కొనసాగుతున్నది బిఆర్ఎస్ లో చేరికల పర్వం, మరో కీలక నేత…

हैदराबाद: बीआरएस में शामिल होने का अभियान जारी है। महाराष्ट्र से पहले ही पार्टी में शामिल होने वाले कई प्रमुख नेताओं की पृष्ठभूमि में एक और प्रमुख नेता बुधवार को बीआरएस में शामिल हो गए। औरंगाबाद और परभणी जिलों में सत्ता संभालने वाले एक वरिष्ठ राजनीतिक परिवार के युवा नेता अभय कैलास राव पाटिल चिकटागांवकर बुधवार को बीआरएस पार्टी के राष्ट्रीय अध्यक्ष मुख्यमंत्री के चंद्रशेखर राव के हाथों से गुलाबी दुपट्टा स्वीकार कर बीआरएस पार्टी में शामिल हो गए।

హైదరాబాద్ : బిఆర్ఎస్ లో చేరికల పర్వం కొనసాగుతున్నది. మహారాష్ట్ర నుంచి ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీలో చేరుతున్న నేపథ్యంలో.. బుధవారం నాడు మరో కీలక నేత బిఆర్ఎస్ లో చేరారు. ఔరంగాబాద్, పర్భణీ జిల్లాల్లో పట్టువున్న సీనియర్ రాజకీయ కుటుంబానికి చెందిన యువనేత అభయ్ కైలాస్ రావు పాటిల్ చిక్టాగావోంకర్ బుధవారం నాడు బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి చేతుల మీదుగా గులాబీ కండువాను స్వీకరించి బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

అభయ్ కైలాస్ రావు పాటిల్ కుటుంబం అంతా రాజకీయ నేపథ్యం కలదే. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పర్భణీ పరిసర ప్రాంతాల్లో వీరికి ప్రజాభిమానం గొప్పది. ఆ ప్రాంతాల్లో వీల్ల కుటుంబానికి మంచి రాజకీయ పట్టువున్నది. పాటిల్ తండ్రి మాజీ ఎమ్మెల్యే కైలాస్ పాటిల్, వీరు ఎమ్మెల్యేగా రెండు సార్లు ప్రజాసేవ చేశారు. వీరి తాతగారు దిగంబర్ రావు వాడికర్ కూడా మాజీ ఎమ్మెల్యేనే. వీరి చిన్నాయన బావు సాహెబ్ పాటిల్ ఎమ్మెల్యే గా రెండు సార్లు పోటీచేశారు. పాటిల్ మేనత్త ఔరంగాబాద్ మాజీ జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ గా గతంలో పనిచేశారు. వీరి కుటుంబం అంతా రాజకీయనేపథ్యం కలిగినది కావడం గమనార్హం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి తదితరులున్నారు.

రోజు రోజుకూ పెరుగుతున్న మద్దతు:

“అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’’ అనే నినాదంతో దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న బిఆర్ఎస్ పార్టీకి జాతీయ స్థాయిలో అటు ప్రజల మద్దతు ఇటు రాజకీయ నాయకుల మద్దతు రోజు రోజుకూ పెరుగుతున్నది. సిఎం కేసీఆర్ నాయకత్వానికి మహారాష్ట్ర జయ జయ ధ్వానాలు పలుకుతున్నది. మహారాష్ట్ర ప్రజల స్పందన చూస్తుంటే… మరో రెండు మీటింగుల కల్లా ఆ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభంజనం ఖాయమనిపిస్తున్నది. రానున్న రోజుల్లో తెలంగాణ మోడల్’ పాలనక దేశంలో తిరుగులేని శక్తిగా ఎదగడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. బిఆర్ఎస్ సుప్రిమో, సిఎం కేసీఆర్ మీటింగులకు మహారాష్ట్ర జన నీరాజనం పలుకుతుండడం జాతీయ రాజకీయ విశ్లేషకుల వూహను మించి పోతున్నది.

రాష్ట్రం గా ఏర్పడకముందు తాగునీరు లేక, సాగునీరు లేక, వ్యవసాయానికి ఆదరణ లేక తెలంగాణ ఎట్లుండెనో ఇప్పుడు మహారాష్ట్ర జిల్లాల్లో పరిస్థితులు కూడా అట్లనే వున్నాయి. ‘మా నీల్లు మా వనరులు మా నిధులు మాకే’ అనే నాటి తెలంగాణ నినాదం నేడు దేశ ప్రజలకోసం మారుమోగుతోంది. తెలంగాణ ఉద్యమ సారథిగా తనకు ఎట్లయితే తెలంగాణ ప్రజల్లోంచి మద్దతు పెల్లుబికిందో అదే తరహా స్పందన మహారాష్ట్ర ప్రజలనుంచి కనిపిస్తుండడం గమనార్హం. తమ కష్టాలను తీర్చే కన్నీల్లను తూడ్చే నాయకుడు సిఎం కేసీఆర్ మాత్రమేననే విశ్వాసాన్ని మహారాష్ట్ర ప్రజలు ప్రకటిస్తున్నారు. తమ భవిష్యత్తు నాయకత్వాన్ని బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు సిఎం కేసీఆర్ లో మహారాష్ట్ర ప్రజలు చూసుకుంటున్నారు.

సకల సంపదలు కలిగిన దేశములో దరిద్రమెందుకున్నదని సిఎం కేసీఆర్ లేవనెత్తుతున్న ప్రశ్నకు కేంద్ర పాలకుల వద్ద సమాధానం లేదు. ఈ దేశంలోని సహజ వనరులను సంపదను ప్రజలకోసం సరిగ్గా వినియోగంచుకోలేని అసమర్థత గత 75 ఏండ్లుగా దేశాన్నేలుతున్న పాలకులదనే విషయాన్ని ప్రజలకర్థమయ్యే భాషలో సిఎం కేసీఆర్ వివరిస్తున్నప్పుడు వస్తున్న స్పందన అమోఘం. సభలోంచి వినిపిస్తున్న కేరింతలు జయ జయ ధ్వానాలు నాటి తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తున్నాయనడంలో సందేహం లేదు.

తెలంగాణను ప్రగతి పథంలో నడిపిస్తూ… దేశంలో ‘ అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ ’ స్థాపనకు నడుం కట్టి, సిఎం కేసీఆర్ ప్రారంభించిన మహా ఉద్యమ పోరాటానికి వూహించని రీతిలో మహారాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారు. మెదటిసారి నాందేడ్ సభకు ధీటుగా మొన్నటి కాందార్ లోహ లో జరిగిన రెండవ సభ విజయవంతం కావడమే అందుకు నిదర్శనం. కేసీఆర్ ప్రభంజనం సెగ తగలుతున్న నేపథ్యంలో జాతీయ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాజకీయ విశ్లేషకులు, విమర్శకులు, మీడియా దృష్టి ఇప్పుడు బిఆర్ఎస్ వైపు మళ్లిండనడంలో సందేహమేలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar