BRAOU ఉద్యమాన్ని మరింత ఉదృతం చేయడానికి డిజిటల్ మీడియా, వెబ్ సైట్ ప్రారంభం

ప్రభుత్వ లేఖ నెం: 1043/TE/A12/2024 ను ఉపసంహరించుకునేలా ఇంఛార్జ్ వీసీ ప్రయత్నించాలని డిమాండ్
64వ రోజుకు చేరిన అంబేద్కర్ వర్శీటీ ఉద్యోగుల నిరసనలు

హైదరాబాద్ : గత 64 రోజులుగా జరుగుతన్న ఈ నిరసనను మరింత ఉదృతంగా చేయడానికి ఉద్యోగులు, విద్యార్థులు డిజిటల్ మీడియాను ఉపయోగించాలని జేఏసి నేతలు పిలుపునిచ్చారు. ఈ మేరకు జేఏసీ రూపొందించిన వెబ్ సైట్ ను పరిశోధక విద్యార్థి ఎస్. కృష్ణయ్య ప్రారంభించారు.

డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ పది ఎకరాల స్థలం జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జె.ఎన్.ఏ.ఎఫ్.ఏ.యూ) కేటాయించాలనే ప్రభుత్వ లేఖ నెం: 1043/TE/A12/2024ను ఉపసంహరించుకునేలా చూడాలని ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు విశ్వవిద్యాలయ ఇంచార్జ్ ఉపకులపతి ఎస్.ఏ.ఎం.రిజ్వీని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన ఆలోచనను వెంటనే వెనక్కి తీసుకునేల చర్యలు తీసుకోవాలన్నారు.

Also Read-

ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు, ఉద్యోగులు శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో పరిపాలన భవనం ముందు బైఠాయించి, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనను కొనసాగించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ఛైర్పర్సన్ ప్రొ. పల్లవీ కాబడే; కన్వీనర్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 27న (బుధవారం) విశ్వవిద్యాలయంలో వంటా వార్పూ కార్యక్రమాన్నికి అందరు హాజరు కావాలని, అదేవిధంగా జేఏసీ ఏర్పాటు చేసిన వెబ్ సైట్ లింక్ ద్వారా డిజిటల్ మీడియాను ఉపయోగించాలని పేర్కొన్నారు.

కార్యక్రమంలో డా.ఎల్వికే రెడ్డి; డా. వెంకటేశ్వర్లు; డా. యకేశ్ దైద; డా. ఉదయిని; కాంతం ప్రేమ్ కుమార్; డా.కిషోర్; డా. రాఘవేంద్ర; పాండు; రాములు అధ్యాపక, అధ్యాపకేతర ఉద్యోగులు, అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ అసోసియేషన్; టైం స్కేల్, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X