నల్గొండ పట్టణంలో 2K రన్, పాల్గొన్న గుత్తా సుఖేందర్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు నల్గొండ పట్టణంలో 2K రన్ కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిధిగా, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అతిధిగా హాజరయ్యారు. నాగార్జున కళాశాల వద్ద బెలూన్లు వదిలి, జెండాను ఊపి గుత్తా సుఖేందర్ రెడ్డి 2K రన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే విద్యార్థులుతో కలిసి రన్నింగ్ లో పాల్గొన్నారు.

https://www.youtube.com/watch?v=GY_xG04C5QAఅనంతరం క్లాక్ టవర్ దగ్గర జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రతి ఒక్కరం ఆరోగ్యంగా ఉంటేనే బంగారు తెలంగాణ సాధ్యం అవుతుందన్నారు.నేటి రోజుల్లో వ్యాయామం ,ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి అన్నారు. దీనితో జీవన ప్రమాణాలు కూడా మారిపోయాయని తెలిపారు. ఈ మధ్య కాలంలో ఎంతో మంది యువకులు గుండె సంబంధిత సమస్యలతో మరణిస్తున్నారన్నారు. ప్రతి రోజు వ్యాయమం, యోగ, వాకింగ్ ,లలో ఏదైనా ఒక్కటి తప్పకుండా చెయ్యాలని ఆయన సూచించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పట్టణాలు, పల్లెలు, గొప్పగా అభివృద్ధి చెందాయి అన్నారు. పార్కులు, క్రీడా ప్రాంగణాలు అన్నింటినీ అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన విధానంతో నల్గొండ పట్టణం గొప్పగా అభివృద్ధి చెందిందని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రం అభివృద్ధికి 1000 కోట్లకు పైగా నిధులను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేటాయించారని చెప్పారు. అత్యధికంగా మెడికల్ కాలేజీలు ఉన్న ఏకైక రాష్ట్రము మన తెలంగాణ రాష్ట్రం మాత్రమేనని ఆయన గర్వంగా చెప్పారు.

ఇంత గొప్పగా రాష్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన్ని రానున్న ఎన్నికల్లో మళ్ళీ బలపర్చలని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి, జిల్లా ఎస్పీ అపూర్వ రావు, అడిషనల్ కలెక్టర్ లు, అడిషనల్ ఎస్పీ , కౌన్సిలర్లు ,బి ఆర్ యస్ పార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar