డీలిమిటేషన్ పై నిర్ణయమే జరగలేదు…దక్షిణాధికి అన్యాయం జరుగుతుంది?
కేసీఆర్ ఇట్లనే చేస్తే ప్రజలు గద్దె దింపేసిన సంగతి గుర్తుంచుకోండి
6 గ్యారంటీలపైన, ప్రజా సమస్యలపై చర్చించే దమ్ముందా?
10 లక్షల ఎకరాల పంట ఎండిపోతున్నా పట్టింపులేదా?
హైదరాబాద్ డ్రగ్స్ కు అడ్డాగా మారినా చర్యలేవి?
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటై డ్రామాలాడుతున్నయ్
జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలో భాగమే
బీఆర్ఎస్ ను పెంచి బీజేపీని దెబ్బతీసేందుకు కుట్ర
ఆ రెండు పార్టీలే రహస్య భేటీలు జరుపుతున్నాయి
కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్
హైదరాబాద్ : తెలంగాణకు నిధులివ్వ్డడం లేదని కేంద్రాన్ని బదనాం చేయడమంటే సూర్యుడిపై ఉమ్మేసినట్లేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. డీలిమిటేషన్ పై కేంద్రం గైడ్ లైన్స్ రూపొందించలేదని, ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని చెప్పారు. నిర్ణయమే తీసుకోనప్పుడు దక్షిణాదికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించడం హాస్యాస్పదమన్నారు. తమిళనాడులో డీఎంకే, కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాల పరిస్థితి దారుణంగా ఉందని, ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. అందుకే లేని సమస్యలను స్రుష్టించి కేంద్రాన్ని బదనాం చేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు.
అసెంబ్లీ లో మాజీమంత్రి జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ నిర్ణయం కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలో భాగమేనన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాదించడంతో ఆ రెండు పార్టీలకు దిక్కుతోచడం లేదన్నారు. అందుకే అసెంబ్లీలో సస్పెన్షన్ పేరుతో బీఆర్ఎస్ కు మరో ఆయుధాన్ని కాంగ్రెస్ అందించిందన్నారు. బీఆర్ఎస్ పార్టీని జాకీ పెట్టినా లేపినా ప్రజలు నమ్మడం లేదనే విషయాన్ని కాంగ్రెస్ గుర్తుంచుకోవాలన్నారు.
ఈరోజు కరీంనగర్ లో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు తదితరులతో కలిసి బండి సంజయ్ మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే పార్టీల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Also Read-
రాజాసింగ్ వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా స్పందిస్తూ….
రాజాసింగ్ వ్యాఖ్యలను నేను వినలేదు…బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే రహస్య భేటీలు జరుగుతున్నాయి. రెండు పార్టీలు ఒక్కటే. ఆ రెండు కలిసి బీజేపీని బదనాం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.
కేంద్రం తెలంగాణకు నిధులివ్వలేదనే ప్రశ్నకు బదులిస్తూ…
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏమిచ్చిందో ముందు సమాధానం చెప్పమనండి. రైతులకు భరోసా నిధులివ్వడం లేదు. రుణమాఫీని పూర్తిగా అమలు చేయరైతిరి. ఉద్యోగులకు డీఏలియ్యలేదు. రిటైర్డ్ మెంట్ బెన్ పిట్స్, మెడికల్ బిల్స్ ఇవ్వడం లేదు. నిరుద్యోగులకు భ్రుతి ఇవ్వడం లేదు. వ్రుద్దులకు రూ.4 వేల పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదు. మహిళలకు తులం బంగారం, నెలకు రూ.2500ల ఊసే లేదు. చేసిన పనులకు సంబందించి కాంట్రాక్టర్లకు బిల్స్ ఇవ్వడం లేదు. మాజీ సర్పంచులకు పెండింగ్ బిల్స్ ఊసే లేదు. కాలేజీలకు ఫీజు రీయంబర్స్ మెంట్ ఇవ్వడం లేదు… అసలు మీరు ప్రజలకు చేస్తోందేమిటి? పదేపదే కేంద్రంపై ఏడవడం తప్ప కాంగ్రెస్ సాధించిందేమిటి? స్మార్ట్ సిటీ నిధులను కేంద్రం మంజూరు చేస్తే రాష్ట్ర వాటా ఇవ్వడం లేదు. కేంద్రం వివిధ పథకాలకు నిధులిస్తే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం లేదు… అయినా కేంద్రాన్ని బదనాం చేయడమంటే సూర్యుడిపై ఉమ్మేసినట్లే. గతంలో కేసీఆర్ కూడా ఇట్లనే బదనాం చేయాలనుకున్నరు. ఏమైంది? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని దించేశారు. మళ్లీ కాంగ్రెస్ అదే పాట పాడుతోంది.
జగదీశ్ రెడ్డిని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడంపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ….
6 గ్యారంటీలపై చర్చను దారి మళ్లించడానికి, పాలనపై దారి మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కాంగ్రెస్ కు దమ్ముంటే 6 గ్యారంటీలపై అఖిలపక్షం నిర్వహించాలి. అసెంబ్లీలో ఆ హామీలపై చర్చించాలి. పంటలకు నీళ్లందక 10 లక్షల ఎకరాల పంట ఎండిపోతుంటే పట్టించుకోవడం లేదు. నీళ్లుండి కూడా సరైన ప్రణాళిక లేక రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం వద్ద ప్రణాళిక ఏమిటి? ఇది కూడా కేంద్రానిదే తప్పని బదనాం చేయాలనుకుంటుందా? ఈ విషయాలపై చర్చించకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి డ్రామాలాడుతున్నయ్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో తట్టుకోలేక దెబ్బతీయడానికి ఈ రెండు పార్టీలు కలిసి ఎత్తుగడలు వేస్తున్నాయి. బీఆర్ఎస్ ను ఎంత లేపినా పుంజుకోవడం లేదు. ఆ పార్టీ పరిస్థితి అటుఇటు కానోడి మాదిరిగా తయారైంది. ఇగ లాభం లేదనుకుని బీఆర్ఎస్ ను పెంచి పోషించి బీజేపీని దెబ్బతీయడానికి కాంగ్రెస్ కొత్త ఎత్తుగడ వేసింది. అందులో భాగంగానే అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుడు జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేసి కొత్త ఆయుధాన్ని ఇచ్చింది.
డీలిమిటేషన్ పేరుతో దక్షిణాదికి అన్యాయం చేస్తున్నారనే ప్రశ్నకు స్పందిస్తూ….
జనం సమస్యలతో తల్లడిల్లుతున్నరు. ప్రభుత్వంపై కసితో ఉన్నారు. వాళ్లను డైవర్ట్ చేసేందుకు ఈ డ్రామాలాడుతున్నరు. అందులో భాగంగానే డీలిమిటేషన్ పేరుతో దక్షిణాదికి అన్యాయం చేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. అసలు డీలిమిటేషన్ పై నిర్ణయమే జరగనేలేదు. గైడ్ లైన్స్ రూపొందించనేలేదు. ఏదీ లేకుండా ఏదో జరిగిపోతుందని ఆరోపిస్తున్నాయి. ఎందుకంటే తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వంపట్ల తీవ్రమైన వ్యతిరేక వ్యక్తమవుతోంది. కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి దారుణంగా ఉంది. కేరళలో పరిస్థితి తెలుసు. అందుకే ఆయా పార్టీలన్నీ కలిసి బీజేపీని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నాయి. ఆ పార్టీలకు ప్రజా సమస్యలపై చర్చించడానికి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై చర్చించడానికి దమ్ము లేదు. లేనిపోని సమస్యలను స్రుష్టించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నాయి. ప్రజలు వీటిని హర్షించరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై మీడియా ప్రశ్నకు స్పందిస్తూ…..
హైదరాబాద్ సహా తెలంగాణ డ్రగ్స్ కు అడ్డాగా మారాయి. వీటిపై చర్యల్లేవు. కానీ మిస్ వరల్డ్, తబ్లిగీ జమాతే సంస్థల సమావేశాల పేరుతో వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇవి చేస్తే హైదరాబాద్ బ్రాండ్ పెరుగుతుందా? డ్రగ్స్ తో పిల్లలు అల్లాడుతున్నారు. చిన్న పిల్లలతో డ్రగ్స్ దందా చేయిస్తుంటే ఏం చేస్తున్నారు. డ్రగ్స్ కేసుపై కనీసం విచారణ లేదు. ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ పాత్ర ఉందని తెలిసినా ఎందుకు అరెస్ట్ చేయలేదు. ఫోన్ ట్యాపింగ్ ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డి హయాంలోనే దర్జాగా విదేశాలకు వెళ్లిపోతే..ఎందుకు అడ్డుకోలేదు. కాంగ్రెస్ పారిపోయేలా చేస్తుంటే… మమ్ముల్ని పట్టుకుని రమ్మంటే ఎట్లా? మీకు దమ్ముంటే డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ కేసులను సీబీఐకి అప్పగించండి. లిక్కర్ కేసులో కేసీఆర్ బిడ్డను ఎట్లా అరెస్ట్ చేశామో లోకమంతా చూసింది. ఈ కేసుల్లో కూడా ఎవరి పాత్ర ఉంటే వాళ్లపై ఏ విధంగా చర్యలు తీసుకుంటామో మీరే చూస్తారు. అదేమీ చేయకుండా అన్ని కేసుల్లో కేసీఆర్ కుటుంబానికి ప్రమేయం ఉందని తెలిసినా కనీసం ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా కాంప్రమైజ్ పాలిటిక్స్ చేస్తున్నరు.
నిరంతరం అబద్దాలతో ఒకవైపు కేంద్రాన్ని బదనాం చేస్తూ… ఇంకోవైపు హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ వద్దనున్న వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను అమ్ముతూ దోచుకోవాలని చూస్తున్నారు. ప్రజలంతా గమనిస్తున్నారు. తగిన గుణ పాఠం చెప్పే రోజులు త్వరలోనే రాబోతున్నయి.