BRAOU భూ కేటాయింపు సమస్యను పరిష్కరించాలంటూ… అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం

హైదరాబాద్: డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ పది ఎకరాల భూమిని కాపాడాలంటూ రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్. అంబేద్కర్ విగ్రహానికి జేఏసీ సభ్యులు, ఉద్యోగులు రాజ్యంగా దినోత్సవం సందర్భంగా వినతి పత్రాన్ని అందించారు.

అంబేద్కర్ విశ్వవిద్యాలయ స్థలం జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జె.ఎన్.ఏ.ఎఫ్.ఏ.యూ) కేటాయించాలనే ప్రభుత్వ లేఖ నెం: 1043/TE/A12/2024 ను ఉపసంహరించుకోవాలని ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు ఉద్యోగులు మంగళవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో పరిపాలన భవనం ముందు బైఠాయించి, నల్ల బ్యాడ్జీలు ధరించి 68వ రోజు నిరసనను కొనసాగించారు.

అనంతరం జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి పుష్పాంజలి ఘంటించి, రాజ్యంగా పీఠికను చదివి, రాజ్యాంగాన్ని రక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

Also Read-

నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ఛైర్పర్సన్ ప్రొ. పల్లవీ కాబడే; కన్వీనర్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్; సెక్రటరీ జనరల్ డా. పి. వేణు గోపాల్ రెడ్డి, జేఏసీ నేతలు డా. ఎల్వీకే రెడ్డి; డా. రవీంద్రనాథ్ సోలమన్; డా. ప్రమీలా కేతావత్, ప్రొ. మేరీ సునంద, డా. యకేశ్ దైద; డా. ఉదయిని; హబీబుద్దిన్; కాంతం ప్రేమ్ కుమార్; డా. కిషోర్; డా. రాఘవేంద్ర; డా. అంబేద్కర్, డా. రజిత, పాండు; షబ్బీర్; రాములు; అధ్యాపక; అధ్యాపకేతర ఉద్యోగులు; అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ అసోసియేషన్; టైం స్కేల్, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X