లాలా గూడలోని క్యారేజ్ వర్క్‌షాప్‌ను తనిఖీ చేసిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ

హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఈరోజు లాలా గూడలోని క్యారేజ్ వర్క్‌షాప్ (సి.డబ్లూ.ఎస్)ను తనిఖీ చేశారు. జనరల్ మేనేజర్ లాలా గూడలోని క్యారేజ్ వర్క్‌షాప్‌ను సందర్శించి, వర్క్‌షాప్‌లోని అన్ని నిర్వహణ మరియు మరమ్మతు షాపులను తనిఖీ చేశారు. ఈ సంధర్భంగా చీఫ్ వర్క్‌షాప్ మేనేజర్ (సి.డబ్లూ.ఎమ్ ) శ్రీమతి సుమనా జి జనరల్ మేనేజర్ గారికి వర్క్‌షాప్ పనితీరు గురించి వివరించారు. ఈ తనిఖీలో ఇతర సీనియర్ రైల్వే అధికారులు కూడా పాల్గొన్నారు.

జనరల్ మేనేజర్ గారు లాలా గూడలోని క్యారేజ్ వర్క్‌షాప్‌ను సమగ్రంగా తనిఖీ చేశారు. జనరల్ మేనేజర్ వీల్ షాప్ నుండి తనిఖీని ప్రారంభించి, ఆ తర్వాత డీవీ ఓవర్‌హాల్ విభాగం, ఎయిర్ బ్రేక్ షాప్, పెయింట్ షాప్ మరియు స్ప్రింగ్ షాప్‌లను పరిశీలించారు. ఈ పరిశీలన కాలంలో లాలాగూడ కారేజ్ వర్క్‌షాప్ చీఫ్ వర్క్‌షాప్ మేనేజర్ (సి.డబ్లూ.ఎమ్) శ్రీమతి సుమన గారు, అక్కడ పనిచేసే సిబ్బంది విధి నిర్వహణలో పాటిస్తున్న వివిధ భద్రతా ప్రమాణాలు మరియు సురక్షా విధానాలను జనరల్ మేనేజర్‌కు వివరించారు. అంతేకాకుండా, వర్క్‌షాప్‌లో అందుబాటులో ఉన్న వివిధ అత్యాధునిక పరికరాల పనితీరు, వాటి నిర్వహణ పద్ధతులను కూడా ఆమె ఈ సందర్భంగా జనరల్ మేనేజర్‌కు కూలంకషంగా తెలియజేశారు.

జనరల్ మేనేజర్ ఈ తనిఖీల్లో భాగంగా వర్క్‌షాప్‌లోని అత్యాధునిక మరియు అధునాతన వర్క్ స్టేషన్లను, యంత్రాలను మరియు పరికరాలను కూడా పరిశీలించారు. ఇందులో భాగంగా ఎల్‌హెచ్‌బి వర్క్ స్టేషన్/మెనిప్యులేటర్, డైనమిక్ వీల్ బ్యాలెన్సింగ్ మెషిన్, షాక్ అబ్జార్బర్ టెస్టింగ్ మెషిన్ లను ఆయన సందర్శించారు. వీటితో పాటు ఎయిర్‌బ్రేక్ సబ్-స్టోర్స్, నూతన ట్రిమ్మింగ్ షాప్, ఆప్టికల్ ఎమిషన్ స్పెక్ట్రోమీటర్ మరియు యూనివర్సల్ టెస్టింగ్ మెషిన్ వంటి అధునాతన సాంకేతిక విభాగాలను ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

Also Read-

జనరల్ మేనేజర్ పనిలో నాణ్యతా ప్రమాణాలను నిరంతరం కొనసాగిస్తున్న తీరును అభినందించారు. అలాగే పని నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి సరికొత్త సాంకేతికతను అలవర్చుకోవడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. వర్క్‌షాప్‌ను స్క్రాప్ రహిత (వ్యర్థాలు లేని) యూనిట్‌గా మారుస్తూ, అక్కడ పచ్చని పర్యావరణాన్ని కాపాడుతున్న సిబ్బందిని, అధికారులను ఆయన ప్రశంసించారు. భారతీయ రైల్వేలోనే లాలాగూడ వర్క్‌షాప్ను భారతీయ రైల్వేలలోని అత్యుత్తమ కోచ్ నిర్వహణ కేంద్రాలలో ఒకటిగా పరిగణించాలని ఆయన నొక్కి చెప్పారు, అలాగే ఈ ఘనతకు అక్కడి సిబ్బందే కారణమని అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X