हैदराबाद: गोशामहल विधायक और बीजेपी के बहिष्कृत नेता टी राजा सिंह को फिर से गिरफ्तार कर लिया गया है। पुलिस ने राजा सिहं को सीएम केसीआर कैंप कार्यालय प्रगति भवन में हिरासत में लिया। राजा सिंह अपने क्षतिग्रस्त बुलेट प्रूफ वाहन को प्रगति भवन के पास छोड़कर जा रहे थे।
पुलिस ने यह देखा और राजा सिंह को गिरफ्तार कर लिया। इससे पहले भी राजा सिंह के खिलाफ पीडी एक्ट का मामला दर्ज कर पुलिस ने उन्हे गिरफ्तार किया था, लेकिन अब एक बार फिर गिरफ्तार करना चर्चा का विषय बन गया है।
హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ బహిష్కృత నేత రాజాసింగ్ మళ్లీ అరెస్ట్ అయ్యారు. సీఎం కేసీఆర్ క్యాంపు ఆఫీస్ ప్రగతిభవన్ వద్ద ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెడిపోయిన తన బుల్లెట్ ఫ్రూఫ్ వెహికల్‌ను ప్రగతిభవన్ వద్ద వదిలేసి రాజాసింగ్ వెళుతున్నారు. తనకు ఇచ్చిన బల్లెట్ ఫ్రూఫ్వాహనం పదే పదే చెడిపోయిందని, ఎన్నిసార్లు చెప్పిన తన బాధ పట్టించుకోవడం లేదని, వాహనాన్ని మార్చాలని సీఎం కేసీఆర్ను కోరడానికి శుక్రవారం గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రగతి భవన్ కు వెళ్లారు.
ఇదే క్రమంలో రాజాసింగ్ ను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. అయితే.. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఇంటికి వెళుతున్న సమయంలో బుల్లెట్ ప్రూఫ్ కారు లో వెళ్తున్న సమయంలో కారు టైర్ ఊడిపోయింది. గతంలో పలుమార్లు కూడా వాహనం ఇబ్బంది పెట్టింది. మరో కారు కేటాయించాలని ఎన్నోసార్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా స్పందన లేదని, పాత కారుకే మరమ్మతులు చేసి పంపిస్తున్నారని రాజాసింగ్ పేర్కొన్న విషయం తెలిసిందే.

ఇది గమనించిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. గతంలో రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేయగాఇప్పుడు మరోసారి ఆయనను అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
రాజాసింగ్‌ను ప్రగతిభవన్ వద్ద అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన ఎక్కడ వదలమని చెబితే అక్కడ వదిలిపెడతామని చెబుతున్నారు. రాజాసింగ్ అరెస్ట్‌పై ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు మండిపడుతున్నారు.
గురువారం అసెంబ్లీ నుంచి రాజాసింగ్ తన ఇంటికి వెళుతుండగా మార్గం మధ్యలో ఆయనకు ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం ఆగిపోయింది. కారు టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. అయితే ఈ ఘటనలో రాజాసింగ్‌కు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. (ఏజెన్సీలు)