హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ పది ఎకరాల స్థలం జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జె.ఎన్.ఏ.ఎఫ్.ఏ.యూ) కేటాయించాలనే ప్రభుత్వ లేఖ నెం: 1043/TE/A12/2024 ను ఉపసంహరించుకోవాలని ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు ఆందోళనకు దిగారు. గత 65 రోజులుగా జరుగుతన్న ఈ నిరసన పట్ల ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరం అన్నారు. పేదల ఆత్మ గౌరవం గౌరవం అంబేద్కర్ యూనివర్సిటీ అని, మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయొద్దని హెచ్చరించారు. ఇతరులకు అంబేద్కర్ యూనివర్సిటీ భూ కేటాయింపుపై ప్రభుత్వం తన ఆలోచనను వెంటనే వెనక్కి తీసుకోవాలని జేఏసి నేతలు డిమాండ్ చేశారు.
ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు, ఉద్యోగులు శనివారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో పరిపాలన భవనం ముందు అంబేద్కర్ విగ్రహం దగ్గర బైఠాయించి, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనకు దిగారు. కార్యక్రమంలో పాల్గొన్న ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ఛైర్పర్సన్ ప్రొ. పల్లవీ కాబడే; కన్వీనర్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 27న (బుధవారం) జరుగుతన్న వంటా వార్పూ కార్యక్రమానికి అందరూ సహకరించి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమ సంఘీ భావం తెలపాలని కోరారు.
Also Read-
కార్యక్రమంలో విశ్వవిద్యాలయ మాజీ ఉద్యోగి శంకరాచార్య; డా. యకేశ్ దైద; డా. ఉదయిని; కాంతం ప్రేమ్ కుమార్; డా. రాఘవేంద్ర; పాండు; షబ్బీర్; రాములు, అధ్యాపక, అధ్యాపకేతర ఉద్యోగులు, అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ అసోసియేషన్; టైం స్కేల్, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.