Minister Uttam Kumar Reddy Condemns MLA Jagadish Reddy’s Remarks Against Speaker

Hyderabad: Irrigation and Civil Supplies Minister Capt. N. Uttam Kumar Reddy, strongly criticised Suryapet MLA Guntakandla Jagadish Reddy for his controversial remarks against Assembly Speaker Gadam Prasad Kumar. He called the comments highly inappropriate and an insult to India’s parliamentary democracy.

Speaking in the Assembly today, Uttam Kumar Reddy asserted that the Speaker holds supreme authority in the legislative system and that no member has the right to question their position. He stated that Jagadish Reddy’s remarks clearly undermined the parliamentary system and reflected an attitude of arrogance.

The minister also pointed out that the Speaker is a senior Dalit leader and said that the comments made against him exposed an elitist mindset. He warned that such behaviour would not be tolerated and insisted that strict action must be taken against the MLA.

Recalling past incidents, Uttam Kumar Reddy mentioned how, during the previous government, MLAs Komatireddy Venkat Reddy and Sampath Kumar had their membership revoked during the Governor’s address in the Assembly.

Demanding strict action against Jagadish Reddy, Uttam Kumar Reddy urged that the matter be referred to the Assembly Ethics Committee for further review.

పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమే

స్పీకర్ సుప్రీం

అహంకార ధోరణి పనికి రాదు

సభ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఎథిక్స్ కమిటికీ రికమెండ్ చేయాల్సిందే

-మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్ : శాసనసభ స్పీకర్ నుద్దేశించి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర శాసనసభలో ఈ రోజు ఆయన మాట్లాడుతూ భారత పార్లమెంట్ ప్రజాస్వామ్య వ్యవస్థలో స్పీకరే సుప్రీం అని ఆయన తేల్చిచెప్పారు.

జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ పార్లమెంటరీ వ్యవస్థను అవమానించడమే నని ఆయన పేర్కొన్నారు. స్పీకర్ ను ప్రశ్నించే అధికారం ఏ ఒక్కరికీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. దళిత జాతికి చెందిన సీనియర్ నేత స్పీకర్ హోదాలో ఉన్న అటువంటి వ్యక్తి పై చేసిన వాక్యాలు ఆయన ఆహంకార ధోరణిని బయట పెట్టినట్లయిందని ఆయన అన్నారు.

ఈ తరహాలో ఏ సభ్యుడు మాట్లాడినా ఊపేక్షింది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో వారు అధికారంలో ఉండగా ఇదే సభలో గవర్నర్ ప్రసంగం సమయంలో అప్పటి సభ్యులు కోమటిరెడ్డి వెంకట రెడ్డి,సంపత్ కుమార్ ల సభ్యత్వ రద్దు అంశాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

స్పీకర్ కు ఏమి అధికారం ఉందంటూ స్పీకర్ వ్యవస్థను, శాసనసభ వ్యవస్థతో పాటు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను అవమాన పరిచే విదంగా మాట్లాడిన సదరు సభ్యుడి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తూ…ఈ అంశాన్ని శాసనసభ ఎథిక్స్ కమిటీకి పంపాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X