చేనేత, వస్త్ర పరిశ్రమ భారత ఆర్థిక వ్యవస్థకు కీలకం: కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి

ప్రియమైన నేతన్నలు, చేనేత రంగంలో పనిచేస్తున్న సోదర, సోదరీమణులందరికీ.. జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. చేనేత, వస్త్ర పరిశ్రమ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కీలకభాగం. ఈ రంగం ద్వారా కోట్లాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించడంతో పాటు, దేశానికి గణనీయమైన మొత్తంలో విదేశీ మారకాన్ని సమకూరుస్తోంది.

చేనేత, వస్త్ర రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంతో పాటు 5F విజన్.. ఫామ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాబ్రిక్, ఫ్యాబ్రిక్ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారిన్ మార్కెట్స్ ను అమలు చేస్తోంది.

భారతదేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పించే రంగాల్లో వస్త్ర పరిశ్రమ ఒకటి. దేశవ్యాప్తంగా దాదాపు 5 కోట్ల మందికి ఈ రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. అందుకే ఈ రంగాన్ని మరింతగా ప్రోత్సహించి.. భారతదేశాన్ని ప్రపంచ వస్త్రకేంద్రంగా రూపుదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం.. కృషిచేస్తోంది. ఇందులో భాగంగా.. 2030 నాటికి వస్త్ర ఎగుమతులను రూ.9 లక్షల కోట్లకు పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను అందిస్తోంది.

Also Read-

PLI పథకం, PM మిత్ర పార్కులు, నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్, రా మెటీరియల్ సప్లయ్ స్కీమ్, వీవర్స్ ముద్రా స్కీమ్ వంటి కార్యక్రమాల ద్వారా నేతన్నలకు ఆధునిక మగ్గాలు, ముడి సరుకు, వర్క్‌షెడ్లు, డిజైన్ అభివృద్ధి, మార్కెటింగ్, రుణాలు, సామాజిక భద్రత వంటి అనేక రకాల సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది.

ఇందులో భాగంగా తెలంగాణలో చేనేత వస్త్ర పరిశ్రమ ప్రోత్సాహకాలను అందించడంతోపాటుగా.. వరంగల్ జిల్లాలో.. పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్క్ ను ఏర్పాటుచేశాం. ఇందులో సాంప్రదాయ పద్ధతులతోపాటుగా.. అత్యాధునిక సాంకేతికతో కూడిన మెషినరీని కూడా ఏర్పాటుచేయనున్నారు. దేశ వస్త్ర పరిశ్రమ అభివృద్ధిలో తెలంగాణ పత్తిరైతుల పాత్ర కీలకం. అందుకే మన ప్రాంతంలోని రైతుల నుంచి పత్తి కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం రూ.69,860 కోట్లకు పైగా MSP కింద ఖర్చు చేసింది.

సాంకేతికతను చేనేత, వస్త్ర రంగంతో అనుసంధానిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ (AI), అటోమేషన్, అడ్వాన్స్‌డ్ అనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతలను వినియోగించి ఉత్పాదకత, నాణ్యత, మార్కెట్ అవకాశాలను మరింత పెంచుతోంది.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా దేశంలోని నేతన్నలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన సంప్రదాయ చేనేత కళను కాపాడుతూ, నేతన్నల జీవన ప్రమాణాలను మెరుగుపరచి, భారతీయ చేనేతను ప్రపంచ మార్కెట్లలో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుంది. ప్రజలు కూడా చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.

జి. కిషన్ రెడ్డి
(కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar