हैदराबाद: मंत्री कोंडा सुरेखा ने संगारेड्डी जिले के चंदापुर में एसबी ऑर्गेनिक्स उद्योग में रिएक्टर विस्फोट की घटना पर गहरा दुख व्यक्त किया है। मंत्री कोंडा सुरेखा मौके पर पहुंची और पीड़ित परिवारों को 10 लाख रुपये की अनुग्रह राशि की घोषणा की।
मंत्री ने कहा कि सरकार की गाइडलाइन के अनुसार यह राशि तुरंत पीड़ितों को दी जाएगी। साथ ही घायलों का इलाज और उनके ठीक होने तक पूरी तरह से सरकार मदद की जाएगी। इसी क्रम में मृतकों की संख्या बढ़कर छह हो गई है। मलबा हटाते समय एक व्यक्ति का शव मिला। मृतक की पहचान रमेश के रूप में की गई है। (एजेंसियां)
संबंधित खबर:
Reactor Explosion : బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా చందాపూర్‌లోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలుడు ఘటనపై మంత్రి కొండా సురేఖ తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. ఘటనాస్థలాన్ని చేరుకున్న మంత్రి బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ మొత్తాన్ని వెంటనే అందజేస్తామని తెలిపారు. క్షతగాత్రులకు చికిత్స అందించి, వారు కోలుకునే వరకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ క్రమంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. శిథిలాలను తొలగిస్తుండగా మృతదేహం లభ్యమైంది. మృతుడు రమేష్‌గా గుర్తించారు.
ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమ ప్రమాదంపై సమీక్షించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ సమీపంలోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో చోటు చేసుకున్న ప్రమాదంపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సమీక్షించారు. రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. తక్షణమే సహాయక చర్యలు వేగవంతం చేసి, మంటలు అదువులోకి తీసుకురావాలని అగ్నిమాపక శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందజేయాలని ముఖ్యమంత్రి జిల్లా అధికారులకు సూచించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.
సంగారెడ్డి ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమ ప్రమాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ సమీపంలోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో చోటు చేసుకున్న ప్రమాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. రియాక్టర్ పేలడంతో ఈ మంటలు చెలరేగినట్లు అధికారులు చెప్తున్నారని తక్షణమే సహాయక చర్యలు వేగవంతం చేసి, మంటలు అదువులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఆ కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసారు. (ఏజెన్సీలు)