The Deeksha Divas Program Was Held Grandly at Telangana Bhavan

KTR accused both the BJP and Congress of undermining Telangana’s struggleWe must teach future generations about self-respect and the sacrifices made to achieve Telangana. Revanth Reddy is attacking Telangana’s self-respect and identity The suspension of land acquisition in Lagcharla is a victory for Telangana’s people

Hyderabad: The Deeksha Divas program was held grandly at Telangana Bhavan in Hyderabad, commemorating KCR’s historic Deeksha in 2009. The event witnessed the participation of MLAs, MLCs, former MLAs, party leaders, and senior members of the BRS. The program was marked by a massive rally led by BRS Working President K.T. Rama Rao (KTR), which began at Basavatarakam Cancer Hospital in Banjara Hills and culminated at Telangana Bhavan.

Key Highlights of the events..

Tributes and Remembrance:

Leaders paid floral tributes to Telangana Mother, Jayashankar’s statue, and the martyrs’ memorial, reaffirming the sacrifices made for the Telangana statehood movement.

A Need to Rekindle the Movement’s Spirit:-KTR

Speaking at the event, KTR passionately emphasized the importance of remembering the history of the Telangana movement, stating, “Three generations had to endure oppression. Forgetting our past struggles would be a grave mistake. We must teach future generations about self-respect and the sacrifices made to achieve Telangana.”

Also Read-

Attacks on Telangana’s Identity:-KTR

KTR criticized the current CM, Revanth Reddy, accusing him of attacking Telangana’s self-respect and identity. He remarked, “Revanth Reddy’s attempts to erase KCR’s legacy are not just about KCR—they are about erasing Telangana’s history and identity.” He condemned the removal of Kakatiya architectural elements in official emblem of state and replacing Telangana Mother’s statue with that of Rahul Gandhi’s father, terming it a betrayal of Telangana’s movement and aspirations.

KTR says the suspension of land acquisition in Lagcharla as a victory for Telangana’s people

KTR highlighted the recent suspension of land acquisition in Lagcharla as a victory for Telangana’s people, particularly tribals, Dalits, BCs, and farmers. He stated, “This victory belongs to the people, not real estate mafias. We will continue to resist any attempts to exploit Telangana’s lands for selfish gains.”

KTR accused both the BJP and Congress of undermining Telangana’s struggle, referring to BJP as “Gujarat’s slaves” and Congress leaders as “Delhi’s puppets.” He called on Telangana people to recognize and resist these threats, saying, “Without political self-existence of telangana people, there is no one to voice Telangana’s concerns in Parliament. Telangana’s voice is only BRS.”

Urging the younger generation to learn from the past, KTR stated, “History teaches us who our friends and enemies are. Forgetting our struggles will make us vulnerable to future attacks on our existence.” He compared Telangana’s movement to India’s independence struggle, drawing parallels with the resilience and leadership of figures like Gandhi and Mandela.

KTR concluded by reminding the gathering of KCR’s resolve during his 2009 till-death fast, which laid the foundation for Telangana’s formation. He stressed the need for continued vigilance, stating, “If we become careless even once, Telangana will suffer for another 60 years.”

KTR Congratulatulated the party cadre making Deeksha Divas a resounding success across all 33 districts.

తెలంగాణ భవన్ లో ఘనంగా దీక్షా దివస్ వేడుకలు, ఆకట్టుకున్న కేటీఆర్ ప్రసంగం.

తెలంగాణ ఉద్యమ చరిత్ర, కేసీఆర్ దీక్షా ను కళ్లకు కట్టినట్లు వివరించిన కేటీఆర్.
చరిత్ర చదవకుండా..భవిష్యత్‌ను నిర్మించలేం..!
తెలంగాణ ప్రజల కోసం మరొక్కసారి దీక్ష చేయాల్సిన అవసరం.
ఆత్మగౌరవం.. అస్తిత్వం.. అస్మిత ప్రమాదంలో పడుతున్నప్పుడు తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయకపోతే తప్పు చేసినవాళ్లవుతం!
కేసీఆర్ ఆనవాళ్లు కాదు…తెలంగాణ ఆనవాళ్లు చెరిపేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు.
కష్టమొస్తే రాష్ట్ర ప్రజలకు తెలంగాణ భవన్ గుర్తొస్తోంది. తెలంగాణ భవన్… జనతా గ్యారేజ్ గా మారింది.
సమైక్యాంధ్ర సంచులు మోసిన తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రిగా ఉన్నాడు.
ఇక్కడున్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వంపై దాడి మొదలు పెట్టాడు.
ఉద్యమం పై గన్ను ఎక్కుపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తా అని రెచ్చిపోతున్నడు..!
సోనియమ్మ లేకపోతే.. తెలంగాణ అడుక్కుతినేదని అహంకారంతో వాగుతున్నడు కాంగ్రెస్ సీఎం!
తెలంగాణ అస్తిత్వంపై గుజరాత్ గులాములు ఓ పక్క… ఢిల్లీ కీలుబొమ్మలు మరో పక్క దాడి చేస్తున్నారు.
ప్రస్తుత పార్లమెంట్ లో మన గళం వినిపించే నాథుడే లేడు.
తెలంగాణ గొంతు బీఆర్ఎస్ మాత్రమే. ఇంకెవరూ కాదు.
లగచర్ల భూముల సేకరణ విరమణ బీఆర్ఎస్ విజయం, తెలంగాణ ప్రజల విజయం.

హైదరాబాద్ : తెలంగాణ భవన్ లో దీక్ష దివాస్ ఘనంగా జరిగింది. హైదరాబాద్ నగర పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, పలువురు సీనియర్ నాయకులు హాజరైన ఈ కార్యక్రమం 2009 సంవత్సరంలో కెసిఆర్ దీక్ష జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కొనసాగింది. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ప్రసంగంతో ముగిసింది.

అంతకుముందు కేటీఆర్ నేతృత్వంలో బంజారాహిల్స్ లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి భారీగా ర్యాలీగా తెలంగాణ భవన్ వరకు పార్టీ నేతలు పార్టీ శ్రేణులు చేరుకున్నాయి. తెలంగాణ భవన్ లో ముందుగా తెలంగాణ తల్లికి ఆ తర్వాత జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసిన నేతలు కార్యక్రమం ప్రారంభానికి ముందు అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత పార్టీ సీనియర్ నాయకులు, శాసనమండలిలో పార్టీ శాసన మండలి నేత మధుసూదనా చారి ఆ తర్వాత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుదీర్ఘ ప్రసంగం చేశారు…

కేటీఆర్ ప్రసంగంలోని ముఖ్యమైన అంశాలు…

15 ఏళ్ల క్రితం కేసీఆర్ ఉక్కు సంకల్పంతో ‘తెలంగాణ వచ్చుడో…కేసీఆర్ సచ్చుడో’ అంటూ జనసామాన్యులను తట్టుతూ తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆమరణ దీక్ష చేశారు.

ఇవ్వాళ 33 జిల్లాలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు అభినందనలు.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బంజారా బిడ్డలు వచ్చారు. వారి కళారూపాలను ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తే ఈ ప్రభుత్వం లేకి గా ప్రవర్తించింది.

తెలంగాణ భవన్ వద్ద లైట్లు బంద్ జేసి, కరెంట్ తీసేసి ప్రభుత్వం చాలా తక్కువ బుద్దితో వ్యవహరించింది.
మనం ఇవ్వాళ ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వాన్ని విమర్శించేందుకు పెట్టుకోలేదు.
ఎక్కడి నుంచి వస్తున్నామో తెలియకపోతే…ఎటు పోవాలో అర్థంగాదు!
నిన్న ఏ దారిలో నడిచి వచ్చామో తెలుసుకోకపోతే..రేపు ఏ బాటలో పయనించాలో తెలియదు..!
చరిత్ర చదవకుండా..భవిష్యత్‌ను నిర్మించలేం..!
గతం తెలుసుకోకుండా..గమ్యాన్ని నిర్ణయించుకోలేం!
ఆనాటి కేసీఆర్ గారి పోరాటం, అమర వీరుల త్యాగాలు, ఉద్యోగ సంఘాల పోరాటాల చరిత్ర కొత్త తరానికి తెలియాలి.
అందుకే..ప్రతి జాతి తన ఘనమైన గత వైభవాన్ని ..పోరాటాలను.. త్యాగాలను..విజయాలను.. కథగానో పాటగానో ఏదో కళారూపంలో నిత్యం గానం చేస్తూనే తర్వాతి తరాలకు అందిస్తూనే ఉండాలి.
వీరులను..వీరగాథలను..వీరోచిత యుద్ధాలను నిత్యం స్మరించుకుంటూ ప్రతి దేశం.. ప్రతి జాతి తన ఉనికిని అస్తిత్వాన్నికాపాడుకోవడానికి ఉడుకు నెత్తురుతో వున్న నూతన యువతకు పౌరుషాన్ని నూరిపోస్తూనే వుంటుంది..!
రామాయణం.. భారతం మహా ఇతిహాసాలు పురాణాలు వేల ఏండ్లుగా శ్రుతులుగా కథలుగా గ్రంథాలుగా పద్యాలుగా నాటకాలుగా వివిధ రూపాల్లో ప్రతి జనరేషన్ ను చేరి భరతజాతిని ఐక్యంగా నిలబెట్టాయి..!
అదే మాదిరిగా ఒగ్గు కథలు.. బుర్రకథలు..యక్షగానాలు..బతుకమ్మ పాటలు..నృత్య రూపాలు… చిత్రకళలు.. చరిత్ర పాఠాలు.. శిలా శాసనాలు ఎన్నెన్నో రకాలుగా ఘనమైన గతాన్ని.. సంస్కృతిని .. మహనీయులను .. వైతాళుకులను యాది చేసుకుంటూ వుంటాం..!
ఏ జాతి ఐతే .. తన చరిత్రను విస్మరిస్తుందో ఆ జాతి పరాయి పెత్తనంలో బానిసగా మగ్గిపోతుంది..!
ఒక ప్రాంతాన్నో.. ఒక దేశాన్నో ఓడించి వశం చేసుకున్న విజేతలు…పరాజితుల చరిత్ర చెరివేసే ప్రయత్నం చేస్తారు.
మీకు చరిత్ర లేదు… సంస్కృతి లేదు మేం అధికులం మీరు అల్పులు అని మానసికంగా లొంగదీసుకునే ప్రయత్నం చేస్తారు..!
బ్రిటీష్ వాళ్ల నుంచి.. సమైక్యాంధ్ర శక్తులు దాకా అదే పనిచేసాయి..!
తెలంగాణ భావజాలం మీద ఎన్నెన్ని దాడులు జరిగాయో మీకు గుర్తుండాలి.
తెలంగాణ ఏర్పడితే ఇక్కడి నాయకత్వానికి పాలించే సత్తా లేదని మనపై దాడి జరిగింది.
కానీ వాటిని పటాపంచలు చేస్తూ దేశం గర్వించేలా చేసిన చరిత్ర కేసీఆర్ గారిది.
స్పార్టకసో.. గాంధీనో.. మార్టిన్ లూథరో.. మండేలానో ఎవరో ఒక యోధుడు మళ్లీ ఆ జాతిని మేల్కొల్పి విముక్తి చేయాల్సి వస్తుంది..!
ప్రతిజాతికి.. ప్రతి దేశానికి .. ప్రతి ప్రాంతానిక ఒక కథ వుంటుంది..!
ఆ కథలో కథనాయకులు ప్రతినాయకులు.. త్యాగాలు.. విద్రోహాలు విజయాలు.. గుణపాఠాలు వుంటాయి..!
తెలంగాణ కథలో కూడా కథానాయకుడు తెలంగాణ తల్లికి జన్మనిచ్చిన తనయుడు కేసీఆర్ గారు.
అందుకే మన చరిత్రను రేపటి తరానికి.. ఆ కథను గాథను నరనరాన ఎక్కించాలి..!
లేకపోతే.. ఆ జాతి మళ్లా పరాయి దండయాత్రలోనే ఓడిపోయే ప్రమాద ముంటుంది..!
తెలంగాణ తెలుసు కోవాల్సిన వీరోచిత ఘట్టం
మన జాతికి మహత్తరమైన పోరాటాల చరిత్ర వుంది..!
ప్రపంచానికే పాఠాలు నేర్పిన ఉజ్వల ఉద్యమ గాథ వుంది!
స్వరాజ్య సమరాన్ని మించిన సముజ్వల సన్నివేశాలను సృష్టించి సంకెళ్లను తెంచుకున్న విజయం వుంది..!
కుట్రలను.. కుతంత్రాలను ఛేదించి, యావత్ జాతిని ఏకతాటిపై నడిపించి శాంతియుత పంథాలో వ్యూహాలు.. ఎత్తుగడలు రచించి.. ఉక్కు సంకల్పంతో .. చెక్కు చెదరని నిబద్ధతతో గమ్యాన్ని ముద్దాడిన నాయకుడు మనకు ఉన్నాడు.
భారత స్వతంత్ర సంగ్రామంలో దండి యాత్ర.. సహాయ నిరాకరణ .. ఇంకెన్నో పోరాట ఘట్టాలు వున్నట్టే మన మలి దశ తెలంగాణ పోరాటంలో మహోజ్వల సందర్భాలు చాలా వున్నాయి..!
1948 నుంచి 1956 వరకు ప్రత్యేక రాష్ట్రంగా ఉండే. ఆనాటి హైదరాబాద్ ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా 1956 లో ఆనాటి ఆంధ్రాకు, తెలంగాణకు బలవంతపు పెళ్లి చేశారు.
ఇది ఇష్టం లేని పెళ్లి అని నిజామాబాద్ లో ఆనాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చెప్పారు.
అమాయకపు ఆడపిల్ల, అతి ఉషారైన అబ్బాయికి పెళ్లి చేస్తున్నాం. ఈ బంధం సరిగా లేకపోతే ఎప్పుడైతే అప్పుడు విడాకులు తీసుకోవచ్చని ఆయన అన్నారు.
ఆయన అన్నట్లుగానే జరిగింది. రాష్ట్రం మెదటి రోజు నుంచే కుట్రలు చేశారు.
1956 నుంచి 1969 వరకు తెలంగాణ లోలోపల ఉడికి పోయింది.
1969 నుంచి 1971 వరకు పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి.
బలవంతపు పెళ్లి చేసిన ఇదే కాంగ్రెస్ పార్టీ మళ్లీ తెలంగాణ ఉద్యమాన్ని కర్కషంగా అణిచివేసింది.
ఇందిరాగాంధీ హావా సమయంలో కూడా మన తెలంగాణలో 14 సీట్లకు గానూ 11 సీట్లు తెలంగాణ ప్రజాసమితి కి ఇచ్చారు.
తెలంగాణ కోరిక ఎంత బలంగా ఉందో ఆనాడు ప్రజలు చాటి చెప్పారు.
కానీ ప్రజాతీర్పు కు వ్యతిరేకంగా రకరకాల పేర్లతో తెలంగాణ ఆకాంక్షను అదిమిపెట్టింది కాంగ్రెస్ పార్టీ.
1969 ఉద్యమంలో 369 మంది విద్యార్థులను పొట్టనబెట్టుకుంది.
తెలంగాణ నాయకులు పదవుల కోసం ఉద్యమాన్ని తాకట్టు పెడతారని అప్పట్లో అపోహాలు ఉండేవి.
కానీ కేసీఆర్ గారు 2001 లో పదవుల త్యాగంతో పార్టీని ప్రారంభించి ఆ అపవాదును పొగొట్టారు.
అద్భుత ఘట్టాల్లో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఒక పతాక సన్నివేశం .. పరమోత్కృష్ట దృశ్యం!
దీక్షా దివస్ ఇప్పుడెందుకు అవసరం..?
ఒకసారి ఆదమరిచి.. అప్రమత్తత లేకుండా ఒక పొరపాటు చేస్తే.. 60 ఏండ్లు తెలంగాణ అరిగోస పడ్డది…!
మూడు తరాలు పీడనకు బలై పోవాల్సి వచ్చింది..!
అందుకే..తెలంగాణ వచ్చింది కదా ఇంకెందుకు ఉద్యమ యాది.. మళ్లా ఎందుకు పోరాట చరిత్ర అనుకుంటే అది పెద్ద పొరపాటు అవుతుంది..!
స్వతంత్రం సాధించడం ఎంత ముఖ్యమో..నిలబెట్టుకోవడం అంతే ముఖ్యమని నేను మీకు గుర్తు చేస్తున్నా.
ఒక తరానికి ఆత్మగౌరవ రణం నేర్పి… కేసీఆర్ విముక్తి ఎట్లా సాధించాడో రేపటి తరానికి తెలుపాల్సిన బాధ్యత మన మీద ఉంది.
నిన్నటి పోరాటంలో హీరోలు ఎవరో.. విలన్లు ఎవరో.. శిఖండులు ఎవరో.. ఎవరి పాత్ర ఏందో తెలిస్తేనే ఈ జనరేషన్ జాగ్రత్త నేర్చుకుంటది..!
శత్రువు ఎప్పుడూ కుట్రలు చేస్తూనే వుంటారు. ప్రత్యర్థులు దాడులు చేస్తూనే ఉంటారు.
తెలంగాణ ఏర్పాటుతో నష్ట పోయిన శక్తులు మళ్లా ఏవో రూపంలో పెత్తనం కోసం ఆరాట పడుతూనే వుంటాయి..!
జాగ్రత్తగా గమనించండి.. కేసీఆర్ సీఎంగా దిగిపోగానే నిన్నటి దాకా అణిగిమణిగి వున్న కొన్ని శక్తులు ఎట్లా రెచ్చిపోతున్నాయో ఒక్కసారి చూడండి!
సమైక్యాంధ్ర నాయకుల సంచులు మోసిన తెలంగాణ ద్రోహులు
అస్తిత్వంపై ఎట్లా దాడి చేస్తున్నారో గ్రహిచండని కోరుతున్నా.
ఇక్కడున్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వంపై దాడి మొదలు పెట్టాడు.
సోనియమ్మ లేకపోతే.. తెలంగాణ అడుక్కుతినేదని అహంకారంతో వాగుతున్నడు కాంగ్రెస్ సీఎం!
సోనియా గాంధీ దయా దాక్షిణ్యాలు.. భిక్ష వల్లే తెలంగాణ వచ్చిందని తెలంగాణ ప్రజా పోరాటాన్ని కించపర్చుతున్నారు!
మన ప్రధాని మోడీ ఎప్పుడు చూసిన తల్లిని చంపి బిడ్డను బతికించారని తెలంగాణ ఏర్పాటును అవమానిస్తుంటాడు.
గుజరాతీ అయిన సర్ధార్ వల్లభ భాయ్ వచ్చి మనల్ని విడిపించారని చెబుతాడు.
ఇంకో గుజరాతీ వచ్చి అభివృద్ధి నేర్పిస్తున్నాడంటూ బీజేపీ నేతలు అంటున్నారు..!
తెలంగాణ సాయుధ పోరాటం నుంచి.. మలి దశ ఉద్యమాన్ని మొత్తం అవమానించేలా నోరు పారేసుకుంటున్నారు..!
గుజరాత్ గులాములు ఒక పక్క…ఢిల్లీ కీలుబొమ్మలు ఇంకో పక్క ఉన్నారు.
వీళ్లతో తెలంగాణ అస్తిత్వానికి.. ఆత్మగౌరవానికి ప్రమాదం పొంచివుంది!ఉద్యమం పై గన్ను ఎక్కుపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తా అని రెచ్చిపోతున్నడు..!
ఆయన చెరిపేయాలని చూస్తున్నది కేసీఆర్ ఆనవాళ్లను కాదు.. తెలంగాణ ఆనవాళ్లను..!
అందుకే.. తెలంగాణ రాజముద్రలో కాకతీయ కళాతోరణం.. చార్మినార్ లను తొలిగించాలని దుర్మార్గమైన ఆలోచన చేసాడు..!
ఉద్యమం ఉద్భవించి.. తెలంగాణ జాతి ప్రణమిల్లే తెలంగాణ తల్లి రూపాన్ని మార్చేస్తా అంటున్నాడు.!
సచివాలయం ఎదుట.. తెలంగాణ తల్లి స్థానాన్ని కబ్జాపెట్టి రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని పెట్టుకొని సిగ్గు లేకుండా ఢిల్లీకి గులాంగిరి చేస్తున్నాడు.
నీళ్లూ..నిధులు..నియమకాలు ఉద్యమ నినాదమే కాదని నీల్గుతున్నాడు!
ఇవేవీ..మామూలుగా తీసుకోవాల్సిన విషయాలు కానేకావు..!
ఆత్మగౌరవం.. అస్తిత్వం.. అస్మిత ప్రమాదంలో పడుతున్నప్పుడు తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయకపోతే తప్పు చేసినవాళ్లవుతం!
స్వీయ రాజకీయ అస్తిత్వం లేకపోతే.. ప్రస్తుత పార్లమెంట్ మన గళం వినిపించేటోళ్లే లేడు..!
8 వాళ్లు గెలిచారు. 8 వీళ్లు గెలిచారు. కానీ తెలంగాణ కోసం మాట్లాడే వాళ్లు లేరు.
కేసీఆర్ ఉన్నన్ని రోజులు అదానీలు, ప్రధానిలు ఇక్కడ అడుగు పెట్టే సాహసం చేయలేదు.
కానీ ఇప్పుడు మళ్లీ తెలంగాణ మీద పట్టుకోసం వస్తున్నారు.
తెలంగాణ ప్రయోజనాకోసం పట్టుబట్టే వాళ్లే లేకుండా పోయారు.
ఇది మామూలుగా తీసుకోవాల్సిన విషయం కాదు.
తెలంగాణ కవులు, కళాకారులు, మేధావులు అంతా తెలంగాణ పై జరుగుతున్న దాడిని గుర్తించాలి.
అందుకే.. ఈ దీక్షా దివస్ సందర్భంగా 14 ఏండ్ల పోరాట చరిత్రను మననం చేసుకోవాలి…!
ఈ తరంలోనూ ఆత్మగౌరవ స్ఫూర్తిని రగిలించాలి..!
ఆనాడు బ్రిటీషర్లు చేసిన దానికన్నా కూడా అరాచకంగా కొడంగల్ లో ని లగచర్లలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అక్కడి మహిళలపై బందిపోట్ల మాదిరిగా పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారు.
ఇప్పుడు నేను చూశాను. మన పోరాటానికి తలొగ్గి లగచర్లలో భూముల సేకరణ విరమించుకున్నారు.
ఇది బీఆర్ఎస్ విజయం … తెలంగాణ ప్రజల విజయం. గిరిజనులు, దళితులు, బీసీల, రైతుల విజయం.
ఈ రియల్ ఎస్టేట్ బేహారీకి…పాలన తెలియదు. మీ భూములు తీసుకొని రియల్ ఎస్టేట్ దందా చేయటం మాత్రమే తెలుసు.
మరొక రూపంలో మీ భూములు కావాలంటూ మళ్లీ వస్తాడు. జాగ్రత్తగా ఉండాలే.
ఈ ప్రభుత్వం పై ప్రతిఘటన మాత్రమే మనకు ఉన్న గత్యంతరం.
కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ భవన్ ఇప్పుడు జనతా గ్యారేజ్ అయ్యింది.
ప్రజలకు ఏ కష్టం వచ్చినా సరే తెలంగాణ భవన్ గుర్తు వస్తోంది.
మూసీ, హైడ్రా, లగచర్ల బాధితులు సాయం కోసం తెలంగాణ భవన్ కు వస్తున్నారు.
ప్రజలకు ఎప్పుడూ ఏ కష్టమొచ్చినా సరే తెలంగాణ భవన్ తలుపులు తీసే ఉంటాయి.
ప్రజల కష్టాలకు సంబంధించి శాసన సభ, మండలి సహా అన్ని వేదికలపై పోరాటం చేస్తూనే ఉంటాం.
తెలంగాణ గొంతు అంటే బీఆర్ఎస్ మాత్రమే. మరెవరూ కాదు.
మైనార్టీ సోదరులు కూడా మనవాళ్లు ఎవరో…కానీ వాళ్లు ఎవరో గుర్తించాలి.
బీఆర్ఎస్ మీద తప్పుడు ప్రచారం చేసి ప్రయోజనం పొందారు.
కేసీఆర్, బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X