Challenge: తెలంగాణ ప్రజల పల్స్ మాకు బాగా తెలుసు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుంది: అమిత్ షా

హైదరాబాద్: తెలంగాణపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల పల్స్ తనకు బాగా తెలుసునని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ కచ్చితంగా విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమిత్ షా ఓ ప్రముఖ జాతీయ మీడియా ఛానెల్‌తో మాట్లాడారు.

ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ గాలి వీస్తోందన్నారు. గ్రాస్ రూట్ లెవల్ వరకు ప్రజల పల్స్ నాకు తెలుసు. వచ్చే ఏడాది తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తానే స్వయంగా తెలంగాణకు వెళ్లి అక్కడే ఉండి బీజేపీని విజయపథంలో నడిపిస్తానని చెప్పారు. తెలంగాణలో కచ్చితంగా మార్పు వస్తుందని, దక్షిణ భారతదేశానికి తెలంగాణ గేట్ వే అని అమిత్ షా స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం త్వరలో బీజేపీకి చెందనుంది.

తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ బలపడుతోందని, ఎన్నికల వరకు మరింత బలపడుతుందని అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో తానే స్వయంగా అక్క- ఉండి బీజేపీ గెలుపునకు కృషి చేస్తానని చెప్పారు. తాజాగా బీజేపీ నేతలను ఇరకాటంలో పడేస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ పోరాటం, అమిత్ షా తాజా ప్రకటన మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని బీజేపీ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను చేర్చుకుని పార్టీని బలోపేతం చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. మరింత మంది నేతలను తన పార్టీలోకి చేర్చుకునేందుకు చూపుతున్నారు.

మరోవైపు ప్రజాసంగ్రామం పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి పార్టీని బలోపేతం చేసేందుకు బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికి నాలుగు దశల పాదయాత్ర పూర్తయింది. ఇప్పుడు ఈ నెల 28న భైంసా నుంచి ఐదో దశ పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఈ పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు జాతీయ నేతలు కూడా పాల్గొనబోతున్నారు.

కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు సమయం దొరికినప్పుడల్లా తెలంగాణలో పర్యటిస్తూ బీజేపీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ప్రధాని మోదీ కూడా తెలంగాణ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తరచూ తెలంగాణ నేతలతో టచ్‌లో ఉంటున్నారు. తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుని వ్యూహాలు పన్నుతున్నారు. (Agencies)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X