T20 World Cup 2024 : सूर्यकुमार के बल्ले और अर्शदीप सिंह के गेंद से भारत ने किया सुपर-8 राउंड के लिए क्वालीफाई

हैदराबाद : टी20 वर्ल्ड कप 2024 के 25वें मुकाबले में अमेरिका और भारत की टीमें न्यूयॉर्क के नसाउ काउंटी इंटरनेशनल क्रिकेट स्टेडियम में खेला गया। भारतीय टीम ने अब तक इस टूर्नामेंट में 3 मुकाबले खेले हैं और उसने पाकिस्तान, आयरलैंड और अब अमेरिका को हराया है। वहीं, USA की टीम कनाडा और पाकिस्तान को हराकर है। वहीं, इस मैच को जीतकर टीम इंडिया ने सुपर-8 में अपनी जगह बना ली है।

टीम इंडिया ने 111 रन के टारगेट को 18.2 ओवर में 3 विकेट के नुकसान पर हासिल किया। इस दौरान सूर्यकुमार यादव ने मैच विनिंग पारी खेली। उन्होंने 49 गेंदों पर नाबाद 50 रन बनाए। इस पारी में उन्होंने 2 चौके और 2 छक्के जड़े। वहीं, शिवम दुबे ने नाबाद 31 रन बनाकर सूर्यकुमार यादव का साथ दिया और टीम को जीत तक पहुंचाया। इससे पहले ऋषभ पंत 18 रन बनाकर आउट हुए। दूसरी ओर विराट कोहली इस मैच में अपना खाता नहीं खोल सके और रोहित शर्मा भी 3 रन बनाये।

टी20 विश्व कप में टीम इंडिया ने शुरुआती तीनों मैच जीतकर सुपर-8 राउंड में जगह बना ली है। इसी के साथ ही भारत भारत सुपर-8 राउंड के लिए क्वालीफाई करने वाला तीसरा देश बन गया है। ऑस्ट्रेलिया और दक्षिण अफ्रीका को पहले ही सुपर8 में पहुंच चुके है। अमेरिका के खिलाफ एक समय भारत के तीन विकेट जल्द ही गिर गए थे। लेकिन सूर्यकुमार यादव और शिवम दुबे ने मिलाकर भारत की जीत सुनिश्चित कर दी। (एजेंसियां)

यह भी पढ़ें-

T20 World Cup 2024 అమెరికాపై 7 వికెట్ల తేడాతో భారత్ విజయం

హైదరాబాద్ : టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. అంతేకాకుండా, సూపర్-8 రౌండ్‌కు దూసుకెళ్లింది. బుధవారం న్యూయార్క్ వేదికగా జరిగిన గ్రూపు ఏ మ్యాచ్‌లో అమెరికాపై 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన అమెరికా నిర్ణీత ఓవర్లలో 110/8 స్కోరు చేసింది. నితీశ్ కుమార్(27) టాప్ స్కోరర్. అర్ష్‌దీప్ సింగ్(4/9) విజృంభించడంతో యూఎస్‌ఏ కష్టంగా 100 పరుగులను దాటింది. అనంతరం 111 పరుగుల లక్ష్యాన్ని టీమ్ ఇండియా 3 వికెట్లు కోల్పోయి 18.2 ఓవర్లలోనే ఛేదించింది. సూర్యకుమార్ (50 నాటౌట్) హాఫ్ సెంచరీ మెరిసి జట్టు విజయం కీలక పాత్ర పోషించాడు. శివమ్ దూబె(31 నాటౌట్) రాణించాడు.

స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన టీమ్ ఇండియాకు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. మరోసారి విఫలమైన ఓపెనర్ విరాట్ కోహ్లీ(0) తొలి ఓవర్‌లో రెండో బంతికే వికెట్ పారేసుకున్నాడు. కాసేపటికే కెప్టెన్ రోహిత్(3) కూడా వెనుదిరిగాడు. వీరిద్దరూ నేత్రావల్కర్ బౌలింగ్‌లోనే అవుటయ్యారు. ఆ తర్వాత సూర్యకుమార్, రిషబ్ పంత్ కలిసి ఇన్నింగ్స్ నిర్మించారు. గత రెండు మ్యాచ్‌ల్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన పంత్(18) ఈ సారి స్వల్ప స్కోరుకే అవుటయ్యాడు. అనంతరం శివమ్ దూబె‌తో కలిసి సూర్యకుమార్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుండటంతో వీరిద్దరూ దూకుడుకు పోకుండా ఆచితూచి ఆడారు. అయితే, సూర్య మాత్రం అడపాదడపా తన శైలిలో బౌండరీలు బాది అలరించారు. 17వ ఓవర్‌లో వరుసగా 6, 4 బాది భారత్ విజయాన్ని మరింత తేలిక చేశాడు. ఈ క్రమంలోనే టీ20ల్లో 50వ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. అదే ఓవర్‌లో దూబె రెండు పరుగులు తీయడంతో భారత్ విజయం లాంఛనమైంది. అమెరికా బౌలర్లలో నేత్రావల్కర్ 2 వికెట్లతో రాణించాడు.

అంతకుముందు అర్ష్‌దీప్ సింగ్ బంతితో రెచ్చిపోయాడు. అతని పేస్ ధాటికి అమెరికా బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే యూఎస్‌ఏను దెబ్బకొట్టాడు అర్ష్‌దీప్. తొలి బంతికే ఓపెనర్ షాయన్ జహంగీర్(0)ను, అదే ఓవర్‌లో ఆండ్రీస్ గౌస్(2)ను పెవిలియన్ పంపాడు. కాసేపటికే పాండ్యా బౌలింగ్‌లో కెప్టెన్ ఆరోన్ జోన్స్(11) వెనుదిరగడంతో అమెరికా 25/3తో కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో మరో ఓపెనర్ స్టీవెన్ టేలర్(24), నితీశ్ కుమార్(27) కలిసి ఇన్నింగ్స్ నిర్మించేందుకు ప్రయత్నించారు. భారత బౌలర్లను ఆచితూచి ఎదుర్కొన్నారు. కానీ, వాళ్ల ప్రయత్నానికి అక్షర్ బ్రేక్ వేశాడు. టేలర్‌ను అవుట్ చేశాడు. అనంతరం మరోసారి చెలరేగిన అర్ష్‌దీప్ నితీశ్ కుమార్‌‌తోపాటు హర్మీత్ సింగ్(10)ను అవుట్ చేశాడు. ఆ తర్వాత షాడ్లి వాన్‌(11 నాటౌట్) విలువైన పరుగులు జోడించడంతో స్కోరు 100 దాటింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ 4 వికెట్లతో చెలరేగగా పాండ్యాకు 2 వికెట్లు దక్కాయి. అక్షర్ ఒక్క వికెట్ తీశాడు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X