రేవంత్ రెడ్డి ప్రభుత్వం 80500 కోట్ల అప్పులు చేశారు, అవి ఎవరి జేబులోకి వెళ్లినట్టు?

హైదరాబాద్ : రేవంత్ రెడ్డి కుర్చీ ఎక్కిన రోజు నుండి మొత్తం 80,500 కోట్లు అప్పు తీసుకొచ్చారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. పది నెలల్లో 80,500 కోట్ల రికార్డు అప్పులు చేశారని అన్నారు. అప్పు- తప్పు అన్నోళ్లని ఇప్పుడు దేనితో కొట్టాలని ప్రశ్నించారు. ఎన్నికల హమీలేవీ తీర్చలేదు. ఏ కొత్త సాగునీటి ప్రాజెక్టు కట్టలేదు. మరి ముఖ్యమంత్రి తెస్తున్న అప్పు ఏమైనట్టు? 80 వేల కోట్ల ధనం ఎవరి జేబులోకి వెళ్లినట్టు? అని నిలదీశారు. బడా కాంట్రాక్టర్ల బిల్లులకే ధారాదత్తం చేస్తున్నారా? కమిషన్ల కోసం కక్కుర్తి పడే అప్పులు తెస్తున్నారా? అని ప్రశ్నించారు.

అప్పు శుద్ధ తప్పు అని ప్రచారంలో ఊదరగొట్టి అవే అప్పుల కోసం ముఖ్యమంత్రి పాకులాడటమేంటి అని రేవంత్‌ రెడ్డిని కేటీఆర్‌ నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో అప్పులు తీసుకుని ప్రాజెక్టులు కట్టామని ప్రతిపైసాతో మౌలిక సదుపాయాలు పెంచామని తీసుకున్న రుణంతో దశాబ్దాల కష్టాలు తీర్చామని తెలిపారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెస్తున్న అప్పుల “అడ్రస్” ఎక్కడ అని ప్రశ్నించారు. రుణమాఫీ చేయకుండా రైతుభరోసా వేయకుండా ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టకుండా నెలలపాటు జీతాలు ఇవ్వకుండా ఇన్ని వేలకోట్లు ఏమైనట్టు? ఎవరి జేబుల్లోకి వెళ్లినట్టు అని ప్రశ్నించారు. రాష్ట్ర సంపద సృష్టికి కాకుండా సొంత ఆస్తులు పెంచుకోవడానికి అప్పులు చేయడం క్షమించరాని నేరమని వ్యాఖ్యానించారు. ఇది తెలంగాణ భవిష్యత్తుకు పెను ప్రమాదమని హెచ్చరించారు.

ఇది కూడ చదవండి-

ఆర్బీఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.1000 కోట్ల అప్పు తీసుకున్నది. స్వయంగా ఆర్బీఐ మంగళవారం ఈ విషయాన్ని ప్రకటించింది. దీంతో నిరుడు డిసెంబర్‌ 7న అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు 315 రోజుల్లో రేవంత్‌రెడ్డి సర్కా రు తెచ్చిన అప్పులు రూ.74,495 కోట్లకు పెరిగాయి. గత నెలలో 3 దఫాలుగా రూ.4,500 కోట్ల రుణాలు పొందిన రేవంత్‌ ప్రభుత్వం ఈ నెల 1న రూ.2,000 కోట్ల అప్పు తీసుకున్నది. తాజాగా 21 ఏండ్ల కాలానికి బాండ్‌ను జారీచేసి మరో రూ.1,000 కోట్ల అప్పు తెచ్చింది. ఇలా ప్రతి నెలా రూ.5-6 వేల కోట్ల రుణాలు సమీకరిస్తున్న రేవంత్‌ సర్కారు ఇప్పటివరకు ఒక్క ఆర్బీఐ నుంచే 49,618 కోట్ల అప్పులు తెచ్చింది. ఇవి చాలక కార్పొరేషన్లు, స్వయం ప్రతిపత్తి సంస్థలకు గ్యారంటీలు ఇవ్వడంతో మరో రూ.25 వేల కోట్ల వరకు రుణాలను సేకరించింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X