ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు వేంటనే విడుదల చేయాలి- కేటీఆర్

650 కోట్లు చెల్లిస్తే ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజ్ లపై ఆధారపడిన దాదాపు 12 లక్షల మందికి మేలు జరుగుతుంది

ప్రభుత్వంపైన ప్రధాన ప్రతిపక్షంగా ఫీజుల విడుదలకు కోట్లాడతామని తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజేస్ మేనేజ్ మెంట్ అసోసియేషన్ కు కేటీఆర్ భరోసా

హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్ మేనేజ్ మెంట్ అసోసియేషన్ కోరింది. తెలంగాణ భవన్ లో బుధవారం తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజేస్ మేనేజ్ మెంట్ అసోసియేషన్ కేటీఆర్ ను కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందజేసింది.

ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజ్ లకు ప్రభుత్వం తక్షణమే రూ. 650 కోట్ల రూపాయలు చెల్లిస్తే తమ సమస్య చాలా వరకు తీరుతుందని వారు కేటీఆర్ దృష్టికి తమ సమస్యను తీసుకొచ్చారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరించటం కారణంగా కాలేజ్ భవనాల అద్దె, స్టాఫ్ కు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేవలం రూ. 650 కోట్లు చెల్లిస్తే ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజ్ లపై ఆధారపడిన దాదాపు 12 లక్షల మందికి మేలు జరుగుతుందని ఈ సందర్భంగా వారు కేటీఆర్ కు చెప్పారు. వెంటనే బకాయిలు చెల్లించేలా ప్రభుత్వం పై ఒత్తిడి పెంచాలని కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు.

దీనిపై స్పందించిన కేటీఆర్ కచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచైనా ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను చెల్లించేలా ఒత్తిడి తెస్తామని వారికి హామీ ఇచ్చారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియాలో సమావేశంలోనూ కేటీఆర్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. గత ప్రభుత్వాల బకాయిలంటూ దిక్కుమాలిన మాటలు చెప్పకుండా వెంటనే బకాయిలను చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Also Read-

బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడకముందు అంతకముందున్న ప్రభుత్వం పెండింగ్ పెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను తాము చెల్లించామని కేటీఆర్ గుర్తు చేశారు. తప్పకుండా ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజ్ లకు ఫీజు బకాయిలు చెల్లించే విషయంలో ప్రభుత్వాని నిలదీస్తామని తనకు కలిసిన కాలేజీ యాజమాన్యాలకు హామీ ఇచ్చారు. కేటీఆర్ ను కలిసిన వారిలో తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మేనేజ్ మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు బొజ్జ సూర్యనారాయణ రెడ్డి, స్టేట్ జనరల్ సెక్రటరీ యాద రామకృష్ణ సహా అసోసియేషన్ సభ్యులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar