మహాత్మా జ్యోతీబాపూలే వర్థంతి సందర్భంగా నివాళులు అర్పించిన TRS, BJP, Congress Leaders

పూలే వర్థంతి సందర్భంగా మహనీయుని స్మరించుకొని నివాళులు అర్పించిన మంత్రి గంగుల

మహాత్మా పూలే ఆశయాలతో సీఎం కేసీఆర్ గారి పాలన

పూలే పేరిట 310 గురుకులాలను నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

Hyderabad: మహాత్మా జ్యోతీబాపూలే వర్థంతి సందర్భంగా ఆ మహనీయుడు బలహీనవర్గాలకు చేసిన సేవల్ని స్మరించుకుంటూ నివాళులు అర్పించారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహాత్మా పూలే ఆశయాలతో పరిపాలన సాగిస్తున్నారని, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్రంలో కేవలం 19 గురుకులాలనుండి 310 బీసీ గురుకులాలను మహాత్మా జ్యోతీబాపూలే పేరిట ఏర్పాటు చేసారన్నారు.

అంతేకాకుండా ఉన్నతమైన విదేశీ విద్యను సైతం బీసీలకు అందించడమే కాకుండా ఆత్మగౌరవం నిలిచేలా హైదరాబాద్ నడిబొడ్డున వేల కోట్ల విలువ చేసే 87 ఏకరాలను 41 బీసీ కులాలకు కేటాయించి ఆత్మగౌరవ భవనాల్ని నిర్మిస్తున్నామన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతీ పనిలో బీసీల వాటాను సగర్వంగా అందిస్తుందన్నారు. బడుగు, బలహీనవర్గాల అభివ్రుద్ది కోసం క్రుషి చేసిన మహాత్మా జ్యోతీబాపూలే చిరస్మరణీయుడని పేర్కొన్నారు మంత్రి గంగుల కమలాకర్.

మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా అంబేర్పెట్ అలీ కేఫ్ వద్ద ఉన్న జ్యోతి రావ్ పూలే విగ్రహానికి మాజీ పీసీసీ అధ్యక్షులు హనుమంతరావు గారు నివాళులు అర్పించారు. అలాగే బీజేపీ నేతలు కూడ జ్యోతి రావ్ పూలేకి నివాళులు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X