నేడు రైతు, భూమి సమస్యలపై నియోజక వర్గ కేంద్రాలలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నాలు

Hyderabad: తెలంగాణ లో రైతు, భూమి సమస్యల పరిష్కారం కోరుతూ 21వ తేదీన టీపీసీసీ ఆధ్వర్యంలో అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎంపీ, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ల నేతృత్వంలో టీపీసీసీ బృందం రాష్ట్ర సిఎస్ ను కలిసి వినతి పత్రం సమర్పించింది.

అప్పటి నుంచి కాంగ్రెస్ ఆధ్వర్యంలో వరుస ఉద్యమాలకు కాంగ్రెస్ పిలుపు ఇచ్చింది. 24వ తేదీన రాష్ట్రంలో అన్ని మండలాలలో మండల కేంద్రాల వద్ద ధర్నాలు చేసింది.

30వ తేదీన నియోజక వర్గ కేంద్రాలలో ధర్నాలకు పిలుపు ఇచ్చిన కాంగ్రెస్. ఈసందర్భంగా కాంగ్రెస్​ నాయకులు ఎమ్మార్వోలకు వినతిపత్రాలు సమర్పించనున్నారు. ఈ నిరసన కార్యక్రమం కోసం అన్ని జిల్లాలకు సీనియర్ నాయకులతో ఇంచార్జ్ లను టీపీసీసీ నియమించింది. నియోజక వర్గ సమన్వయ కర్తలను నియమించిన కాంగ్రెస్ డిసెంబర్ 5వ తేదీన జిల్లా కేంద్రాలలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేయాలని పిలుపునిచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X