हैदराबाद : टॉलीवुड इंडस्ट्री में फिल्म ‘पेल्ली संदडी’ से हीरोइन के तौर पर डेब्यू करने वाली यंग अभिनेत्री श्रीलीला के बारे में कहने के लिए कुछ खास नहीं है। वह अभी शिवा कार्तिकेयन के साथ फिल्म ‘पराशक्ति’ में काम कर रही हैं। सुधा कोंगरा के डॉयरेक्शन में बन रही इस फिल्म में रवि मोहन और अथर्व मुरली लीड रोल में दिखाई देने वाले हैं। हालांकि, यह फिल्म संक्रांति त्यौहार के लिए गिफ्ट के तौर पर रिलीज होने वाली थी, लेकिन कई वजहों से इसे स्थगित कर दिया गया।
इस बीच श्रीलीला ने अपने 24 साल में तीन बच्चों को गोद लिया और साथी स्टार्स के लिए रोल मॉडल बन गईं। स्क्रीन पर स्टार हीरोइन के तौर पर एंटरटेन करने के साथ-साथ, श्रीलीला पर्दे के पीछे बिना शादी किए एक मां के तौर पर अपना बड़ा दिल दिखा रही हैं। हालांकि, हाल ही में इस छोटी सी अभिनेत्री ने अपने गोद लेने की बात पर दिलचस्प कमेंट्स किया है। उन्होंने कहा, ‘मां बने बिना मातृत्व बनने का मिठास ही कुछ अलग है। साल 2019 में मैंने ‘किस’ नाम की एक कन्नड़ फिल्म की थी। उस फिल्म की शूटिंग एक आश्रम में हुई थी। उस समय उन बच्चों के साथ मेरा जो बॉन्ड बन गया, उसी वजह से मैंने बच्चों को गोद लिया।

पता नहीं क्यों, लेकिन शूटिंग के बाद, मैं उन बच्चों को छोड़ नहीं पाई। कुछ दिनों तक उन बच्चों की यादें मुझे परेशान करती रहीं। मैंने 2022 में उन दिव्यांग बच्चों को गोद लिया। हालांकि मैं इस बात को सीक्रेट रखना चाहती थी, लेकिन मैंने यह सोचकर इसे सामने रखा कि यह कुछ और लोगों के लिए इंस्पिरेशन बनेगी। असल में, जब मैं इस बारे में बात करती हूं तो मेरे पास शब्द नहीं होते हैं। मेरी आवाज अनायास ही कांप जाती है। मैं अब भी उन बच्चों का बहुत ध्यान रखती हूं। मैं उनके लिए सिर्फ एक मां ही नहीं, बल्कि एक दोस्त भी हूं,’ यह कहते हुए श्रीलीला इमोशनल हो गईं। फिलहाल, इससे जुड़े कमेंट्स सोशल मीडिया पर वायरल हो गए हैं।
यह भी पढ़ें-
పెళ్లి కాకుండానే అమ్మ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది
హైదరాబాద్ : ‘పెళ్లి సందడి’మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమైన యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం శివ కార్తికేయన్ సరసన ‘పరాశక్తి’మూవీలో నటిస్తోంది. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలోరవి మోహన్, అథర్వ మురళి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడింది.
ఇదిలా ఉంటే.. శ్రీలీల 24 ఇయర్స్‌లోనే ముగ్గురు పిల్లలను దత్తత తీసుకుని సాటి తారలకు ఆదర్శంగా నిలిచింది. తెరపై స్టార్ హీరోయిన్‌గా అలరిస్తూనే, తెర వెనుక ఓ పెళ్ళి కాకుండానే అమ్మగా తన గొప్ప మనసు చాటుకుంటుంది శ్రీ లీల. అయితే ఇటీవల తన దత్తత విషయంపై ఈ చిన్నది ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ‘అమ్మతనంలోని మాధుర్యాన్ని అమ్మను కాకుండానే అనుభవించడం గమ్మత్తుగా ఉంది. 2019లో ‘కిస్’ అనే కన్నడ సినిమా చేశాను. ఆ సినిమా షూటింగ్ ఒక ఆశ్రమంలో జరిగింది. ఆ టైమ్‌లో ఆ పిల్లలతో ఏర్పడిన అనుబంధమే దత్తతకు దారి తీసింది.
ఎందుకో తెలియదు షూటింగ్ తర్వాత ఆ పిల్లల్ని విడిచి వెళ్లలేకపోయాను. వారి జ్ఞాపకాలు కొన్ని రోజులు వెంటాడాయి. 2022లో ఆ దివ్యాంగ పిల్లలను దత్తత తీసుకున్నా. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలనుకున్నప్పటికీ మరికొంతమందికి ఇది ప్రేరణగా నిలుస్తుందనే ఉద్దేశంతో బయటకు చెప్పాను. నిజానికి ఈ విషయం గురించి మాట్లాడేటప్పుడు నాకు మాటలు రావు. అప్రయత్నంగా నా గొంతు వణుకుతుంటుంది. ఇప్పటికీ ఆ పిల్లల్ని దగ్గరుండి చూసుకుంటున్నా. నేను వాళ్లకు అమ్మను మాత్రమే కాదు, ఫ్రెండ్‌ని కూడా ’ అంటూ శ్రీ లీల ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. (ఏజెన్సీలు)
