హైదరాబాద్ : ఉద్యోగ నియామక ప్రక్రియలో అవకతవకలకు పాల్పడుతూ, తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల పాలిట యమ పాశంగా మారిన TSPSC బోర్డు ను తక్షణమే ప్రక్షాలణ చేయ్యాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ గారికి NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి సారథ్యంలోని NSUI బృందం హైదరాబాద్ అబిడ్స్ పోస్ట్ ఆఫీస్ నుండి రిజిస్టర్డ్ పోస్ట్ చేసారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ NSUI జిల్లా అధ్యక్షుడు అభీజీత్ యాదవ్,రాష్ట్ర కార్యదర్శి శ్రీకర్,సోషల్ మీడియా శివ తదితరులు పాల్గొన్నారు.