కాంగ్రెస్ సభకు పోతే పోడు భూములకు పట్టాలు రావని బెదిరిస్తున్నారు: రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : “కాంగ్రెస్ సభకు వెళితే పోడు భూములకు పట్టాలు రావని బెదిరిస్తున్నారు. బిడ్డా పోడు భూములకు పట్టాలు ఎలా రావో చూస్తాం. అర్హులైన వారికి పోడు భూములకు పట్టాలిచే వరకు కాంగ్రెస్ మీకు అండగా ఉంటుంది” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. హాత్ సే హత్ జోడో యాత్రలో భాగంగా 6వరోజు ఇల్లందు ప్రాంతంలో దాదాపు 5 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఇల్లందు జగదాంబ సెంటర్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

అర్హులైన అందరికీ పోడు భూములకు పట్టాలు ఇస్తామని భరోసా ఇస్తున్నాం

ప్రాంతం సింగరేణికి పుట్టినిల్లు. సింగరేణి కార్మికుల సమస్యలకు కేసీఆరే కారణం. పాదయాత్రలో కలిసిన గిరిజన టీచర్లు ప్రమోషన్లు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోడు భూములపై సీతక్క మాట్లాడితే అసెంబ్లీలో కేసీఆర్ రంకెలేశారు. ఎక్కడికెళ్లినా ఆదివాసీ, గిరిజనులు పోడు భూముల సమస్యల గురించి ప్రస్తావిస్తున్నారు. 2024, జనవరి 1 న కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. అర్హులైన అందరికీ పోడు భూములకు పట్టాలు ఇస్తామని భరోసా ఇస్తున్నాం. దీంతో ప్రజలకు కాంగ్రెప్ పార్టీపై నమ్మకం కలుగుతుందని కేసీఆర్ కు గుబులు పుట్టింది. గిరిజనులు, ఆదివాసులు కాంగ్రెస్ కు అండగా ఉంటున్నారని…. పోడు భూములకు పట్టాలిస్తామని ప్రకటించిండు.

తాడ్వాయి అడవుల్లో అడబిడ్డలను చెట్లకు కట్టేసి కొడితే మేం వెళ్లి అండగా నిలిచాం

ఇవాళ కేసీఆర్ ప్రకటనను ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. గత తొమ్మిదేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇవ్వకపోగా హరితహారం పేరుతో వేల ఎకరాలను గుంజుకుంది. పోడు భూముల గురించి ప్రశ్నిస్తే మంచిర్యాల, నిర్మల్ ప్రాంతంలో మహిళలపై దాడి చేయించి చంటిపిల్లలతో సహా కేసులు పెడితే సీతక్క వారికి అండగా నిలిచింది. తాడ్వాయి అడవుల్లో అడబిడ్డలను చెట్లకు కట్టేసి కొడితే మేం వెళ్లి అండగా నిలిచాం. 2014 నుంచి తొమ్మిదేళ్లుగా పోడు భూములకు ఎందుకు పట్టాలివ్వలేదు? అసెంబ్లీని అడ్డుపెట్టుకుని కేసీఆర్ ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు. కాంగ్రెస్ సభకు వెళితే పోడు భూములకు పట్టాలు రావని బెదిరిస్తున్నారు. బిడ్డా పోడు భూములకు పట్టాలు ఎలా రావో చూస్తాం పట్టాలు ఇవ్వకుంటే అడవుల్లోకి ఓట్లు అడగడానికి వస్తే.. మీపై తిరగబడటం ఖాయం. తాడ్వాయి అడవుల్లో మాదిరిగా బీఆర్ఎస్ నాయకులను చెట్లకు కట్టేసి పట్టాలు ఇచ్చిన తర్వాతనే వదులుతాం.

ఫామ్ హౌస్లో గుంట భూమి ఆడిగారా?

కేసీఆర్… మా గిరిజనులు నీ వెయ్యి ఎకరాలలోని ఫామ్ హౌస్లో గుంట భూమి ఆడిగారా? నీ బ్యాంకులో ఉన్న కోట్లలో చిల్లిగవ్వ ఆడిగారా? అర్హులైనవారికి 11 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలిచే వరకు కాంగ్రెస్ మీకు అండగా ఉంటుంది. 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో ఎస్టీల రిజర్వేషన్లు పెంచుతు అన్నడు. బోయలు వాల్మీకీలను ఎస్టీల్లో కలుపుతా అన్నడు. తొమ్మిదేళ్లు పోయింది. తెలంగాణ మొట్టమొదటి శాసనమండలి వాల్మీకిబోయ గట్టు భీముడిని ఎమ్మెల్సీగా పంపిస్తా అన్నాడు. చూసిచూసి భీముడు దేవుడికి దగ్గరికి పోయాడు. వాల్మీకి బోయలు నిన్ను నమ్మే పరిస్థి లేదు. పిట్టను గురి పెట్టి కొట్టినట్లు బోయలు కేసీఆర్ ను గురి పెట్టి ఓడించడం ఖాయం. 1/70 యాక్ట్ అమలు చేస్తున్న ప్రాంతంలో జీవో నెంబర్ 3 ప్రకారం గిరిజన టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి.

కష్టాల్లో ఉన్న వారికి అభయం ఇచ్చే హస్తం కాంగ్రెస్

రాష్ట్రంలో మీ ప్రభుత్వమే ఉంది కదా బయ్యారం ఉక్కు కర్మాగారం ఎందుకు నిర్మించలేదు. కేసీఆర్ తో కాదు కాంగ్రెస్ ప్రభుత్వంలొనే అది బయ్యారం కలు సాకారం అవుతుంది. 2024, జనవరి 1న కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇళ్లు లేని పేదలకు ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల సాయం అందిస్తాం. రూ. 5 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి రైతును ఆదుకుంటాం. ప్రతీ పంటను ప్రభుత్వమే కొని దళారి వ్యవస్థను పాతర వేసే బాధ్యత కాంగ్రెస్ ది. ఖాళీగా ఉన్న 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. పేదలకు, కష్టాల్లో ఉన్న వారికి అభయం ఇచ్చే హస్తం కాంగ్రెస్. అభయ హస్తం మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

సింగరేణిని ప్రయివేటుపరం కానిచ్చే ప్రసక్తే లేదు

అంతకుముందు జవహర్ గనిని సందర్శించి కార్మికుల సమస్యలను తెలుసుకున్నారు. రెగ్యులర్ కార్మికులను తొలగించి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పెట్టి ప్రభుత్వం శ్రమ దోపిడీకి పాల్పడుతోందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి గని కార్మికుల పాత్ర ఎంతో ఉంది. ఒకప్పుడు 80 వేలు ఉన్న ఉద్యోగులు 40వేలకు తగ్గిపోయారు. కమీషన్ల కక్కుర్తి కోసం ఓపెన్ కాస్ట్ గనులను ప్రయివేటుకు కట్టబెడుతున్నారని విమర్శించారు. సింగరేణిని ప్రయివేటు పరం చేయొద్దని పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీశాము. సింగరేణి గనులను ప్రయివేటుకు కట్టబెట్టి రూ. 25 వేల కోట్లు దోపీడికి పాల్పడాలని చూస్తే దాన్ని అడ్డుకున్నాం. సింగరేణిని ప్రయివేటుపరం కానిచ్చే ప్రసక్తే లేదు. సింగరేణిని కాపాడేందుకు కావాల్సిన అన్ని చర్యలు కాంగ్రెస్ తీసుకుంటుంది. ప్రయివేటైజేషన్ కు వ్యతిరేకం అంటూనే మైన్స్ ను ప్రయివేటుకు అప్పగిస్తున్నారు. ఇందుకు కేసీఆర్ పరోక్షంగా మోదీకి సహకరిస్తున్నారు.

సింగరేణిలో కార్మికుల జీతాలు ఇవ్వలేని పరిస్థితి

సింగరేణికి జెన్ కో 12 వేల కోట్ల బకాయి పడింది. అందుకే సింగరేణిలో కార్మికుల జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. సింగరేణి సంస్థల్లో అన్ని అక్రమాలకు కారణం సీఎండీ శ్రీధర్. రెండు మూడేళ్లు మాత్రమే ఆ స్థానంలో ఉండాల్సిన శ్రీధర్ ఏళ్లు గడుస్తున్నా సీఎండీగా కొనసాగుతున్నారు. ఓపెన్ కాస్ట్ మైన్ తో కార్మికులకు ఉపాధి లేకుండా చేస్తున్నారు. 10 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. సింగరేణిలో దోపిడీకి పాల్పడిన వ్యక్తులను కటకటాల్లోకి పంపిస్తాం. గతంలో ఇలాంటి పనులు చేసిన ఐఏఎస్ అధికారుల పరిస్థితి ఏమైందో సీఎండీ శ్రీధర్ గుర్తు తెచ్చుకోవాలి. అధికారంలోకి వచ్చిన తరువాత సింగరేణిలో అవకతవకలపై విచారణకు ఆదేశిస్తూ తొలి సంతకం చేస్తాం. అండర్ గ్రౌండ్ మైన్ లు ఓపెన్ చేసి కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి. కార్మికుల సమస్యలు కాంగ్రెస్ పరిష్కరిస్తుంది. ఈ దండకారణ్యంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాల అని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

People are being threatened of not giving Podu pattas if they to go to the Congress’ public meeting: TPCC President Revanth Reddy

Hyderabad : “They threaten to not give pattas to Podu lands if people go to the Congress’ public meeting. Will see how they cannot give pattas to the Podu lands. “Congress will stand by you till the Podu pattas are given to the deserving ones,” said TPCC president Revanth Reddy. As a part of Hath Se Hath Jodo Yatra, on the 6th day, a 5 km walk was conducted in the Yellandu area. Later, Revanth Reddy addressed a meeting at Jagadamba Center Street Corner in Yellandu.

The region is the birthplace of Singareni. KCR is responsible for the problems of Singareni workers. The tribal teachers who met during the march expressed their concern over the lack of promotions. When Seetakka spoke about Podu lands, KCR spoke ill of it in the assembly. Everywhere Adivasis and tribals are talking about the problems of Podu lands. Congress will come to power on January 1, 2024. We are assuring that all those who are eligible will be given titles for Podu lands. So, KCR is worried that the people will have faith in the Congress party.

SInce Tribals are supporting Congress, KCR announced he will give pattas to the Podu lands. No one believes KCR’s statement today. For the past nine years, the KCR government has not given title to Podu lands and has grabbed thousands of acres in the name of Haritaharam. When asked about Podu lands, they attacked women in Mancherial and Nirmal areas and filed cases including children. Seetakka stood by them. In Tadwai forests, we went and stood by when the children were tied to trees and beaten. Since 2014 for nine years, why were pattas not given to Podu lands?

KCR is trying to cheat the people using the assembly. They threaten to not give pattas to Podu lands if people go to the Congress’ public meeting. Let’s see how the land titles will not be given. if you don’t give the titles, if you come to the forests to ask for votes, you will be chased away. Like in Tadwai forests, BRS leaders will be tied to trees and released only after giving them handcuffs. KCR.. Did our tribals ask for a piece of land in your thousand acre farm house? Did they ask even a penny of the crores in your bank? Congress will stand by the people until 11 lakh acres of waste lands are given to those who deserve it. In 2014, KCR said that within four months coming to power, reservation for STs would be increased. He said that Boya Valmikis will be given ST status.

Nine years have passed but nothing has happened. He promised to make Gattu Bheemudu, a Valmiki Boya leader a member of the Legislative Council. Gattu Bheemudu passed away waiting for the membership. Valmiki Boyas don’t believe you. Boyas will defeat KCR in the assembly elections. Promotions should be given to tribal teachers as per GO No. 3 in the area where Act 1/70 is being implemented. It is your government in the state, why did not Bayyaram steel plant be built? Bayyaram dream will be realized only in the Congress government, not with KCR.

Congress will come to power on January 1, 2024. In the Congress government, we will provide Rs. 5 lakh assistance to build houses for the poor who have no houses. Rs. 5 thousand crore fee reimbursement dues will be paid by the Congress government. We will waive off the loan of Rs.2 lakh to the farmers and support the farmer. Congress will be responsible for buying every crop by the government and putting an end to the middleman system. Congress will take the responsibility of filling up 2 lakh vacant government jobs. The Congress party will be responsible for providing medical care to the poor at the corporate level. Congress is the hand that gives refuge to the poor and those who are in trouble. Abhaya Hastam will protect you. He urged to make the Congress party win the next election.

Will not allow privatizing Singareni

Earlier, he visited Jawahar mine and learned about the workers’ problems. He said that the government is exploiting labor by removing regular workers and hiring contract and outsourcing workers. The role of Singareni mine workers in the achievement of Telangana state is very important. Once there were 80 thousand employees but now reduced to 40 thousand. He criticized that open cast mines are being privatized for the sake of commissions. We protested to the Center in the Parliament not to privatize Singareni. We stopped the central government from privatizing Singareni and their conspiracy to loot Rs 25 thousand crores.

We will not allow privatizing Singareni. Congress will take all necessary steps to save Singareni. Mines are being handed over to the private sector while also saying that they are against privatisation. KCR is indirectly helping Modi for this. Genco owes 12 thousand crores to Singareni. That is why Singareni is unable to pay workers their salaries. CMD Sridhar is the rootcause of all irregularities in Singareni. Sridhar, who was only supposed to stay in that position for two or three years, continues as CMD years together. Open cast mines are making workers jobless.

Congress will come to power in 10 months. We will send behind bars those who are involved in loot in Singareni. CMD Sridhar should remember what happened to the IAS officers who committed similar crimes in the past. After coming to power, we will sign the first order to investigate the irregularities in Singareni. Revanth demanded to open underground mines and provide employment to the workers. Give one chance to the Congress party which gave Telangana. Congress solves workers’ problems. Revanth Reddy appealed to make the Congress flag fly high in the forest.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X