनिवास ने कहा कि बंडी संजय जो मन में आ रहा है वो बोल रहे है। उन्होंने कहा कि वे लगातार विवादास्पद टिप्पणियों के जरिए समाज को बांटने की कोशिश कर रहे हैं। आदि श्रीनिवास ने कहा कि क्या चुनाव जीतने के लिए आपको इतना नीचे गिरना पड़ेगा?
उन्होंने चुनौती दी कि वे इस तरह शेखी बघारना बंद करें। भाजपा नेता बता दें देश के लिए किस नेता ने जान कुर्बान कर दी है। उन्होंने अपना गुस्सा जाहिर करते हुए कहा कि देश के लिए अपना सबकुछ कुर्बान करने वाली कांग्रेस की तुलना पाकिस्तान से करने में उन्हें शर्म आनी चाहिए।
హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పై కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌ను పాకిస్తాన్ టీమ్ అనడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తక్షణమే బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ మతాన్ని అడ్డుపెట్టుకొని మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో సమాజంలో విభజన తేవాలని చూస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో గెలవడానికి ఇంత దిగజారాలా? అని ఆది శ్రీనివాస్ సీరియస్ అయ్యారు. తరచూ ఇలా గొప్పలు చెప్పుకోవడం కాదు.. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఒక్క బీజేపీ నేతను చూపించండి అని సవాల్ చేశారు. దేశం కోసం సర్వం ధారపోసిన కాంగ్రెస్‌ను పాకిస్తాన్‌తో పోల్చడానికి సిగ్గుండాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
संबंधित समाचार-
ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు కాదని.. దమ్ముంటే మోడీని ఒప్పించి దేశంలో కులగణన చేయించాలని సూచించారు. బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీ అని అన్నారు. అంతకుముందు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కరీంనగర్ వెళ్లగానే సంజయ్ కార్పొరేటర్‌గా మారిపోతారని ఎద్దేవా చేశారు. ఇండియా గెలవాలంటే బీజేపీకి ఓటు వేయాలని, పాకిస్తాన్ గెలవాలంటే కాంగ్రెస్‌కి ఓటు వేయాలని కేంద్రమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడటం ఏంటని అన్నారు. అభివృద్ధి, నిరుద్యోగ సమస్యల గురించి మాట్లాడకుండా సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారని బండి సంజయ్‌పై ఫైర్ అయ్యారు.
బుధవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ కరీంనగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని పాకిస్తాన్‌తో పోల్చారు. బీజేపీ ఇండియా టీమ్.. కాంగ్రెస్‌ది పాకిస్తాన్ టీమ్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. (ఏజెన్సీలు)
