గాంధీ భవన్, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు…

హైదరాబాద్ : శోభకృత్ నామ ఉగాది సంవత్సర వేడుకలకు హాజరైన.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, సంపత్, సుదర్శన్ రెడ్డి, మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, రోహిన్ రెడ్డి, అనిల్ యాదవ్, మెట్టు సాయి, వినోద్ రెడ్డి, హర్కర వేణు గోపాల్ పార్టీ నేతలు..

Related News:

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా ఉగాది పంచాంగ వేడుకలు

ఉగాది వేడుకలకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. ఉగాది వేడుకలకు హాజరైన కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, బీజేపీ సంస్థాగత జాతీయ సహ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాశ్. జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్, జాతీయ కార్యవర్గ సభ్యులు జి.వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి, సీనియర్ నేతలు క్రిష్ణప్రసాద్, భండారి శాంతి కుమార్ తదితరులు.

పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళంపల్లి శ్రీనివాసశర్మ చేసిన పంచాంగ పఠన శ్రవణంలోని ముఖ్యాంశాలు…

• శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ధరల హెచ్చుతగ్గులు మినహా మిగిలినవన్నీ శుభ ఫలితాలను ఇస్తుంది. మాగాణి, మెట్ట పంటలు బాగా పండుతాయి. గాలి దుమారం వంటి ప్రమాదం ఉంది. వెండి, బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది.

• లోక కళ్యాణయార్థం యజ్ఝ, యాగాదాలు విరివిగా నిర్వహిస్తారు. అయోధ్యలోని సుందరమైన శ్రీరాముడి ఆలయాన్ని ప్రతిష్టిస్తారు.

• నిత్యావసర వస్తువులు, నూనె వస్తువుల ధరలు బాగా పెరిగే అవకాశం ఉంది. గోవులు సంరక్షింపబడతాయి.

• శ్రీరామ నవమి తరువాత నుండి మూఢ దినాలు ప్రారంభం. ఏప్రిల్ 29 వరకు వివాహాలు ఉండవు. మే 1 నుండి జూన్ 14 వరకు శుభ కార్యాలకు అనువైన రోజులు.

• వైశాఖ శుద్ధి విదియ ఏప్రిల్ 22 నుండి మే 2 వరకు గంగా నది పుష్కరాలు ప్రారంభం.

• మంగళంపల్లి శ్రీనివాసశర్మ పంచాంగ శ్రవణ పాఠం విన్పించిన అనంతరం ఆయన చేతుల మీదుగా ఉగాది పచ్చడి సేవించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సహా పార్టీ నేతలు

• బీజేపీ ఓబీసీ మోర్చా రూపొందించిన నూతన సంవత్సర కేలండర్ ను ఆవిష్కరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

MLC K Kavitha

ఉగాది పండుగ సందర్భంగా హైదరాబాద్ లోని తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత పూజలు నిర్వహించారు.

మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఇంట్లో కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఉగాది ఉత్స‌వాల‌ను…

శ్రీ శోభకృత్ నామ ఉగాది ప‌ర్వదినం సంద‌ర్భంగా హన్మకొండలోని త‌మ ఇంట్లో కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఉగాది ఉత్స‌వాల‌ను జ‌రుపుకున్న రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు గారు. త‌మ స‌తీమ‌ణి, ఎర్ర‌బెల్లి ట్ర‌స్టు చైర్ ప‌ర్స‌న్ శ్రీ‌మ‌తి ఎర్ర‌బెల్లి ఉషా ద‌యాక‌ర్ రావు చేతుల మీదుగా ఉగాది ప‌చ్చ‌డి సేవించిన మంత్రి

మంత్రి ఎర్ర‌బెల్లి కామెంట్స్:

ప్ర‌జ‌లంద‌రికీ తెలుగు సంవ‌త్స‌రాది శ్రీ శోభకృత్ నామ ఉగాది సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు!

ఈ ఉగాది ప్ర‌జ‌ల జీవితాల్లో ఉష‌స్సులు నింపాలి

శుభ‌ప్ర‌ద‌మై ప్ర‌జ‌లు సుఖ సంతోషాల‌తో ఉండాలి

ఈ ఏడాది వ‌ర్షాలు స‌మృద్ధిగా ప‌డి, రాష్ట్రం పాడి పంట‌ల‌తో, ప‌సిడి కాంతుల‌తో వెలుగొందాలి

సీఎం కెసిఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ స‌స్య‌శ్యామ‌ల‌మై సంక్షేమ‌, అభివృద్ధిలో అగ్ర‌గామిగా కొన‌సాగాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X