हैदराबाद: तेलंगाना के सिद्दीपेट जिले में एक भीषण सड़क हादसा हो गया। चिन्नकोडुर मंडल में अनंतसागर राजीव रोड पर एक तेज रफ्तार क्वालिस कार-लॉरी से टकरा गई। इस हादसे में तीन छात्रों की मौके पर ही मौत हो गई। जबकि 8 अन्य छात्र गंभीर रूप से घायल हो गए।
मृतकों और घायलों की पहचान इंदूरु इंजीनियरिंग कॉलेज (सिद्दीपेट) के छात्रों के रूप में की गई। पुलिस ने बताया कि पॉलिटेक्निक की परीक्षा देने के लिए 11 छात्र क्वालिस गाड़ी से करीमनगर गए थे। परीक्षा देकर लौट आते समय चिन्नकोडुर (एम) अनंतसागर गांव के बाहरी इलाके में खड़ी रेत लॉरी को क्वालिस कार ने टक्कर मार दी।
हादसे की सूचना मिलने के बाद पुलिस मौके पर पहुंची और घायलों को इलाज के लिए सिद्दीपेट अस्पताल पहुंचाया। शवों को पोस्टमार्टम के लिए अस्पताल भेज दिया गया। पुलिस मामला दर्ज कर घटना की जांच कर रही है। (एजेंसियां)
ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి
హైదరాబాద్: సిద్దిపేట (తెలంగాణ) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిన్నకోడూరు మండలం అనంతసాగర్ రాజీవ్ రహదారిపై అతివేగంగా దూసుకొచ్చిన క్వాలిస్ కారు-లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 8 విద్యార్థులుకి తీవ్ర గాయాలయ్యాయి.
మృతులు , క్షతగాత్రులు సిద్దిపేటలోని ఇందూరు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులుగా గుర్తించారు. పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాయడానికి క్వాలిస్ వాహనంలో 11మంది విద్యార్థులు కరీంనగర్ వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. పరీక్ష రాసి తిరిగి వస్తుండగా చిన్నకోడూరు (మం) అనంతసాగర్ గ్రామ శివారులో ఆగి ఉన్న ఇసుక లారీని విద్యార్థులు ప్రయాణిస్తున్న క్వాలిస్ కారు-ఢీకొన్నట్లు చెప్పారు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (ఏజెన్సీలు)