पूर्व प्रधानमंत्री मनमोहन सिंह का निधन, तेलंगाना में छुट्टी घोषित, एक सप्ताह राजकीय शोक

हैदराबाद : पूर्व प्रधानमंत्री मनमोहन सिंह के निधन के चलते तेलंगाना सरकार ने छुट्टी घोषित की है। सरकार ने सरकारी कार्यालय और शिक्षण संस्थाओं को शुक्रवार को छुट्टी देने का अधिकारियों को आदेश जारी किया है।

साथ ही एक सप्ताह तक राजकीय शोक दिवस मनाने का मुख्य सचिव शांति कुमारी ने आदेश जारी किया है। दूसरी ओर पड़ोसी राज्य कर्नाटक सरकार ने भी आज छुट्टी घोषित की है।

इसी क्रम में, तेलंगाना के सीएम रेवंत रेड्डी ने पूर्व प्रधानमंत्री मनमोहन सिंह के निधन पर शोक जताया है। शोक संदेश में सीएम ने कहा कि आर्थिक सुधारों की शुरुआत करने वाले और भारत को दुनिया में अग्रणी बनाने वाले डॉ. मनमोहन सिंह के निधन देश के लिए अपार क्षति है।

यह भी पढ़ें-

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఇవాళ సెలవు దినంగా ప్రకటించింది. అదేవిధంగా వారం రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతపము

మరోవైపు, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపాన్ని తెలియజేశారు. ఆర్థిక సంస్కరణకు శ్రీకారం చుట్టి భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపిన డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను దేశం కోల్పోవడం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం

మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి అనారోగ్యంతో ఢిల్లీలోని ఏయిమ్స్‌లో కన్నుమూశారు. ఈ సందర్భంగా ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

మన్మోహన్ మరణం మనందరికీ తీరని లోటు: రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము

తాజాగా, రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము మాట్లాడుతుూ… మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రపంచంలోని విద్య, పరిపాలన రెండింటిలోనూ సమాన సౌలభ్యంతో పని చేసిన అరుదైన రాజకీయ నాయకుల్లో ఒకరని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంలో గణనీయమైన కృషి చేశారని పేర్కొన్నారు. వివిధ రంగాల్లో దేశానికి ఆయన చేసిన సేవ ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపారు. మన్మోహన్ మరణం మనందరికీ తీరని లోటని, ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నానని అన్నారు.

భారత్ గొప్ప వ్యక్తిని కోల్పోయింది: ప్రధాని నరేంద్ర మోడీ మోడీ

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. ‘భారత్ అత్యంత విశిష్ట నాయకులలో ఒకరైన మన్మోహన్ సింగ్ మరణానికి సంతాపం వ్యక్తం చేస్తోంది. సాధారణ నేపథ్యం నుంచి ఎదిగి ప్రఖ్యాత ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకున్నారు. పార్లమెంటులో ఆయన జోక్యం కూడా చాలా ఆచరణాత్మకంగా ఉంది. ప్రధానిగా ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు విస్తృతంగా కృషి చేశారు. ఈ సమయంలో నా ఆలోచనలన్నీ ఆయన కుటుంబం చుట్టే ఉన్నాయి’ అని పేర్కొన్నారు.

దేశ పాలనలో మన్మోహన్ కీలక పాత్ర: హోం మంత్రి అమిత్ షా

‘మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణవార్త చాలా బాధాకరం. ఆర్బీఐ గవర్నర్ నుంచి ఆర్థిక మంత్రి, దేశ ప్రధాన మంత్రి వరకు దేశ పాలనలో కీలక పాత్ర పోషించారు. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’ అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.

నా గురువును కోల్పోయా: రాహుల్ గాంధీ

మన్మోహన్ సింగ్ మరణం పట్ల కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారరు. ‘మన్మోహన్ సింగ్ దేశాన్ని అపారమైన జ్ఞానం, నిజాయితీతో నడిపించారు. ఆర్థికశాస్త్రంపై ఆయనకు ఉన్న లోతైన అవగాహన దేశానికి ఎంతో ఉపయోగపడ్డాయి. ఈ టైంలో నేను ఒక గురువును, మార్గదర్శినిని కోల్పోయా. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని పేర్కొన్నారు.

మన్మోహన్ విధానాలు పేదరికాన్ని తగ్గించాయి: ఖర్గే

‘చరిత్ర ఎప్పుడూ మన్మోహన్‌ను కృతజ్ఞతతో గుర్తుపెట్టుకుంటుంది. దేశం దూరదృష్టి గల రాజనీతిజ్ఞుడిని, గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయింది. ఆయన ఆర్థిక సరళీకరణ విధానం, హక్కుల ఆధారిత సంక్షేమ నమూనా కోట్లాది మంది భారతీయుల జీవితాలను గాఢంగా మార్చివేసింది. వాస్తవంగా భారతదేశంలో మధ్యతరగతిని సృష్టించి కోట్లాది మంది పేదరికం నుండి బయటపడింది. అచంచలమైన అంకితభావంతో ఉన్నత స్థాయికి ఎదిగి, భారతదేశ ఆకాంక్షలను సాకారం చేసిన మేథావి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నా’ అని తెలిపారు.

మన్మోహన్ నిజాయితీ ఎల్లప్పుడూ స్పూర్తినిస్తుంది: ప్రియాంకా గాంధీ

‘మన్మోహన్ సింగ్ చేసిన గౌరవాన్ని రాజకీయాల్లో కొద్దిమంది మాత్రమే ప్రేరేపిస్తారు. అతని నిజాయితీ ఎల్లప్పుడూ మాకు స్ఫూర్తినిస్తుంది. దేశానికి సేవ చేయాలనే నిబద్ధతలో స్థిరంగా ఉన్న వ్యక్తిగా ఈ దేశాన్ని నిజంగా ప్రేమించేవారిలో అతను ఎప్పటికీ నిలుస్తాడు’ అని పేర్కొన్నారు.

దశాబ్దాలుగా దేశానికి సేవలందించారు: స్పీకర్ ఓం బిర్లా

‘దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ జీ మరణం చాలా బాధాకరం. సమర్థుడైన పరిపాలకుడుగా, ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా దశాబ్దాలపాటు దేశానికి సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేశప్రజలకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అని తెలిపారు.

ఇతర ప్రముఖుల సంతాపం

మన్మోహన్ సింగ్ మరణం పట్ట దేశంలోని వివిధ రాజకీయ వేత్తలు, ప్రముఖులు సంతాపం తెలిపారు. వారిలో పారిశ్రామిక వేత్త గౌతం అదానీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజనాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ సహా పలు రాష్ట్రాల సీఎంలు సంతాపం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X