हैदराबाद : 10वीं कक्षा के हिंदी पेपर लीक मामले में एक अहम घटनाक्रम सामने आया है। जिसने राज्य में हड़कंप मचा दिया है. इस मामले में आरोपी ए1 के रूप में भाजपा के प्रदेश अध्यक्ष बंडी संजय आरोपों का सामना कर रहे हैं। संजय ने मुख्य सबूत के तौर पर फोन को ले चुकी पुलिस सबूत इकट्ठा करने के लिए उनके फोन को सौंपने को आग्रह किया है।
10th హిందీ పేపర్ లీక్ కేసులో ట్విస్ట్, బండి సంజయ్ ఫోన్ మిస్సింగ్
హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన పదో తరగతి హిందీ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ1 నిందితునిగా ఆరోపనలు ఎదుర్కొంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఆయన ఫోన్ ను ప్రైమ్ ఎవిడెన్స్ గా తీసుకున్న పోలీసులు ఆధారాలు సేకరించేందుకు బండి సంజయ్ ఫోన్ ను తమకు ఇవ్వాలని పోలీస్ లు కోరారు.
అయితే, ఇప్పుడు బండి సంజయ్ తన ఫోన్ పోయిందని, వెతికిపెట్టాలరి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. విచారణలో తనతో ఉన్న పోలీసులకు కూడా తన ఫోన్ పోయిన విషయం తెలుసని, అప్పుడే సమాచారం ఇచ్చినట్లు బండి సంజయ్ తెలిపారు.
అయితే, పోలీసులు మాత్రం సంజయ్ తమకు ఫోన్ ఇవ్వట్లేదని, విచారణకు సహకరించట్లేదని కోర్టులో ఆరోపించింది. దానికి స్పందించిన బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్ ఫోన్ పోలీసులే లాక్కున్నారని కోర్టుకు తెలిపింది. (ఏజెన్సీలు)