పార్టీ ఫిరాయించిన 12 మంది కాంగ్రెస్ MLA లను ప్రజా కోర్టులో ఉరి తీయాలి: రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : పార్టీ ఫిరాయించిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రజా కోర్టులో ఉరి తీసినా తప్పులేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. హాత్ సే హత్ జోడో యాత్రలో భాగంగా 5వరోజు కామేపల్లి మండలం లచ్చతండా నుంచి కొత్తలింగాల వరకు 11కి.మీ. మేర పాదయాత్ర నిర్వహించారు. అనంతరం కొత్త లింగాలలో నిర్వహించి స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

“పార్టీ ఫిరాయించిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాజకీయంగా బొంద పెట్టాల్సిన బాధ్యత తెలంగాణా సమాజంపై ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే కోసం నేను రాహుల్ గాంధీతో కోట్లాడి టికెట్ ఇప్పించాను. అయిన మరొకరి ఒత్తిడితో పార్టీ మారింది. ఈ 12 మందిని ప్రజా కోర్టులో ఉరి తీసినా తప్పులేదు. నిజంగా బీజేపీకి కేసీఆర్ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని భావిస్తే 12 మంది ఎమ్మెల్యేలపై కూడా సీబీఐ విచారణ జరపాలి. మీరు అభిమానంతో గెలిపిస్తే దొరగారి గడీలో గడ్డి తినేందుకు వెళ్లారు. పార్టీ మారిన తర్వాత వారికి చేకూర్చిన లాభాలు, లావాదేవీలపై కూడా విచారణ చేయాలి. అలా చేయకపోతే బండి సంజయ్, కిషన్ రెడ్డి కేసీఆర్ కు లొంగిపోయినట్లే అని భావించాల్సి వస్తుంది. నకిలీ వితనాల్లా.. తెలంగాణ రాజకీయాల్లో నకిలీ నాయకులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. పార్టీ ఫిరాయించిన ఆ 12 మంది ఎమ్మెల్యేలను డిపాజిట్లు రాకుండా ఓడగొట్టాలి. శాశ్వతంగా ఓడించాలి రాజకీయంగా బొంద పెట్టాలి”అని రేవంత్ రెడ్డి అన్నారు.

ఖమ్మం జిల్లాలో అయిదు సార్లు ఓటమి ఎరుగని నేత రాంరెడ్డి వెంకట్ రెడ్డి. అందరికీ సహకరించిన గొప్ప నాయకుడు. ప్రజలకు సేవలందించేందుకు రాంరెడ్డి సోదరులు తమ జీవితాలను పణంగా పెట్టాం. అటువంటి నాయకుడు అనారోగ్యంతో మరణిస్తే వారి సతీమణిని ఏకగ్రీవంగా ఎన్నుకుందామని మేమేందరం అడిగితే కాదని సిగ్గు లేకుండా పోటీ పెట్టిన దరిద్రుడు కేసీఆర్ అని ఆయన విమర్శించారు. ఎవరైనా ఎమ్మెల్యే మరణిస్తే వారి కుటుంబ సభ్యులను ఏకగ్రీవం చేసే మంచి సాంప్రదాయం ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది. ఆ సంప్రదాయాన్ని తుంగలో తొక్కి ఉప ఎన్నికలో అభ్యర్థిని పెట్టి వెంకట్ రెడ్డి కుటుంబాన్ని అవమానించిన నీచుడు ఈ ముఖ్యమంత్రి అని ఆయన అన్నారు. అందుకే వెంకట్ రెడ్డి ఆత్మ క్షోభించి కేసీఆర్ ను వెంటాడి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులు ఓడేలా చేసింది.

పాదయాత్ర మార్గమధ్యలో భూక్య రమేష్ కుటుంబాన్ని కలిశాను. సాయుధదళాల్లో పని చేస్తూ ప్రమాదవశాత్తూ రమేష్ మరణించాడు. ఆయనకు భార్య, ముగ్గురు సంతానం. ఆత్తామామలను విడిచి బయటికి వెళ్లని పరిస్థితి రమేష్ భార్యది. గొప్పలు మాట్లాడే కేసీఆర్ రమేష్ చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత లేదా. కల్నల్ సంతోష్ బాబు భార్యకు ఉద్యోగం ఇచ్చారు. అదేవిధంగా గిరిజనుడైనా భూక్యా రమేష్ కుటుంబాన్ని ఎందుకు ఆదుకోరని ఆయన ప్రశ్నించారు.

పాదయాత్రలో పొన్నెకల్ సబ్ స్టేషన్ వద్ద రైతులు ధర్నాచేస్తూ కనిపించారు. న్యూయార్క్ లోనైనా కరెంట్ పోతుందేమో కానీ తెలంగాణ కరెంట్ పోదు అన్న సన్నాసి దీనికి ఏం సమాధానం చెప్తారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కరెంటు కోతలపై రైతులు రోడ్డెక్కుతున్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం ఉచిత విద్యుత్ ఫైల్ పై చేసింది. 9 గంటలు పగటి పూట నాణ్యమైన విద్యుత్ ను అందించింది. ఇప్పుడు కూడా రాష్ట్రంలో 2004 నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. 24 గంటలపాటు కరెంట్ ఇవ్వడం కేసీఆర్ వల్ల కాదు. విద్యుత్ సంస్థలు 60 వేల కోట్ల రూపాయాల అప్పుల్లో ఉన్నాయి. ఇందులో సర్కార్ చెల్లించాల్సినవే 28 వేల కోట్లు. విద్యుత్ సంస్థలు త్వరలో మునిగిపోయే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో మరో బషీర్ బాగ్ తరహా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇందుకు కలిసి రావాల్సిందిగా కమ్యూనిస్టు మిత్రులను కూడా కోరుతున్నా అని రేవంత్ రెడ్డి అన్నారు.

ఈ ప్రాంతంలో 29 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అందులో 23 మంది గిరిజనులే. ఖమ్మంలో మద్దతు ధర అడిగిన పాపానికి రైతులకు బేడీలు వేసిన ఘటన రైతులు మరచిపోలేదు. అందుకు కేసీఆర్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

కేసీఆర్ పాలనలో డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదు.. దళితులకు మూడెకరాలు ఇవ్వలేదు. రైతులకు లక్ష రుణమాఫీ చేయలేదు. ఇటువంటి కల్వకుంట్ల రాజ్యాన్ని ఖతం చేసి ప్రజా రాజ్యాన్ని నిర్మించుకుందాం. జనవరి 1, 2024లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఇళ్లు కట్టుకునే ప్రతీ పేదలకు రూ.5లక్షలు అందిస్తాం. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత తీసుకుంటాం. ఖాళీగా ఉన్న 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం.

అటవీ భూముల హక్కుల చట్టం ప్రకారం పోడు భూములకు పట్టాలిచే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. ఏ అవకాశం ఉన్నా…రాంరెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబానికి రాజకీయంగా మంచి ప్రాధాన్యం ఇచ్చేందుకు నా వంతు ప్రయత్నం చేస్తా. జనవరి 26, 2024 బయ్యారం ఉక్కు కర్మాగారం కోసం శిలాఫలకం వేసే బాధ్యత మాది. బయ్యారం ఉక్కు కర్మాగారంతో వేలాది యువకులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం.

12 MLAs who defected from the party should be hanged in a public court: Revanth Reddy

Hyderabad : TPCC president Revanth Reddy said that it is not wrong to hang 12 Congress MLAs in the people’s court who defected from the party. As part of Hath Se Hath Jodo Yatra, on the 5th day the walkathon of 11 km took place from from Lacchatanda to Kothalingala in Kamepalli mandal. Later, Revanth Reddy addressed the street corner meeting held at Kothalingala.

He said that the Telangana society has the responsibility to politically destroy the 12 Congress MLAs who have defected from the party. He recalled that he fought with Rahul Gandhi to get a ticket for the MLA there. But the MLA changed party due to someone’s pressure. It is not wrong to hang these 12 people in the people’s court.

If BJP really wants to take action against KCR’s illegalities then CBI should also investigate these 12 MLAs. You made them win out of love, but they went to lick Dora’s(KCR) boots. The profits and transactions made to them after defecting the party should also be investigated. If they don’t do that, then people should understand that Bandi Sanjay and Kishan Reddy have surrendered to KCR.

The fake leaders are looting the state in Telangana politics. Those 12 MLAs who have defected from the party should be made to lose elections without even getting deposits. Revanth Reddy said that they should be defeated permanently and politically suppressed. Ram Reddy Venkat Reddy is the undefeated leader of Khammam district for five times. He is a great leader who helped everyone.

Ram Reddy brothers risked their lives to serve the people. When such a leader died due to illness, we all asked to unanimously elect his wife but this shameless KCR resorted to an election. There was a good tradition in the united state that if any MLA died, his family members would be unanimously elected. He said that this Chief Minister is a scoundrel who trampled on that tradition and insulted Venkat Reddy’s family by opting for a candidate in the by-election. That’s why Venkat Reddy’s soul was upset and haunted KCR and made TRS candidates lose 9 seats in the joint Khammam district.

Revanth Reddy said that he met Bhukya Ramesh’s family on his way. Ramesh died accidentally while working in the armed rebellion. He has a wife and three children. Ramesh’s wife is in a situation where she cannot leave her in-laws. Why KCR, who boasts a lot, is not taking responsibility for supporting Ramesh’s family? Colonel Santosh Babu’s wife was given a job. He questioned why tribal Bhukya Ramesh’s family would not be supported similarly.

Farmers were seen protesting at Ponnekal sub station during the padayatra. What answer will be given by the stupid who said that there may be power cuts in New York but not in Telangana. Everywhere in the state, farmers are protesting on the roads due to power cuts. In 2004, the Congress party signed first on the free electricity file after coming to power. It provided reliable electricity for 9 hours during the day. Even now the conditions of 2004 are visible in the state. It is not possible for KCR to provide 24 hours electricity. Discoms are in debt of Rs.60000 crore. Out of that, Rs.28000 crores have to be paid by the government itself. Electricity companies are in danger of closing. There is a need to build another Bashir Bagh type movement in the state.

Revanth Reddy said that he is also asking the communist friends to come together for this. 29 farmers committed suicide in this area. 23 of them are tribals. Farmers have not forgotten the incident in Khammam where farmers were arrested for asking support prices. KCR should pay for this. Under KCR’s regime, 2BHK houses were not given, Dalits were not given three acres and there are no loan waiver for farmers. Let’s destroy the rule of such tyrants and build a people’s reign. Congress will come to power on January 1, 2024. We will provide Rs.5 lakhs to every poor person who builds houses. We will take the responsibility of waiving the loans of Rs.2 lakh to the farmers. Steps will be taken to fill up 2 lakh vacant government jobs.

The Congress takes responsibility for the management of podu lands as per the Forest Land Rights Act. He said that he will try his best to give priority to the Ram Reddy Venkat Reddy family politically if there is any chance. He also promised to take the responsibility of laying the foundation stone for Bayyaram Steel Plant on January 26, 2024 and provide employment and job opportunities to thousands of youth.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X