హనుమకొండ: వరంగల్ వ్యవసాయ మార్కెట్ లో గన్ని సంచులకోసం రైతులకు 30 రూపాయలు ఇచ్చే విధంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఇటీవల సమావేశం పెట్టి ఆదేశాల ఇచ్చిన నేపథ్యంలో మంత్రి కృషికి కృతజ్ఞతగా నేడు తెలంగాణ రైతు సంఘం నేతలు మంత్రి గారిని కలిసి, పుష్ప గుచ్చం ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు.
మంత్రి గారి ఆదేశాలతో రైతులకు గన్ని సంచుల కోసం 30 రూపాయలు ఇస్తున్నారని, సమస్యలు పట్టించుకుని పరిష్కరించినందుకు ఎప్పటికీ మరిచిపోమని అన్నారు.
మంత్రి గారిని కలిసిన వారిలో రాష్ట్ర కన్వీనర్ మెార్తాల చందర్ రావు, ఉమ్మడి జిల్లా ఉపాద్యక్షులు భాషిపాక రమేష్, జిల్లాకోశాదికారి కూస సంపత్ కుమార్, జిల్లా కమిటి సభ్యులు బల్సుకూరి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.