మహిళా సాధికారత BRS ప్రభుత్వ లక్ష్యం

కుట్టుమిషన్ల పథకం బాగుందని సీఎం కేసీఆర్ ప్రశంసించారు

తెలంగాణలో అమలవుతున్న పథకాలు బిజెపి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా అమలు కావడం లేదు

పాలకుర్తికి ఎంతో చరిత్ర ఉన్నది, గొప్ప కవులు ఉన్నారు

ఈనెల 26,27, 28 తేదీల్లో పర్వతగిరి పర్వతాల శివాలయం పునః ప్రతిష్టకు వచ్చి, దేవుని దర్శనం చేసుకుని, మా ఇంట్లో భోజనం చేయాలి

కొడకండ్ల కుట్టు మిషన్ల శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

పాలకుర్తి : తెలంగాణ మహిళల సాధికారత, ఆర్థిక ఎదుగుదల లక్ష్యంగా ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు.

మహిళలకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించే కుట్టు మిషన్ల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలు దేశంలో బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా అమలు కావడం లేదు అన్నారు.

ఈనెల 26, 27, 28 తేదీల్లో పర్వతగిరిలోని పర్వతాల శివాలయం పునః ప్రతిష్ట కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి శివుడికి అభిషేకం చేసి,దర్శనం చేసుకుని, తన ఇంట్లో భోజనం చేసి వెళ్లాలని ఆహ్వానించారు. పాలకుర్తి నియోజకవర్గం లోని కొడకండ్లలో నేడు కుట్టుమిషన్ల శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని మంత్రి నేడు ప్రారంభించారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి మాటలు…

సీఎం కేసీఆర్ గారు వచ్చాక తెలంగాణ ఎలా అభివృద్ధి అవుతుంది అని మనం సమీక్ష చేసుకోవాలి.

బిజెపి, కాంగ్రెస్ పాలించే రాష్ట్రాలు తిరిగి వచ్చాను.

మన దగ్గర అమలయ్యే పథకాలు అక్కడ ఎక్కడా లేవు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కొన్ని ఉన్నాయి.

రైతు బంధు, 2000, 3000 రూపాయల పెన్షన్లు, కళ్యాణ బంధు, ఇంటింటికి నీళ్ళు దేశంలో ఎక్కడా లేవు.

ఇంటింటికి నీటి కోసం 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మిషన్ భగీరథ తెచ్చారు.

రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చారు.

మీటర్లు పెడితే 30వేల కోట్ల రూపాయలు ఇస్తాం అని కేంద్రం అంటే…నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు మీటర్లు పెట్టను అన్నారు.

రైతు పండించిన పంట అంతా కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం మనది. ప్రతి గింజ కొంటున్న మహానుభావులు సీఎం కేసీఆర్ గారు.

ష్యురిటి లేకుండా మహిళకు స్త్రీ నిధి ద్వారా రుణాలు ఇస్తున్నారు.

మహిళా సంఘాల మంత్రిగా మీకు మేలు చేసే అవకాశం ఇచ్చారు.

కుట్టు మిషన్ల పథకం బాగుంది అని సీఎం కేసీఆర్ గారు ప్రశంసించారు.

ఈ పథకంలో ఒక్కొక్కరికి 17వేల రూపాయలు ఖర్చు చేస్తున్నాం.

మొదటగా పాలకుర్తిలోనే పెట్టాం.

ఈ పథకం కింద పాలకుర్తి నియోజకవర్గంలో 3వేల మందికి శిక్షణ ఇస్తున్నాం.

45 రోజుల శిక్షణ ఇస్తాం… ఆ తర్వాత స్కూల్ డ్రెస్సెస్ ఆర్డర్ మీకే ఇస్తున్నాం.

ప్రభుత్వ బట్టలన్నీ మీకే ఆర్డర్ ఇస్తాం.

టెక్స్ టైల్ పార్కు లో లక్ష మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. అక్కడ తక్షణం 10వేల మంది కుట్టు మిషన్ వచ్చిన వారు కావాలి.

అయితే కనీసం 10వ తరగతి పాసై ఉండాలి అన్నందుకు పదో తరగతి అర్హతగా పెట్టాం.

ఈ శిక్షణ తరవాత ఉద్యోగం చేస్తాం అన్నవాళ్లకు అక్కడ పెట్టిస్తాం. ఇంటి దగ్గర పని చేసే వారికి ప్రభుత్వ బట్టల ఆర్డర్ ఇస్తాం.

ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కుటుంబానికి అండగా నిలబడాలి.

శిక్షణలో తప్పకుండా హాజరై స్కిల్స్ నేర్చుకోవాలి.

నిన్న బాల వికాసం కార్యక్రమంలో 15వేల మంది మహిళలు వచ్చారు.

అందరూ నన్ను దయన్న అని ప్రేమగా పిలుస్తారు. అందుకే మహిళలు పైకి రావాలి అన్నది నా లక్ష్యం.

మీకు వచ్చిన అవకాశం వినియోగించుకోవాలి.

కారం, పసుపు, ఇంటి సమాను అంతా మీరే తయారు చేయాలి.

26 లక్షలు పెట్టి వరి కోత మిషన్ తీసుకున్నారు. ఇది నిజంగా మంచి ఆలోచన. విజయవంతం అవుతుంది.

మీ చేతుల్లో పని ఉంది, ఓపిక ఉంది మీరు సక్సెస్ అవుతారు.

రేపు 26,27,28 తేదీల్లో పర్వతగిరిలో కాకతీయ రాజులు కట్టిన శివాలయాన్ని పునరుద్ధరణ చేస్తున్నాం.

నీళ్లు తెచ్చి శివుడికి అభిషేకం చేసి, దర్శనం చేసుకుని మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లాలని ఆహ్వనిస్తున్నాను.

మన పాలకుర్తిలో పురాతన ఆలయాలు, గొప్ప కవులు ఉన్నారు. అందులో భాగవతం రాసిన పోతన బమ్మెరలో పుట్టారు.

ఆయన బమ్మెరలో 4 ఎకరాల్లో వ్యవసాయం చేశారు. అది కాల క్రమేణా అన్యాక్రాంతం అయితే మళ్ళీ దానిని కొనాలి అంటే నేను లక్ష రూపాయలు అప్పట్లో ఇచ్చాను.

బాసర విద్యాభ్యాసం వలె బమ్మెర పోతన క్షేత్రంలో విద్య అభ్యాసం చేసే విధంగా చేస్తున్నాం.

వాల్మీకి మన దగ్గర వల్మిడిలో 3500 ఏళ్ల కింద రామాయణం రాశారు.

వల్మిడిలో రాముని విగ్రహాలు, వాల్మీకి బొమ్మలు, కోనేరు ఉంది.

సీఎం కేసీఆర్ గారికి చెప్పి 20 కోట్లు పెట్టీ అభివృద్ది చేశాం.

శ్రీరామ నవమి రోజున ప్రారంభం చేస్తున్నాం. మీరు తలంబ్రాలు తీసుకుని రావాలి.

పాల్కురికి సోమనాథుడు ఆది కవి. తెలుగులో రచనలు చేసిన గొప్ప కవి. మనకు అర్ధం అయ్యే భాషలో రాసిన మహా కవి.

ఆయన విగ్రహం పెద్దగా పెడుతున్నాం. 25 కోట్లతో హరిత హోటల్ కడుతున్నాం.

సేవాలాల్ మహారాజ్ ఎస్టీలకు కాదు అందరికీ ఆదర్శనీయం.

సేవాలాల్ మహారాజ్ పాలకుర్తి వచ్చి, వెళ్లిన చరిత్ర ఉంది.

పాలకుర్తిలో ఎకరం భూమి కేటాయించి 2 కోట్ల రూపాయలతో ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం.

ఎస్టీలు ఎక్కువగా పూజించే వాన కొండయ్య గుట్టను 5 కోట్ల రూపాయలతో అభివృద్ది చేస్తున్నాం.

మొదట ప్రజలను అభివృద్ది చేశాం…పల్లెలు అభివృద్ది చేశాం…ఇపుడు ఆలయాలు అభివృద్ది చేస్తున్నాం.

సోలార్ పెట్టేందుకు ఒక ఇంటికి లక్షా 42వేల ఖర్చు వస్తుంది. సబ్సిడీ సుమారు 40వేలు వస్తుంది. స్త్రీ నిధి నుంచి లక్ష రూపాయలు రుణం ఇవ్వగా.. లబ్దిదారుడు 3 వేల రూపాయలు భరించాలి.

5 ఏళ్లలో ఈ అప్పు తీరుతుంది. 30 ఏళ్లు సోలార్ ఉంటుంది. లాభంవస్తుంది.

కొడకండ్ల నుంచి ఈ సోలార్ పథకాన్ని ప్రారంభం చేశాం.

స్త్రీ నిధి ద్వారా ప్రోత్సహిస్తున్నాము.
దీనివల్ల మీకు ఉచిత కరెంట్ వస్తుంది.

అందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

ఇది మహిళకు ఇచ్చే ప్రత్యేక పథకం.

కార్యక్రమం అనంతరం కొడకండ్ల రైతు వేదిక భవనంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని మంత్రి పరిశీలించారు.

కంటి వెలుగులో పరీక్షలు చేసుకునేందుకు వచ్చిన లబ్ధిదారులతో మాట్లాడారు. కంటి పరీక్షలు పూర్తిగా చేయించుకొని అంధత్వం నుంచి బయటపడాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయి, డి. ఆర్. డి. ఏ. రామ్ రెడ్డి, డీసీసీబీ వైస్ ప్రెసిడెంట్ కుందూరు వెంకటేశ్వర రెడ్డి, ఎంపీపీ జ్యోతి, AMC చైర్మన్ రాము, సర్పంచ్ బిందు, స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X